Tag Archives: Preliminary examination on December 26 and 27

నిరుద్యోగులకు శుభవార్త.. ఐబీపీఎస్ 647 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు..!

కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల ప్రతి సంవత్సరం మే, జూన్ నెలలలో జరిగే పోటీ పరీక్షలు ఈ సంవత్సరం ఆలస్యంగా జరుగుతున్నాయి. అయితే గతంతో పోలిస్తే కరోనా విజృంభణ తగ్గడంతో ఐబీపీఎస్ 647 ఉద్యోగాలను సీఆర్పీ(కామన్ రికూట్మెంట్ ప్రాసెస్) ద్వారా భర్తీ చేయనుంది. లా ఆఫీసర్, రాజ్ భాష అధికారి, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్లు, ఐటీ ఆఫీసర్ల ఉద్యోగులను ఐబీపీఎస్ భర్తీ చేయనుంది. ఈ నెల 23వ తేదీలోగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

బీఈ, బీటెక్, పీజీ ఉత్తీర్ణత సాధించిన వాళ్లు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్ 1వ తేదీ నాటికి 30 సంవత్సరాల లోపు వయస్సు వాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులవుతారు. ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షల ద్వారా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు ఎంపికవుతారు. డిసెంబర్ 26, 27 తేదీల్లో ప్రిలిమినరీ పరీక్ష, 2021 జనవరి 24వ తేదీన మెయిన్ పరీక్ష జరుగుతాయి. ఈ ఉద్యోగాలకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు 175 రూపాయలు, మిగిలిన అభ్యర్థులు 850 రూపాయలు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఉద్యోగాలలో ఐటీ ఆఫీసర్లు 20, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ 485, రాజ్ భాష అధికారి 25, లా ఆఫీసర్ 50, హెచ్.ఆర్ 7, మార్కెటింగ్ ఆఫీసర్ 60 ఉద్యోగాలు ఉన్నాయి. https://www.ibps.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన మరింత సమాచారాన్ని సులభంగా తెలుసుకోవచ్చు.

ఐబీపీఎస్ ఈ ఉద్యోగాలతో పాటు మరికొన్ని ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్లు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. వరుసగా నోటిఫికేషన్లు విడుదలవుతూ ఉండటంతో నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరుతోంది.