Tag Archives: private schools

విద్యార్థుల తల్లిదండ్రులకు అలర్ట్.. వాళ్లకు మాత్రమే అమ్మఒడి..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినీవిద్యార్థులకు ప్రయోజనం చేకూరేలా అమ్మఒడి పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. పాఠశాల విద్యా సంచాలకుడు వాడ్రేవు చినవీరభద్రుడు అమ్మఒడి స్కీమ్ గురించి కీలక ప్రకటన చేశారు. 2020 – 2021 సంవత్సరానికి సంబంధించి విద్యార్థులు తమ వివరాలను వెబ్ పోర్టల్ ద్వారా చెక్ చేసుకోవాలని సూచించారు.

అధికారులతో ఈ స్కీమ్ గురించి సమీక్ష నిర్వహించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఈ స్కీమ్ కు అర్హులు. విద్యార్థుల తల్లిదండ్రులు వెబ్ పోర్టల్ లో నమోదైన బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్‌సీ కోడ్, రైస్ కార్డు నెంబర్ అన్నీ చెక్ చేసుకోవాలి. అన్నీ సరిగ్గా ఉంటే ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం పొందవచ్చు.

ఏవైనా తప్పులు ఉంటే పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని సంప్రదించి తప్పులు సరిచేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అర్హులైన విద్యార్థినీవిద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలో ప్రభుత్వం ప్రతి సంవత్సరం 15,000 రూపాయల చొప్పున జమ చేస్తోంది. అర్హులైన వారికి జనవరి నెల తొలి వారంలో అమ్మఒడి డబ్బులు బ్యాంక్ అకౌంట్ లో జమవుతాయి. ప్రభుత్వం గతేడాది నుంచి అమ్మఒడి స్కీమ్ ను అమలు చేస్తోంది.

ఈ నెల 15వ తేదీలోగా అరులైన విద్యార్థులు వివరాలను అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. దారిద్రరేఖకు దిగువన ఉండి బియ్యం కార్డ్ ఉన్నవారు మాత్రమే ఈ స్కీమ్ కు అర్హులవుతారు. అయితే కొన్ని ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థుల డేటాను పంపాలంటే విద్యార్థులు ఆన్ లైన్ క్లాసులకు హాజరు కావాలని నిబంధనలు విధిస్తున్నట్టు తెలుస్తోంది.

సీఎం జగన్ సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లకు భారీ షాక్..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ రాష్ట్రంలోని ప్రజలకు ప్రయోజనం చేకూర్చే విధంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా జగన్ సర్కార్ ప్రైవేట్ స్కూళ్లకు భారీ షాక్ ఇచ్చేలా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రైవేట్ స్కూళ్లు టీచర్లకు వృత్తికి సంబంధం లేని పనులు చెప్పవద్దని, ప్రైవేట్ స్కూళ్లు టీచర్లను అడ్మిషన్ల కోసం విద్యార్థుల తల్లిదండ్రుల ఇళ్లకు పంపించవద్దని సూచించింది.

జగన్ సర్కార్ నుంచి ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. సాధారణంగా ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు టీచర్లకు టార్గెట్ విధించి మరీ టీచర్లు ఇంటింటికీ తిరిగి విద్యార్థులను స్కూళ్లలో చేర్పించాలని చెబుతూ ఉంటాయి. టీచర్లు అలా చేయకపోతే వేతనాల్లో కోత విధించడం లేదా వాళ్లను ఉద్యోగాల నుంచి తొలగించడం చేస్తూ ఉంటాయి. కొందరు టీచర్లు ఈ విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంతో విద్యాశాఖ నుంచి ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి.

ప్రభుత్వ ఆదేశాల వల్ల ఇకపై పాఠశాలల యాజమాన్యాలు ఉపాధ్యాయులకు సంబంధం లేని పనులను చెప్పకూడదు. ఉపాధాయులను బలవంతంగా విద్యార్థుల ఇళ్లకు పంపినా లేదా ప్రైవేట్ పాఠశాలల్లో చేర్చాలంటూ వచ్చినా అలాంటి పాఠశాలలపై విద్యాశాఖ చర్యలు తీసుకోనుంది. మరోవైపు జగన్ సర్కార్ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోనుంది.

జగన్ సర్కార్ ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతం దిశగా అడుగులు వేస్తోంది. నాడు- నేడు ద్వారా జగన్ సర్కార్ ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలను మార్చేందుకు అడుగులు వేస్తోంది. అమ్మఒడి, జగనన్న విద్యా కానుక, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన స్కీమ్ ల ద్వారా జగన్ సర్కార్ విద్యార్థులకు ప్రయోజనం చేకూరేలా చేస్తోంది.