Tag Archives: Read Later feature

వాట్సాప్ యూజర్లకు శుభవార్త… యాప్ లో మరిన్ని కొత్త ఫీచర్లు..?

మనం ఎక్కువగా ఉపయోగించే అప్లికేషన్లలో ఒకటైన వాట్సాప్ యాప్ యూజర్లకు మరింత చేరువ అయ్యేందుకు ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలను తీసుకుంటున్న సంగతి తెలిసిందే. వేబ్‌టెయిన్‌ఇన్ఫో తెలిపిన సమాచారం ప్రకారం 12 కొత్త ఫీచర్లను యూజర్లకు అందుబాటులొకి తెచ్చేందుకు వాట్సాప్ యాప్ సిద్ధమవుతోందని తెలుస్తోంది. , రిపోర్ట్‌ టు వాట్సాప్‌, రీడ్ లేటర్, వీడియో మ్యూట్, ఇతర ఆప్షన్లను వాట్సాప్ యూజర్లకు అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమవుతోంది.

ప్రస్తుతం వాట్సాప్ యాప్ ను మొబైల్ ఫోన్ తో పాటు వెబ్‌ యాప్‌ ద్వారా ఉపయోగించుకునే అవకాశాన్ని వాట్సాప్ యాప్ కల్పిస్తోంది. అయితే భవిష్యత్తులో ఒకే అకౌంట్‌ ద్వారా ఒకేసారి నాలుగు డివైస్‌ లలో వాట్సాప్ యాప్ ను వినియోగించవచ్చని తెలుస్తోంది. వాట్సాప్ యూజర్లకు మరింత ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో కొత్తకొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తూ యూజర్లకు మరింత దగ్గరవుతోంది.

అడ్వాన్స్‌డ్‌ వాల్‌పేపర్‌ ఫీచర్‌ సహాయంతో వాట్సాప్ యూజర్లకు ఒక్కో కస్టమర్ ను ఒక్కో వాల్ పేపర్ సహాయంతో సేవ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. మెసేజ్ లను తదుపరి కాలంలో యూజర్లు చదివేందుకు రీడ్ లేటర్ ఫీచర్ ను వాట్సాప్ అందుబాటులోకి తీసుకురానుంది. ఆర్కీవ్‌డ్‌ చాట్స్ ఫీచర్‌ పరిధిలోకి రీడ్ లేటర్ ఫీచర్ రానుంది. రీడ్ లేటర్ ఫీచర్ ద్వారా ఆర్కీవ్‌ చేసిన చాట్‌ నుంచి కాల్స్, మెసేజెస్ రాకుండా చేసుకోవచ్చు.

రీడ్‌లేటర్‌ను ఆన్‌ చేస్తే ఆ చాట్ కు సంబంధించిన నోటిఫికేషన్లు కూడా రావని నిపుణులు చెబుతున్నారు. రీడ్ లేటర్ ఫీచర్ ద్వారా మధ్యలో అంతరాయాలకు చెక్ పెట్టవచ్చని వెల్లడిస్తున్నారు. రిపోర్ట్‌ టు వాట్సాప్‌ ఫీచర్‌ ను కూడా వాట్సాప్ అందుబాటులోకి తీసుకురానుందని ఈ ఫీచర్ సహాయంతో కాంటాక్టు నుంచి తదుపరి సందేశాలకు చెక్ పెట్టే ఛాన్స్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.