ప్రస్తుత కాలంలో సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు తమ అభిప్రాయాలను, వారికి సంబంధించిన విషయాలను సామాజిక మాధ్యమాలు అయిన ఫేస్ బుక్, ఇన్‌స్టా, ట్విట్టర్ ద్వారా వారి అభిప్రాయాలను, వారికి సంబంధించిన విషయాలను తెలియజేసేవారు. ఈ క్రమంలోనే ఈ మాధ్యమాలకు మిలియన్ల సంఖ్యలో యూజర్లు ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలోనే ఈ విధమైన సామాజిక మాధ్యమాలకు సంబంధించిన ఒక పిడుగులాంటి వార్తను కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది.
సామాజిక మాధ్యమాలైనా ఫేస్ బుక్, ఇన్‌స్టా, ట్విట్టర్ బ్యాన్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలియడంతో నెటిజన్లు అందరూ కాస్త కంగారు పడ్డారు. అయితే ఎవరు కంగారు పడాల్సిన పని లేదని, ఈ యాప్స్ ఎలాంటి పరిస్థితుల్లో కూడా బ్యాన్ అయ్యే పరిస్థితులు లేవని ఫేస్ బుక్, గూగుల్ వంటి సంస్థలు తెలియజేశాయి.
కేంద్ర ప్రభుత్వం విధించిన కొత్త నిబంధనలను మే 26 నుంచి అమలులోకి తీసుకురానున్నారు. ఈ విధంగా అమలులోకి వచ్చే కొత్త నిబంధనలను సోషల్ మీడియా దిగ్గజాలు పాటించాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం విధించిన కొత్త నిబంధనలను పాటించని నేపథ్యంలో ఫేస్ బుక్, ట్విట్టర్,ఇన్‌స్టా వంటి వాటిపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన కొత్త నిబంధనలను పాటించడానికి ఇప్పటికీ ఫేస్ బుక్, గూగుల్ ఓకే చెప్పడంతో వీటికి ఎటువంటి సమస్య లేదు. ఇకపోతే ట్విట్టర్ ఈ నిబంధనల గురించి ప్రభుత్వంతో చర్యలు జరుగుతోందని తెలుస్తోంది. కనుక ఎట్టి పరిస్థితులలో కూడా ఈ సామాజిక మాధ్యమాలను బ్యాన్ చేసే ప్రసక్తే లేదని తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…