ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినీవిద్యార్థులకు ప్రయోజనం చేకూరేలా అమ్మఒడి పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. పాఠశాల విద్యా సంచాలకుడు వాడ్రేవు చినవీరభద్రుడు అమ్మఒడి స్కీమ్ గురించి కీలక ప్రకటన చేశారు. 2020 – 2021 సంవత్సరానికి సంబంధించి విద్యార్థులు తమ వివరాలను వెబ్ పోర్టల్ ద్వారా చెక్ చేసుకోవాలని సూచించారు.
అధికారులతో ఈ స్కీమ్ గురించి సమీక్ష నిర్వహించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఈ స్కీమ్ కు అర్హులు. విద్యార్థుల తల్లిదండ్రులు వెబ్ పోర్టల్ లో నమోదైన బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్‌సీ కోడ్, రైస్ కార్డు నెంబర్ అన్నీ చెక్ చేసుకోవాలి. అన్నీ సరిగ్గా ఉంటే ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం పొందవచ్చు.
ఏవైనా తప్పులు ఉంటే పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని సంప్రదించి తప్పులు సరిచేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అర్హులైన విద్యార్థినీవిద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలో ప్రభుత్వం ప్రతి సంవత్సరం 15,000 రూపాయల చొప్పున జమ చేస్తోంది. అర్హులైన వారికి జనవరి నెల తొలి వారంలో అమ్మఒడి డబ్బులు బ్యాంక్ అకౌంట్ లో జమవుతాయి. ప్రభుత్వం గతేడాది నుంచి అమ్మఒడి స్కీమ్ ను అమలు చేస్తోంది.
ఈ నెల 15వ తేదీలోగా అరులైన విద్యార్థులు వివరాలను అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. దారిద్రరేఖకు దిగువన ఉండి బియ్యం కార్డ్ ఉన్నవారు మాత్రమే ఈ స్కీమ్ కు అర్హులవుతారు. అయితే కొన్ని ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థుల డేటాను పంపాలంటే విద్యార్థులు ఆన్ లైన్ క్లాసులకు హాజరు కావాలని నిబంధనలు విధిస్తున్నట్టు తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…