బుల్లితెర టీవీలో ప్రసారమవుతున్న సీరియల్స్ లో కార్తీకదీపం సీరియల్ కున్న క్రేజ్ మరే సీరియల్ కి లేదని చెప్పవచ్చు. కార్తీకదీపం సీరియల్ లో దీప పాత్రలో నటిస్తున్న ప్రేమి విశ్వనాథ్ కు రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు.నటన పరంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ప్రేమి విశ్వనాథ్ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను సందడి చేస్తుంటారు.
తెలుగులో ఎంతో రేటింగ్స్ సంపాదించుకుంటున్న కార్తీకదీపం సీరియల్ తెలుగులో కంటే ముందుగానే మలయాళంలో ‘కరుతముత్తు’ అనే పేరుతో ప్రసారం అయ్యింది. అక్కడ కూడా ప్రేమి విశ్వనాథ్ ప్రధాన పాత్రలో నటించగా మంచి ఆదరణ లభించడంతో తెలుగులో కార్తీకదీపం సీరియల్ లో కూడా ప్రేమి విశ్వనాథ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలుగులో కూడా మంచి ఆదరణ దక్కించుకుంది.
తన అద్భుతమైన నటన ద్వారా ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకున్న దీపా అలియాస్ వంటలక్క సోషల్ మీడియాలో యాక్టివ్ గాఉంటూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటారు.ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా వంటలక్క షేర్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
https://www.instagram.com/p/CPQGgqunISw/?utm_source=ig_web_copy_link
ఈ వీడియోలో వంటలక్క అల్లు అర్జున్ నటించిన అలా వైకుంటపురం సినిమాలోని సిత్తరాల సిరపడు అని పాటలో అల్లు అర్జున్ లాగా చొక్కా, పంచ ధరించి, షర్ట్ బటన్స్ తీసేసి ఒక చేతిలో సిగరెట్ మరొక చేతిలో కోడి పుంజు పట్టుకుని నోటి నుంచి పొగలు వదులుతూ కనిపిస్తుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఎంతో ఆశ్చర్యానికి గురై తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వంటలక్క ఈ వీడియో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…