Tag Archives: Pulasa Fish cost

జాలర్ల వలలో పులస చేప.. ఎంత ధర పలికిందో తెలుసా..?

ఊళ్లలో చెరువులో చేపలు పట్టేటప్పుడు పండగ వాతావరణం నెలకొంటుంది. ప్రతీ ఒక్కరూ ఆ చేపలను కొనుక్కునేందకు ఆసక్తి కనబరుస్తారు. అయితే అక్కడ కిలో చేపలు ఒక రేటు ఫిక్స్ చేసుకొని విక్రయిస్తుంటారు. చెరువులో ఎక్కువగా బంగారు తీగ, రవ్వలాంటి చేపలు ఉంటాయి. అయితే సముద్రంలో గానీ.. యేటిలో గానీ చేపలు పట్టేటప్పుడు కొన్ని అరుదైనవి కనిపిస్తుంటాయి.

జాలర్లకు అవి పడ్డాయంటే ఇక పండగే. కొన్ని చేపలను ఎక్కువ డబ్బులు పెట్టి కొనుక్కుంటారు చాలామంది. అరుదైన చేపలు జాలర్లకు అంత సులువు చిక్కవు. ఇదిల ఉంటే.. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో దొరికిన ఒక భారీ చేప ఇప్పుడు వార్తలో నిలిచింది. అంతర్వేది నది తీరంలో మత్స్యకారుల వలలో ఓ పులస చేప చిక్కింది.

అయితే ఈ చేప ఎంత ధర పలికిందో తెలుసా.. ఆ ధర తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆ పులస చేపను స్థానిక మత్య్సకారులు మార్కెట్‌లో వేలానికి పెట్టగా పులస ప్రియులు ఎగబడి మరీ పాల్గొన్నారు. వేలంలో మొదట రూ.2 వేల నుండి మొదలైంది. ఈ వేలం నిర్వహించ క్రమంలో చాలామంది గూమిగూడారు. చివరికి నరసాపురానికి చెందిన ఓ వ్యాపారి రూ.18 వేలకు దక్కించుకున్నాడు.

దాదాపు ఆ పులస చేప 2 కేజీల వరకు ఉంటుంది. అయితే ఉభయ గోదావరి జిల్లాలో పులస చేపలకు మంచి డిమాండ్ ఉంటుంది. పులస చేప దొరికిందంటే చాలు ఎగబడి మరీ కొనుక్కుంటారు. ఇలా ఆ చేపకు అంత ధర పెట్టి తీసుకోవడంతో ఈ న్యూస్ వైరల్ గా మారింది.