Tag Archives: Rajiv Gandhi

Rajiv Gandhi: రాజీవ్ గాంధీ బ్రతికే ఉంటే కృష్ణ సీఎం అయ్యేవారా.. రాజీవ్ గాంధీతో కృష్ణకున్న అనుబంధం ఏంటి?

Rajiv Gandhi:టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కృష్ణ కేవలం హీరోగా మాత్రమే కాకుండా రాజకీయ నాయకుడిగా కూడా చెరగని ముద్ర వేసుకున్నారు బాధ్యతలను నిర్వర్తించే రాజకీయాలలో కూడా ఎంతో చురుగ్గా పాల్గొన్నారు. సినిమా ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్న నందమూరి తారకరామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆంధ్ర సీఎంగా బాధ్యతలు చేపట్టారు.

ఆంధ్రాలో ఎన్టీఆర్ ను ఎదిరించే నాయకుడు కావాలని కాంగ్రెస్ నేతలు ఎదురుచూస్తున్నారు. అయితే ఇందిరాగాంధీ మరణించిన సమయంలో ఆయన అంత్యక్రియలకు కృష్ణ హాజరు కావడంతో అప్పటినుంచి రాజీవ్ గాంధీతో మంచి స్నేహం ఏర్పడింది. ఇలా రాజీవ్ గాంధీతో ఏర్పడిన ఈ స్నేహం కారణంగానే రాజీవ్ గాంధీ ఆహ్వానం మేరకు కృష్ణ ఏలూరు నుంచి ఎంపీగా పోటీ చేసే 71 వేల ఓట్ల మెజార్టీతో గెలిచి సంచలనం సృష్టించారు.

అదే సమయంలోనే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ఎన్టీఆర్ ను ఎదిరించే దమ్మున్న నాయకుడు కృష్ణ అని భావించినటువంటి ఈయనకు సీఎం రేసులో దింపాలని భావించారు.ఈ విధంగా రాజీవ్ గాంధీ సైతం కృష్ణ ను సీఎం చేయాలని అహర్నిశలు కృషి చేశారు.ఇక వచ్చే ఎన్నికలలో కృష్ణ సీఎంగా పోటీ చేస్తారు అనే వార్తలు వచ్చాయి.

Rajiv Gandhi: రాజీవ్ గాంధీ హత్యతో రాజకీయాలకు దూరమైన కృష్ణ…

అదే సమయంలోనే 1991లో రాజీవ్ గాంధీ హత్యకు గురి కావడంతో ఒక్కసారిగా కృష్ణ రాజకీయ ప్రస్థానం అయోమయ పరిస్థితిలో పడిపోయింది.ఇలా రాజీవ్ గాంధీ హత్యకు గురి కావడంతో మద్యంతర ఎన్నికలు రావడం తిరిగి ఈయన పోటీ చేసిన ఓడిపోవడం జరిగింది. ఈ విధంగా రాజీవ్ గాంధీ చనిపోవడంతో ప్రశ్న కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నికలకు దూరమయ్యారు. ఒకవేళ రాజీవ్ గాంధీ కనుక బ్రతికే ఉంటే తెలుగు రాష్ట్రంలో కృష్ణ కూడా సీఎంగా ఉండేవారు అని తెలుస్తుంది.