నిరుద్యోగ యువతీ, యువకులకు శుభవార్త. ప్రైవేట్ సంస్థలో ఉద్యోగాలు పొందాలనుకునే వారికి.. ఈ నెల 9 న ప్రైవేట్ సంస్థలలో ఉద్యోగాలకు జాబ్ మేళా ఉంటుందని.. రంగారెడ్డి జిల్లా ఉపాధి కల్పన అధికారిణి జయశ్రీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
పూర్తి వివరాలకు 8309877396 నెంబర్‌లో సంప్రదించాలిని అధికారిణి తెలిపారు. ఈ జాబ్ మేళాలో ఐటీ రంగంలోని పేరుగాంచిన జియో మార్ట్, స్విగ్గీ, అపోలో ఫార్మసీ, స్చైండర్ ఎలక్ట్రిక్, జేఎస్‌ఆర్ గ్రూప్, వేగారియస్ సొల్యూషన్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఆక్సిస్ బ్యాంక్, బిగ్ సి, కార్వీ, ఓజాస్ ఇన్నోవేటివ్, టెక్నాలజీస్, విర్టస్ ఐటీ ఇండియా వంటి కంపెనీల పొల్గొటాయని పేర్కొన్నారు.
దీనిలోని వివిధ విభాగాల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్స్ అకౌంట్స్, మ్యానుప్యాక్చరింగ్, మార్కెటింగ్, ఐటి, ఐటీఈఎస్, ఫార్మా,హెచ్‌పీ తదితర ఉద్యోగాల భర్తీకి ఈ జాబ్ మేళా ఉంటుందని వివరించారు. పదో తరగతి, బీటెక్, ఇంటర్, ఎంటెక్, గ్రాడ్యుయేట్, పీజీ , డిప్లామా చేసిన వాళ్లు దీనికి అర్హులుగా పేర్కొనాన్నారు.
18 ఏళ్ల నంచి 35 ఏళ్ల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సిందిగా పేర్కొన్నారు. దీనిలో ఎంపికైన వారికి అర్హతకు తగిన వేతనం ఉంటుందని.. మొత్తం 1500 కి పైగా ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు పేర్కొన్నారు. హబ్సిగూడలోని ఓమేగా డిగ్రీ అండ్ పీజీ కళాశాల ఆవరణలో నిర్వహించే జాబ్‌మేళాలో ఈ నెల 9న అంటే గురువారం రోజున పాల్గొనాలని పేర్కొన్నారు.
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్‌లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్‌తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…