సౌత్ సినీ ఇండ్రస్టీ లో ఫుల్ క్రేజ్ అండ్ పాపులారిటీ ని సంపాదించుకున్న అగ్ర హీరోల్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు. కేవలం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాదు.. మిగతా ఇండ్రస్టీ ల్లో కూడా ఈ హీరోకి ఫుల్ క్రేజ్ ఉంది. ఇప్పటికే అల్లు అర్జున్ కి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక ఇటీవల బన్నీ నటించిన అల వైకుంఠ పురంలో సినిమా ఎన్నో రికార్డులను నెలకొల్పింది. కేవలం సినిమాల పరంగానే కాకుండా సోషల్ మీడియాలో కూడా బన్నీకి పలు రికార్డ్స్ ఉండటం విశేషం. ఇందులో భాగంగానే తాజాగా సోషల్ మీడియాలో మారి మైల్ స్టోన్ ని అందుకున్నాడు మన ఐకాన్ స్టార్.
ఇప్పటికే ఈ హీరో ప్రభంజనానికి రికార్డులు చెరిగిపోతున్నాయి. ఒక వైపు సినిమాలు, మరోవైపు సోషల్ మీడియా అన్నిటిలోనూ బన్నీ పాత రికార్డులని తిరగరాస్తూ అందరిని షాక్ కి గురిచేస్తున్నారు. గత ఏడాది విడుదలైన అలా వైకుంఠపురుములో సినిమాతో బన్నీ ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేసాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఇప్పటికీ రికార్డుల పరంగా ఈ సినిమా హవా నడుస్తుంది. తాజాగా బన్నీ సోషల్ మీడియాలో సరికొత్త మైలు రాయి అందుకున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో నిత్యం యాక్టివ్‌గా ఉండే అల్లు అర్జున్ తాజాగా 12 మిలియన్ ఫాలోవర్స్ సొంతం చేసుకున్నాడు. ఇంత తక్కువ సమయంలో ఆ మార్క్ సాధించిన సౌత్ ఇండియన్ మరియు తెలుగు హీరోగా అల్లు అర్జున్ నిలిచాడు. కొద్ది రోజుల క్రితం విజయ్ దేవరకొండ కూడా ఈ ఫీట్‌ని అందుకున్నాడు.
కాగా, బన్నీ కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడగా, ఆయనకు అభిమానులు, సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా త్వరగా కోలుకోవాలని విషెస్ అందించారు.ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ ఈ ఫీట్ ని అందుకోవడంతో అభిమానులు సోషల్ మీడియా ద్వారా తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు.ఇక ప్రస్తుతం అల్లు అర్జున్.. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో నటిస్తున్నాడు.బన్నీ కెరీర్లో మొట్టమొదటి పాన్ ఇండియా సినిమాగా రానున్న ఈ ప్రాజెక్ట్ పై ప్రేక్షకుల్లో భారీ ఎత్తున అంచనాలు ఉన్నాయి.ఇప్పటికే ఈ సినిమా టీజర్ విడుదలై ఆ అంచనాలను రెట్టింపు చేసింది.!!
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…