Tag Archives: raja shekar

Rajashekhar-Cash Show: క్యాష్ షోలో హీరో రాజశేఖర్ ఫ్యామిలీ..! చివరి పంచ్ మామూలుగా లేదుగా..!

Rajashekhar-Cash Show: రాజశేఖర్.. యాంగ్రీ యంగ్ మ్యాన్ గా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు. ఒకానొక సమయంలో అగ్రహీరోలకు తీసిపోని విధంగా సినిమా హిట్లు కొట్టారు. ముఖ్యంగా పోలీస్ క్యారెక్టర్ అంటే ముందుగా గుర్తుకు వచ్చేపేరు రాజశేఖర్ అంతలా పోలీస్ క్యారెక్టర్లలో పరకాయ ప్రవేశం చేసిన వ్యక్తి.

రాజశేఖర్ వేసిన పోలీస్ క్యారెక్టర్లు చూసే కొంత మంది హీరోలు తమ తర్వాతి సినిమాల్లో పోలీస్ క్యారెక్టర్లు చేశారంటే అతిశయోక్తి కాదు. అయితే ఇటీవల హిట్లు లేకపోవడంతో రాజశేఖర్ చాలా స్లో అయ్యారు. ముఖ్యంగా కొన్ని వివాదాలు చుట్టుముట్టడంతో కెరీర్ సాఫీగా సాగలేదు.

ఎదైనా స్ట్రెయిట్ పార్వర్డ్ గా మాట్లాడటం చాలా మందికి నచ్చలేదు. అయినా కూడా తన పంథాను మార్చుకోలేదు రాజశేఖర్. తను మాట్లాడాలనుకున్నది సూటిగా సుత్తి లేకుండా చెప్పడం రాజశేఖర్ స్టైల్. తాజాగా ఆయన క్యాష్ షోకు వచ్చారు.

తన ఇద్దరు కూతుళ్లతో షోకు ఎంట్రీ..


సంక్రాంతి రోజు ప్రసారమయ్యే ఈ షో ప్రోమోను రిలీజ్ చేశారు. జీవితతో పాటు తన ఇద్దరు కూతుళ్లతో షోకు ఎంట్రీ ఇచ్చాడు. బుల్లెట్ బండిపై రావడం ప్రత్యేకతను సంతరించుకుంది. ఇద్దరు కూతుళ్లు శివాత్మిక, శివానిలతో క్యాష్ ప్రోగ్రామ్‌లో సందడి చేశారు రాజశేఖర్. ఇదిలా ఉంటే ప్రోగ్రాం చివర్లో రాజశేఖర్ వేసిన పంచ్ షో కే హైలెట్ గా నిలిచింది. సాధారణంగా రాజశేఖర్ మాట్లాడేటప్పుడు జీవిత అందిస్తుంటుంది. రాజశేఖర్ గారూ మా క్యాష్ ప్రోగ్రామ్ ఎలా ఉంది?’ అని సుమ అడగడంతో.. ‘సూపర్బ్ ఉంది.. కానీ’.. అంటూ గ్యాప్ ఇచ్చారు.. ఆ గ్యాప్‌ని జీవిత ఫిల్ చేస్తారు అనుకుంటే.. హా అంతే అంటూ ముక్తాయింపు ఇచ్చేశారు.. దీంతో ఆయన స్టేజ్‌పై నవ్వులు వెల్లివిరిశాయి. ప్రస్తుతం రాజశేఖర్ ‘ శేఖర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మళయాళంలో సూపర్ హిట్ అయిన జోసెఫ్ సినిమాను రిమేక్ చేస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్ గా సినిమా రాబోతోంది.

‘స్నేహం కోసం’ సినిమాలో ఆ పాత్రకు సూపర్‌‌‌స్టార్ కృష్ణ, తర్వాత రాజశేఖర్ ను అనుకున్నారట.. కానీ చివరకు..

ఒకప్పుడు తమిళంలో కె. ఎస్. రవికుమార్ దర్శకత్వంలోనే వచ్చిన నట్పుక్కాగ అనే చిత్రం మెగస్టార్ చిరంజీవిని బాగా ఆకట్టుకుంది. తమిళంలో శరత్ కుమార్, సిమ్రాన్ జంటగా నటించారు. దానిని 1999లో అతడి దర్శకత్వంలోనే ‘స్నేహం కోసం’ అనే తెలుగు టైటిల్ తో విడుదల అయిన విషయం తెలిసిందే. చిరంజీవి, మీనా ఇందులో ప్రధాన పాత్రధారులు.

శ్రీ సూర్య మూవీస్ బ్యానరు పై ఎ. ఎం. రత్నం ఈ చిత్రాన్ని నిర్మించాడు. చిరంజీవి ఇందులో తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేశాడు. తండ్రి చిరంజీవికి ఆప్తమిత్రుడిగా ప్రముఖ నటుడు విజయకుమార్ నటించాడు. ఈ సినిమా పెద్ద బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. అయితే అందులో చిరంజీవి స్నేహితుడిగా విజయ కుమార్ చేసిన పాత్రకి ముందుగా సూపర్ స్టార్ కృష్ణని అనుకున్నారట.

మెగాస్టార్ చిరంజీవి నటించిన స్నేహంకోసం సినిమా షూటింగ్‌‌కి ముందు వీరిద్దరూ ఇందులో కలిసి నటిస్తున్నారని వార్తలు వచ్చాయి. కానీ అవి కేవలం వార్తలుగానే మిగిలిపోయాయి. ఎందుకుంటే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మూడు సినిమాలు బంపర్ హిట్ అయ్యాయి. అందుకనే అలా ఆలోచించారట. ఇదంతా అనుకుంటుడగానే.. చిరంజీవి ఎందుకో సూపర్ స్టార్ ను సంప్రదించలేదట. తర్వాత ఆ పాత్రను రాజశేఖర్ ను అనుకొని అతడిని సంప్రదించారు మూవీ మేకర్స్.

ఇక రాజశేఖర్ ఆ పాత్రకు ఓకె అయిన సమయంలో చిరంజీవి వెళ్లి.. ఆ పాత్ర చేయకపోవడమే మంచిది.. ఈ సమయంలో ఓల్డ్ రోల్స్ చేయడం కరెక్ట్ కాదని చెప్పడంతో విరమించుకోవాల్సి వచ్చిందట. చివరకు ఆ పాత్రకు తమిళంలో నటించిన విజయ్ కుమారే చేయాల్సి వచ్చిందట.