Category Archives: Technology

Vivo v30: మార్కెట్లోకి విడుదల అయిన వివో సరికొత్త స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ మామూలుగా లేవుగా?

Vivo v30: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజ సంస్థ వివో ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లు విడుదల చేసిన విషయం మనందరికీ తెలిసిందే. వినియోగదారులను మరింత ఆకర్షించడం కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్ లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంటుంది. అందరికి అందుబాటులో ఉండే విధంగా బడ్జెట్ ధరలోనే మంచి మంచి ఫీచర్స్ కలిగిన కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ ని మార్కెట్లోకి లాంచ్ చేసింది వివో సంస్థ. వివో వీ 30 పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. అయితే ప్రస్తుతం చైనాలో లాంచ్‌ అయిన ఈ స్మార్ట్ ఫోన్‌ను త్వరలోనే భారత్‌ తో పాటు ఇతర దేశాల్లోనూ కూడా లాంచ్‌ చేయనున్నారు.

మరి తాజాగా విడుదల అయినా ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన ధర ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో క్వాల్‌ కామ్‌ స్నాప్‌ డ్రాగన్‌ 7 జనరేషన్‌ 3 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ ను అందించారు. కాగా ఈ స్మార్ట్‌ ఫోన్‌ గరిష్టంగా 12 జీబీ ర్యామ్‌ తో రానుంది. ఇక ఇందులో 120 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌ తో కూడిన 3డీ కర్వ్డ్‌ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లే ను అందిస్తున్నారు. కాగా ఈ ఫోన్‌ మనకు బ్లూమ్ వైట్, లష్ గ్రీన్, నోబుల్ బ్లాక్, వేవింగ్ ఆక్వా వంటి కలర్స్‌ లో లభించనుంది. ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ తో పనిచేసే ఈ స్మార్ట్‌ ఫోన్‌ లో 6,78 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌ హెచ్‌డీ అమోఎల్ఈడీ డిస్‌ప్లే ను ఇవ్వనున్నారు. 3డీ కర్వ్డ్ డిస్‌ప్లే హెచ్‌డీఆర్10+ సపోర్ట్‌ను అందించారు.

ఫీచర్ల విషయానికొస్తే..

డీసీఐ పీ3 కలర్ ఆప్షన్ 100 శాతం కవరేజీతో పాటు 2800 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌ ను ఈ ఫోన్‌ అందిస్తుంది. ఇక ఈ స్మార్ట్‌ ఫోన్‌ను 8జీబీ +128జీబీ, 8జీబీ+256జీబీ, 12జీబీ+256జీబీ, 12జీబీ+512జీబీ ర్యామ్ వంటి స్టోరేజ్ వేరియంట్స్‌ లో తీసుకొచ్చారు. అంటే ఈ స్మార్ట్ ఫోన్ మనకు మొత్తం గా నాలుగు వేరియంట్స్ లో లభించనుంది. ఇకపోతే ఈ ఫోన్ కెమెరా విషయానికొస్తే.. వివో వి30 స్మార్ట్‌ ఫోన్‌లో ట్రిపుల్ ఆరా లైట్ రియర్ కెమెరా సెటప్‌ ను అందించారు. 50ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, పోర్ట్రెయిట్ సెన్సార్‌తో కూడిన 50ఎంపీ ఓమ్నివిజన్ ఓవీ50 ఈ సెన్సార్‌ ను ఇచ్చారు. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 50 మెగాపిక్సెల్స్‌ తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను కూడా అందించారు.

Revantha Reddy: రేవంత్ రెడ్డి ప్రేమ వివాహం గురించి ఈ విషయాలు తెలుసా… సినిమాని మించిన ట్విస్టుల?

Revantha Reddy: రేవంత్ రెడ్డి అనుముల తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఓ ప్రభంజనం సృష్టించారు. పిసిసి అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ 2023 అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసినటువంటి ఈయన కాంగ్రెస్ పార్టీని గెలిపించి తెలంగాణలో హస్తం జెండాను ఎగురవేశారు. ఇలా ముఖ్యమంత్రి పదవికి మరికొన్ని గంటలలో రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం కూడా చేయబోతున్నారు.

ఇలా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించబోతున్నటువంటి రేవంత్ రెడ్డి విజయం వెనుక తన భార్య గీతారెడ్డి కూడా ఉన్నారు. ఇలా ఈయన చదువుకుంటున్న సమయంలోనే విద్యార్థి సంఘానికి లీడర్ గా కొనసాగారు ఇలా మొదలైనటువంటి ఈయన ప్రస్థానం నేడు ముఖ్యమంత్రి పదవి అధిష్టించే వరకు చేరుకుంది. ఇక ఈయన రాజకీయ ప్రస్థానం పక్కనపెట్టి వ్యక్తిగత విషయానికి వస్తే రేవంత్ రెడ్డిది ప్రేమ వివాహమని చెప్పాలి.

నాగర్ కర్నూలు జిల్లా కొండారెడ్డి గ్రామంలో జన్మించినటువంటి రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో చదివారు. ఇలా చదువుతున్న సమయంలోనే ఈయన విద్యార్థి సంఘానికి లీడర్ గా ఉన్నారు. అదే సమయంలోనే కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి సోదరుడు కుమార్తె గీతారెడ్డి ప్రేమలో పడ్డారు. ఇక వీర ప్రేమ విషయం గీతారెడ్డి తండ్రికి తెలియడంతో ఆమెను ఢిల్లీలో ఉన్నటువంటి తన సోదరుడు జైపాల్ రెడ్డి వద్దకు పంపించారు. అక్కడికి వెళ్లిన వీర ప్రేమ ప్రయాణం మాత్రం ఆగలేదు. జైపాల్ రెడ్డినే రాయబారిగా మార్చి తమ ప్రేమను గెలిపించుకున్నారు.

రేవంత్ విజయం వెనుక భార్య గీతా రెడ్డి…

రేవంత్ రెడ్డిలో ఉన్నటువంటి పట్టుదల మొండితనం చూసినటువంటి జైపాల్ రెడ్డి తన సోదరుడికి నచ్చ చెప్పారట ఎంతో కసి మొండిదల ఉన్నటువంటి ఈ వ్యక్తి ఎప్పటికైనా ఉన్నత స్థాయిలో ఉంటారని తన సోదరుడికి నచ్చచెప్పి ఈ పెళ్లికి ఒప్పించారు. ఇక వీరిద్దరిది కూడా ఒకే సామాజిక వర్గం కావడంతో పెళ్లికి ఒప్పుకున్నారు. తర్వాత ఈయన జెడ్పిటిసి మెంబర్ గాను ఎమ్మెల్యే గాను, ఎంపీగాను రాజకీయపరంగా అంచలంచలుగా ఎదుగుతూ నేడు ముఖ్యమంత్రిగా గెలుపొందారు. ఇక ఈయన ప్రజాస్వామ్యం అంటూ బయటకు రాగా తన భార్య మాత్రం తన పిల్లల బాధ్యతలను ఎంతో చక్కగా నిర్వర్తిస్తూ తన భర్త విజయానికి కారణం అయింది.

స్మార్ట్ ఫోన్ చార్జింగ్ చేసే విషయంలో మీరు ఈ తప్పులు చేయకండి.. లేదంటే..

ఈ రోజుల్లో ప్రతీ ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉండే ఉంటుంది. అయితే చాలామంది చార్జింగ్ పెట్టే విధానంలో చాలా తప్పులు చేస్తున్నారు. దీంతో బ్యాటరీ లైఫ్ త్వరగా అయిపోతుంటుంది. తర్వాత చార్జింగ్ ఆగడం లేదంటూ లబోదిబోమంటుంటారు. అలా కాకుండా మొదటి నుంచే మనం దీనిపై జాగ్రత్తగా ఉంటే ఆ సమస్య నుంచి ఎంచక్కా బయటపడొచ్చు. స్మార్ట్ ఫోన్ ను ఇష్టారీతిగా ఛార్జింగ్ చేస్తే త్వరగా పాడవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఫోన్ చార్జింగ్ పూర్తిగా అయిపోక ముందే చాలామంది చార్జింగ్ పెడుతుంటారు. అలా చేయకూడదు. ఇది ఫోన్ మన్నికపై ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా 100 శాతం వరకు కూడా చార్జింగ్ అస్సలు చేయకూడదు. రాత్రి పడుకునే ముందు ఛార్జింగ్ పెట్టి ఉదయం తీసేవారు కూడా ఉంటారు.

ఇది మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. 80 నుంచి 90 శాతం వరకు చార్జింగ్ పెడితే చాలు అంటున్నారు నిపుణులు. రాత్రి ఛార్జింగ్ పెట్టి నిద్రపోతే.. ఆఫోన్ వేడెక్కి పేలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఆ పనులు చేయవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 20 శాతం కంటే తక్కువ చార్జింగ్ ఉన్నప్పుడు.. 90 శాంత వరకు చర్జింగ్ పెడితే బ్యాటరీ లైఫ్ పెరిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.

చార్జింగ్ పెడుతూ ఫోన్ మాట్లాడటం.. ఫోన్లోని పాటలను వినడం.. బ్రౌజ్ చేయడం లాంటివి చేస్తే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా ఇంటర్ నెట్ ఉపయోగించే క్రమంలో కూడా చార్జింగ్ బాగా అయిపోతూ ఉంటుంది.. దీనికి సెట్టింగ్ లోకి వెళ్లి ఉపయోగం లేని యాప్స్ ను ఇన్ యాక్టివ్ చేస్తే సరిపోతుంది. చార్జింగ్ మరి కొంత సేపు ఎక్కువగా ఉంటుంది.

రూ.30 వేలకే బ్రాండెడ్ ల్యాప్ టాప్స్.. ఎక్కడంటే?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రస్థాయిలో విజృంభిస్తున్న నేపథ్యంలో వైరస్ ను కట్టడి చేయడం కోసం అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించాయి. ఈ క్రమంలోనే విద్యా సంస్థలన్నీ మూతపడ్డాయి. విద్యా సంస్థలు మూత పడటంతో విద్యార్థులకు తరగతుల విషయంలో ఆటంకం కలగకుండా ఆన్లైన్ ద్వారా తరగతులు బోధించాలని నిర్వహించారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం విద్యార్థులు ఆన్లైన్ ద్వారా తరగతులను వింటున్నారు. ఈ క్రమంలోనే తరగతులను వినడానికి పెద్ద స్క్రీన్ లో ఉన్నటువంటి ల్యాప్టాప్, ట్యాబ్ లకి బాగా డిమాండ్ పెరిగిపోయింది.

ఈ క్రమంలోనే ఆన్లైన్ తరగతులను వినడానికి విద్యార్థులు ఎక్కువ మొత్తంలో డబ్బులు చెల్లించకుండా తక్కువ ధరలకే ఆన్లైన్ తరగతులకు సరిపోయే ల్యాప్టాప్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. కేవలం 30 వేల రూపాయలలోపు ఎన్నో ఫీచర్లు కలిగిన ల్యాప్టాప్లు అందుబాటులో ఉన్నాయి. మరి 30 వేల లోపు బెస్ట్ ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..

*యాపిల్ ఐప్యాడ్ వైఫై మోడల్ ధర కేవలం రూ.29,900 మాత్రమే.

*సాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఏ 8.0 ధర కేవలం 12,350 మాత్రమే. ఈ ట్యాబ్ లో మనకు వైఫై 4జీ కనెక్టివిటీ సదుపాయం ఉంటుంది.

*ఇక లెనోవో యోగా అ ట్యాబ్ కేవలం 20, 999 రూపాయలకే సొంతం చేసుకోవచ్చు. 4జీబీ ర్యామ్, 64 జీబీతో పాటు ఇంటర్నల్ స్టోరేజీ, వైఫై, 4జీ కనెక్టివిటీ ఉంటుంది. 

  • ఏసెర్ వన్ 14 విండోస్ ల్యాప్టాప్ ధర కేవలం 22,997 రూపాయలు.4జీబీ ర్యామ్, 1టీబీ హెచ్డీడీ స్టోరేజీ, ఏఎండీ రడేయాన్ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ దీంట్లో ఉన్నాయి.

ఇవే కాకుండా మరికొన్ని రకాల కంపెనీలకు చెందిన లాప్ టాప్ లు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ విధంగా 30 వేలలోపు ల్యాప్టాప్లు మనకు ఆన్లైన్ తరగతులు వినడానికి, ఎం ఎస్ ఆఫీస్ తో పాటు వీడియో కాన్ఫరెన్స్ లు సాధారణ సాఫ్ట్ వేర్లు వాడటానికి ఈ లాప్టాప్లు సరిపోతాయి.

కేంద్రం సూచించిన కొత్త నిబంధనలకు అన్ని సంస్థలు అంగీకారం… ట్విట్టర్ తప్పా?

భారత ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త నిబంధనలను సోషల్ మీడియా సంస్థలైన ఫేస్ బుక్, గూగుల్, వాట్సాప్, ట్విట్టర్ పాటించాలని, లేకపోతే ఆ సంస్థల పై కఠినమైన చర్యలు తీసుకోనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం సూచించిన కొత్త నిబంధనలకు ట్విట్టర్ తప్ప ఇతర సంస్థలన్నీ నిబంధనలను పాటించాలనే అంగీకారానికి వచ్చాయి. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కొత్త నిబంధనల ప్రకారం సోషల్‌ మీడియా సంస్థలు తమ నోడల్‌ అధికారి, ఫిర్యాదుల్ని పరిష్కరించే అధికారి, కంప్లయెన్స్‌ అధికారికి సంబంధించిన విషయాలను తెలియజేయాల్సి ఉంటుంది.

ఈ నిబంధనలను పాటిస్తూ సంబంధిత అధికారులకు సంబంధించిన విషయాలను తెలియజేయడానికి అన్ని సోషల్ మీడియా సంస్థలు అంగీకారం తెలిపిన, ట్విట్టర్ మాత్రం అందుకు సమ్మతంగా లేదని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం సూచించిన కొత్త నిబంధనలను పాటించడం ద్వారా తమ ఉద్యోగుల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించేవిగా ఉన్నాయని ఢిల్లీ హైకోర్టును వాట్సప్ ఆశ్రయించింది. ఈ క్రమంలోనే ట్విట్టర్ కూడా ఈ నిబంధనల వల్ల తమ ఉద్యోగుల భద్రతకు ముప్పు వాటిల్లుతుందని వ్యాఖ్యానించింది.

ఈ నిబంధనల ప్రకారం భారతదేశంలో తమ సంస్థలో పని చేసే చీఫ్‌ కంపిలియన్స్‌ ఆఫీసర్లు (సీసీవో), కాంటాక్ట్‌ పర్సన్‌ (ఎన్‌సీపీ), ఫిర్యాదుల స్వీకరణ అధికారి (జీపీ) వివరాలను తెలియజేశాయి. కానీ ట్విట్టర్ మాత్రం కేవలం సీసీవో వివరాలను వెల్లడించక పోవడంతో ట్విట్టర్ ,కేంద్రం మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే భారతదేశంలో వర్తించే చట్టానికి లోబడి ఉంటాం కానీ ప్రపంచ వ్యాప్తంగా అనుసరిస్తున్నట్టే సేవల్లో పారదర్శకత, చట్ట నిబంధనల్లో భావ ప్రకటనా స్వేచ్ఛ, గోప్యతను పరిరక్షించే సూత్రాల ద్వారా మేం మార్గనిర్దేశం చేస్తామని ట్విట్టర్ అధికార ప్రతినిధి ఈ సందర్భంగా తెలిపారు.

ఫేస్ బుక్, ఇన్‌స్టా, ట్విట్టర్ బ్యాన్.. అసలు ఏమైంది?

ప్రస్తుత కాలంలో సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు తమ అభిప్రాయాలను, వారికి సంబంధించిన విషయాలను సామాజిక మాధ్యమాలు అయిన ఫేస్ బుక్, ఇన్‌స్టా, ట్విట్టర్ ద్వారా వారి అభిప్రాయాలను, వారికి సంబంధించిన విషయాలను తెలియజేసేవారు. ఈ క్రమంలోనే ఈ మాధ్యమాలకు మిలియన్ల సంఖ్యలో యూజర్లు ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలోనే ఈ విధమైన సామాజిక మాధ్యమాలకు సంబంధించిన ఒక పిడుగులాంటి వార్తను కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది.

సామాజిక మాధ్యమాలైనా ఫేస్ బుక్, ఇన్‌స్టా, ట్విట్టర్ బ్యాన్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలియడంతో నెటిజన్లు అందరూ కాస్త కంగారు పడ్డారు. అయితే ఎవరు కంగారు పడాల్సిన పని లేదని, ఈ యాప్స్ ఎలాంటి పరిస్థితుల్లో కూడా బ్యాన్ అయ్యే పరిస్థితులు లేవని ఫేస్ బుక్, గూగుల్ వంటి సంస్థలు తెలియజేశాయి.

కేంద్ర ప్రభుత్వం విధించిన కొత్త నిబంధనలను మే 26 నుంచి అమలులోకి తీసుకురానున్నారు. ఈ విధంగా అమలులోకి వచ్చే కొత్త నిబంధనలను సోషల్ మీడియా దిగ్గజాలు పాటించాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం విధించిన కొత్త నిబంధనలను పాటించని నేపథ్యంలో ఫేస్ బుక్, ట్విట్టర్,ఇన్‌స్టా వంటి వాటిపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన కొత్త నిబంధనలను పాటించడానికి ఇప్పటికీ ఫేస్ బుక్, గూగుల్ ఓకే చెప్పడంతో వీటికి ఎటువంటి సమస్య లేదు. ఇకపోతే ట్విట్టర్ ఈ నిబంధనల గురించి ప్రభుత్వంతో చర్యలు జరుగుతోందని తెలుస్తోంది. కనుక ఎట్టి పరిస్థితులలో కూడా ఈ సామాజిక మాధ్యమాలను బ్యాన్ చేసే ప్రసక్తే లేదని తెలుస్తోంది.

సింపుల్ ఎనర్జీతో ఇ-స్కూటర్.. ప్రత్యేకతలు ఇవే?

ప్రస్తుతం ఉన్న ఈ భయంకరమైన పరిస్థితులలో ఆటోలో లేదా బస్సులో ప్రయాణం చేయాలంటే ఎంతో సమస్యగా మారింది. ఈ క్రమంలోనే ఎక్కువమంది ద్విచక్ర వాహనాలలో వెళ్లడానికి ఇష్టపడుతున్నారు. అయితే పెట్రోల్, డీజిల్ రేట్లు ఆకాశాన్ని తాకాయి ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరూ చూపు ఎలక్ట్రానిక్ వాహనాలు పై పడింది. ఈ క్రమంలోనే భారత మార్కెట్లో ఎలక్ట్రానిక్ ద్విచక్ర వాహనాలకు భారీ డిమాండ్ ఏర్పడింది.

ఎలక్ట్రానిక్ వాహనాల డిమాండ్ ఏర్పడటంతో ప్రముఖ వాహన తయారీ సంస్థలతో పాటు కొత్త స్టార్టప్​ సంస్థలు ముందుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే బెంగళూరుకు చెందిన మరో స్టార్టప్ సంస్థ సింపుల్ ఎనర్జీ చేరింది. సింపుల్ ఎనర్జీ సంస్థ తన మొట్టమొదటి ఫ్లాగ్‌షిప్ ఇ-స్కూటర్‌ను ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవం కానుకగా ఆగస్టు 15 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

మార్క్ 2 పేరుతో మార్కెట్లోకి విడుదల కానున్న ఎలక్ట్రానిక్ స్కూటర్లు అనేక ప్రత్యేకతలను కలిగి ఉన్నాయి. ఈ స్కూటర్లు గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు.దీనిలో 4.8 కిలోవాట్ల లిథియం- అయాన్ బ్యాటరీని ఉపయోగిస్తున్నారు. టచ్ స్క్రీన్, ఆన్-బోర్డు నావిగేషన్, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి స్మార్ట్ ఫీచర్లు ఈ బండి ప్రత్యేకం.

ఎన్నో ప్రత్యేకతలు కలిగిన ఫ్లాగ్‌షిప్ ఇ-స్కూటర్‌ ధర రూ.1,10,000 నుండి రూ. 1,20,000 వరకు ఉంటుందని సింపుల్ ఎనర్జీ ప్రకటించింది. ఈ సందర్భంగా సింపుల్ ఎనర్జీ ఫౌండర్ మాట్లాడుతూ భారత మార్కెట్​లో సరికొత్త ఎలక్ట్రిక్​ ఈ–స్కూటర్​ను విడుదల చేయనుండటం పట్ల ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.

ఇతరుల జీవితాన్ని నియంత్రించగలిగే సరికొత్త యాప్.. ఏదంటే?

ప్రస్తుత కాలంలో ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ వినియోగం అధికమవడంతో రోజురోజుకు సరికొత్త యాప్ ల వినియోగం కూడా పెరిగింది. మనకు నిత్యం అవసరమయ్యే వివిధ రకాల సేవలను సదరు కంపెనీలు వివిధ యాప్స్ ద్వారా అందిస్తున్నాయి. ఎన్నో స్టార్టప్ కంపెనీలు ప్రస్తుత తరం యువతకు అవసరమయ్యే యాప్స్ పై దృష్టి సారించి బాగా సక్సెస్ అయ్యాయి.

ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఒక సరికొత్త యాప్ యావత్ ప్రపంచ దృష్టిని మొత్తం ఆకర్షిస్తోంది. ఈ యాప్ ద్వారా ఇతరుల జీవితాన్ని నియంత్రించగలిగే శక్తి యూసర్ లకు కల్పిస్తోంది.న్యూన్యూ అనే సరికొత్త యాప్ ద్వారా ఇతరుల జీవితాలను నియంత్రించే అవకాశం మనకు కల్పిస్తుంది.

ప్రస్తుతం ఎంతోమంది సెలబ్రెటీలు లేదా సాధారణ వ్యక్తులు రెండింటిలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం కోసం సోషల్ మీడియా వేదికగా తమ ఫాలోవర్స్ కు ఓటింగ్ నిర్వహిస్తారు. ఈ ఓటింగ్ ద్వారా వారి తుది నిర్ణయం తీసుకుంటారు. అయితే ఇక్కడ ఓటింగ్ చేసే అభ్యర్థులు కొంత డబ్బును చెల్లించాల్సి ఉంటుంది. ఈ యాప్ ద్వారా ప్రతి ఒక్కరూ తమ ఆప్షన్లను ఒక రకమైన సోషల్ స్టాక్ మార్కెట్‌గా మార్చుకోవచ్చు. ఇది క్రియేటర్లకు డబ్బు సంపాదించే అవకాశం కల్పిస్తుంది.

ఈ యాప్ ద్వారా ఒక ఓటుకు ఫాలోవర్లు కనీసం ఐదు డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ కొత్త తరహా యాప్ టెస్టింగ్ దశలోనే ఉంది. బీటా వెర్షన్‌లో కొందరికి న్యూన్యూ సేవలు అందుబాటులోకి వచ్చాయి. రచయితలు, పెయింటర్స్, మ్యుజిషియన్స్, ఫ్యాషన్ డిజైనర్లు, బ్లాగర్లు.. వంటి క్రియేటర్ల కోసం దీన్ని రూపొందించారు. ముందుగా క్రియేటర్లు యాప్ లో అకౌంట్ ఓపెన్ చేసుకొని ఫాలోవర్స్ ను సంపాదించుకోవాలి. వీరు తమ వ్యక్తిగత విషయంలో తుది నిర్ణయం కోసం ఓటు వేయాలని ఈ యాప్ ద్వారా ఫాలోవర్లను కోరవచ్చు.

నేడే రెడ్ మీ నోట్ 10 ఎస్ సెల్.. 10శాతం డిస్కౌంట్?

అద్భుతమైన ప్రత్యేకమైన ఫీచర్లతో షావోమీ తాజాగా విడుదల చేసిన రెడ్ మీ నోట్ 10 ఎస్ సేల్ నేడే మే 18 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలోనే తొలి సేల్ లో భాగంగా షావోమీ రెడ్ మీ నోట్ 10 ఎస్ స్మార్ట్ఫోన్లను 10 శాతం డిస్కౌంట్ ను ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ వివరాలు ఏ విధంగా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం..

రెడ్‌మీ నోట్ 10 సిరీస్‌లో నేడు సేల్ ప్రారంభమైన రెడ్ మీ నోట్ 10 ఎస్ నాలుగో స్మార్ట్‌ఫోన్.ఈ స్మార్ట్ ఫోన్ లో ఇందులో 6.43 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమొలెడ్ డిస్‌ప్లే, 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్, మరియు 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి.

ఈ స్మార్ట్ ఫోన్ లో 6జీబీ+64జీబీ, 6జీబీ+128జీబీ వేరియంట్‌లో రిలీజ్ అయింది. మే 18న మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్ షావోమీ వెబ్‌సైట్లలో ఈ ఫోన్ సేల్ ప్రారంభం కానుంది.దీనిలో 6జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.14,999 కాగా,6జీబీ+128జీబీ ధర రూ.15,999 గా ఉంది. అదేవిధంగా ఎస్బిఐ క్రెడిట్ కార్డుతో కంటే అదనంగా 10 శాతం డిస్కౌంట్ పొందవచ్చు.

ట్రిపుల్ కెమెరా కలిగిన ఈ ఫోన్లో ప్రధానం కెమెరా 64 మెగాపిక్సల్ సామర్థ్యం కలదు వీడియో కాల్, సెల్ఫీ కెమెరా 13 మెగాఫిక్సల్ సామర్థ్యం కలదు.రెడ్‌మీ నోట్ 10ఎస్ స్మార్ట్‌ఫోన్‌లో డీప్ సీ బ్లూ, ఫ్రాస్ట్ వైట్, షాడో బ్లాక్ కలర్స్‌ అందుబాటులో ఉన్నాయి.

స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా? అయితే శుభవార్త మీకోసమే!

స్మార్ట్ ఫోన్ ఉపయోగించే వినియోగదారులకు శుభవార్త ను తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంది.డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికం (డాట్) మంగళవారం టెలికం సర్వీస్ ప్రొవైడర్లకు అనుమతులు ఇచ్చింది. ఇందులో భాగంగానే 5జీ టెక్నాలజీ ట్రయల్స్ నిర్వహించుకోవచ్చని టెలికం కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది.

ఈ నేపథ్యంలోనే ఎయిర్టెల్, రిలయన్స్ జియో, వోడాఫోన్, ఐడియా వంటి కంపెనీలు 5జీ ట్రయల్స్ కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ఇందుకుగాను డాట్ అనుమతులను కూడా జారీ చేసింది. ఈ టెలికం సంస్థలన్ని ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్, టెక్నాలజీ ప్రొవైడర్లతో భాగస్వామ్యం కుదుర్చుకొని 5జీ ట్రయల్స్ నిర్వహిస్తాయి.

ఇందులో భాగంగా ఎయిర్టెల్,రిలయన్స్ జియో, వోడాఫోన్ వంటి కంపెనీలు నోకియా ఎరిక్‌సన్, శాంసంగ్, సీడాట్ వంటి సంస్థలతో జత కట్టి 5జీ ట్రయల్స్ నిర్వహిస్తాయి. ఇందుకు గాను ఈ టెలికం సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఆరు నెలల వరకు గడువు ఇచ్చింది.

ఈ ట్రయల్స్ కోసం రెండు నెలల కాలం పాటు ఉపకరణాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. ఈ ట్రైలర్స్ లో భాగంగా పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలు,పాక్షిక పట్టణాలు వంటి ప్రదేశాలలో ఈ ట్రయల్స్ నిర్వహించాలని సూచించింది. దీని ద్వారా ప్రతి ప్రాంతంలోనూ 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయి.5జీ సేవలు అందుబాటులోకి వస్తే డౌన్లోడ్ స్పీడ్ పది రెట్లు పెరుగుతుందని చెప్పవచ్చు.