Tag Archives: private companies

నిరుద్యోగ యువతీ, యువకులకు శుభవార్త.. 1500 వరకు ఉద్యోగ ఖాళీలకు ఇంటర్వ్యూలు..

నిరుద్యోగ యువతీ, యువకులకు శుభవార్త. ప్రైవేట్ సంస్థలో ఉద్యోగాలు పొందాలనుకునే వారికి.. ఈ నెల 9 న ప్రైవేట్ సంస్థలలో ఉద్యోగాలకు జాబ్ మేళా ఉంటుందని.. రంగారెడ్డి జిల్లా ఉపాధి కల్పన అధికారిణి జయశ్రీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

పూర్తి వివరాలకు 8309877396 నెంబర్‌లో సంప్రదించాలిని అధికారిణి తెలిపారు. ఈ జాబ్ మేళాలో ఐటీ రంగంలోని పేరుగాంచిన జియో మార్ట్‌, స్విగ్గీ, అపోలో ఫార్మసీ, స్చైండర్‌ ఎలక్ట్రిక్‌, జేఎస్‌ఆర్‌ గ్రూప్‌, వేగారియస్‌ సొల్యూషన్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఆక్సిస్‌ బ్యాంక్‌, బిగ్‌ సి, కార్వీ, ఓజాస్‌ ఇన్నోవేటివ్‌, టెక్నాలజీస్‌, విర్టస్‌ ఐటీ ఇండియా వంటి కంపెనీల పొల్గొటాయని పేర్కొన్నారు.

దీనిలోని వివిధ విభాగాల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. ముఖ్యంగా బ్యాంకింగ్‌‌, ఫైనాన్స్‌ అకౌంట్స్‌, మ్యానుప్యాక్చరింగ్‌, మార్కెటింగ్‌, ఐటి, ఐటీఈఎస్‌, ఫార్మా,హెచ్‌పీ తదితర ఉద్యోగాల భర్తీకి ఈ జాబ్ మేళా ఉంటుందని వివరించారు. పదో తరగతి, బీటెక్, ఇంటర్, ఎంటెక్, గ్రాడ్యుయేట్‌, పీజీ , డిప్లామా చేసిన వాళ్లు దీనికి అర్హులుగా పేర్కొనాన్నారు.

18 ఏళ్ల నంచి 35 ఏళ్ల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సిందిగా పేర్కొన్నారు. దీనిలో ఎంపికైన వారికి అర్హతకు తగిన వేతనం ఉంటుందని.. మొత్తం 1500 కి పైగా ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు పేర్కొన్నారు. హబ్సిగూడలోని ఓమేగా డిగ్రీ అండ్‌ పీజీ కళాశాల ఆవరణలో నిర్వహించే జాబ్‌మేళాలో ఈ నెల 9న అంటే గురువారం రోజున పాల్గొనాలని పేర్కొన్నారు.

రైలు ప్రయాణికులకు షాకింగ్ న్యూస్.. ఆ ఛార్జీలు రెట్టింపు..?

గత కొన్ని నెలల నుంచి రైల్వే శాఖ రైలు ప్రయాణికులకు వరుస షాకులు ఇస్తోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా భారీగా ఛార్జీలను పెంచుతోంది. కరోనా వైరస్, లాక్ డౌన్ నిబంధనల వల్ల రైల్వే శాఖకు భారీగా ఆదాయం తగ్గిన సంగతి తెలిసిందే. దీంతో ఆదాయం పెంచుకోవడం కోసం ప్రయాణికులపై భారం మోపడానికి రైల్వే శాఖ సిద్ధమవుతోంది. దేశవ్యాప్తంగా ఫ్లాట్ ఫామ్ టికెట్ ధరను రెట్టింపు చేయాలని రైల్వే శాఖ భావిస్తోంది.

ప్రస్తుతం దేశంలోని పలు రైల్వే స్టేషన్లలో 10 రూపాయలుగా ఉన్న ప్లాట్ ఫామ్ టికెట్ ధర ఏకంగా 20 రూపాయలకు పెరగనుంది. అయితే రైల్వే శాఖ మొదట ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులు ప్రయాణించే రైళ్లలో మాత్రమే ప్లాట్ ఫామ్ టికెట్ రేట్లను పెంచనుంది. భవిష్యత్తులో ఇతర రైల్వే స్టేషన్లలో సైతం టికెట్ రేట్లు భారీగా పెరిగే అవకాశాలు ఐతే ఉన్నాయని తెలుస్తోంది. ప్లాట్ ఫామ్ టికెట్ ధరల పెంపుపై ప్రయాణికుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఈ ఛార్జీలతో పాటు రైల్వే శాఖ భవిష్యత్తులో యూజర్ డెవలప్మెంట్ ఛార్జీలను కూడా వసూలు చేయనుందని తెలుస్తోంది. మొదట 121 రైల్వే స్టేషన్లలో యూజర్ డెవలప్మెంట్ ఛార్జీలను విధించనున్నారని ఆ రైల్వే స్టేషన్లలోనే ప్లాట్ ఫామ్ టికెట్ ధరలు భారీగా పెరగనున్నాయని సమాచారం. రైల్వే బోర్డు చైర్మన్, సీఈవో వినోద్ కుమార్ యాద్ రైల్వే చార్జీల గురించి మాట్లాడుతూ దేశంలో ప్రస్తుతం 7,000 రైల్వే స్టేషన్లు ఉన్నాయని తెలిపారు.

వీటిలో 121 రైల్వే స్టేషన్లలో రీడెవలప్‌మెంట్ కోసం కేంద్రం ప్రయత్నిస్తోందని.. మొదట 10 నుంచి 15 శాతం రైల్వే స్టేషన్లలో యూజర్ ఛార్జీలు అమలవుతాయని పేర్కొన్నారు. ప్రైవేట్ కంపెనీల భాగస్వామ్యంతో రీడెవలప్మెంట్ కోసం కేంద్రం ప్రయత్నిస్తోందని తెలిపారు. రెనోవేషన్, డెవలప్‌మెంట్, మెయింటెనెన్స్ లను ప్రైవేట్ కంపెనీలకు రైల్వే శాఖ అప్పగించబోతుందని వెల్లడించారు.