Tag Archives: rajesh manduri

Acharya Movie: ఆచార్య సినిమా నాదే… నన్ను మోసం చేసి కథ కొట్టేసారు: రచయిత రాజేష్ మండూరి

Acharya Movie: మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో కొరటాల శివ దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై రామ్ చరణ్ నిరంజన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆచార్య. ఈ సినిమా ఈనెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే చిత్రబృందం పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

Acharya Movie: ఆచార్య సినిమా నాదే… నన్ను మోసం చేసి కథ కొట్టేసారు: రచయిత రాజేష్ మండూరి

ఈ విధంగా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్న నేపథ్యంలో ఆచార్య సినిమా కథ కాపీ అంటూ రచయిత రాజేష్ మండూరి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. ఈ సందర్భంగా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజేష్ ఈ విషయాన్ని తెలియజేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.రాజేష్ సొంత గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా రామాలయంలో జరిగిన ఒక సంఘటన ఆధారంగా ఈ కథను సిద్ధం చేశానని వెల్లడించారు.

Acharya Movie: ఆచార్య సినిమా నాదే… నన్ను మోసం చేసి కథ కొట్టేసారు: రచయిత రాజేష్ మండూరి

ఇలా ఎంతో కష్టపడి ఈ సినిమాని క్రియేటివ్ గా కాకుండా నా జీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా తెరకెక్కించి మా నియోజకవర్గ ఎమ్మెల్యే సహాయంతో వారి సొంత బ్యానర్ అయిన మైత్రి మూవీ మేకర్స్ వారికి సినిమా కథ వినిపించానని తెలిపారు. ఈ విధంగా మైత్రి మూవీ మేకర్స్ వారికి ఈ సినిమా కథను వినిపించగా నిజంగా కథ చాలా అద్భుతంగా ఉందని వారు నన్ను అప్రిషియేట్ చేశారు. ఇలా బ్రీఫ్ గా కథ విన్న మైత్రి మూవీ మేకర్స్ వారి బ్యానర్ కి సంబంధించిన చెర్రీ అనే వ్యక్తికి కథ మొత్తం పిన్ టు పిన్ వివరించాను.

ఇలా కథ చెబుతున్న సమయంలో చెర్రీ అనే వ్యక్తి ఫోన్ రికార్డర్ ఆన్ చేసి పెట్టారు. అయితే తనకు సంబంధించిన వాళ్ళు అక్కడ లేకపోవడంతో తరువాత వారు ఈ కథను వింటారనే ఉద్దేశంతోనే రికార్డర్ ఆన్ చేశారని నేను భావించాను ఇలా కథను మొత్తం వింటూ రికార్డ్ చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఇలాంటి సినిమా కొరటాల శివలాంటి వారు చేస్తే చాలా బాగుంటుంది అని నాతో అన్నారు.

ఇలా కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చిన వారిపై పెద్ద మొత్తంలో బడ్జెట్ పెట్టడం కుదరదు అంటూ అప్పుడు మాట్లాడారు. ఇలా కథ మొత్తం విని ఏ విషయము తనకు తెలియ చేయకపోవడంతో తాను కూడా వారికి కథ నచ్చలేదేమో బడ్జెట్ ఎక్కువ అవుతుందని భావించారేమో అందుకే ఎలాంటి సమాచారం అందించలేదని మేము కూడా మా తదుపరి సినిమాల పై ఫోకస్ పెట్టాము.

దారుణంగా మోసం చేశారు..

ఇలా నా దగ్గర విని రికార్డ్ చేసుకున్న కథ చివరికి కొరటాల శివ దగ్గరకు వెళ్లిందని, నన్ను మోసం చేసి నా కథని కాపీ కొట్టారంటూ రాజేష్ వెల్లడించారు. ఈ క్రమంలోనే ఈ విషయం తెలిసి అసోసియేషన్ కు ఫిర్యాదు చేయడం వారు నా కథను మొత్తం కొరటాలకు పంపిస్తే అతను నా కథకు తన కథకు సంబంధం లేదని చెప్పారు. నా కథను అతనికి పంపించినప్పుడు తను కూడా తన ఆచార్య సినిమా కథను నాకు పంపించాలి. కానీ 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కథను ఎలా ఇస్తాము అంటూ కొరటాల తన కథను ఇవ్వలేదంటూ రాజేష్ ఆవేదనచెందారు.ఇలా మోసం చేసి నా నుంచి ఆచార్య సినిమాని కాపీ కొట్టారంటూ ఈయన ఈ సందర్భంగా వెల్లడించారు. ప్రస్తుతం రాజేష్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.