టాలీవుడ్ హీరోయిన్ శృతిహాసన్ ఇటీవలే తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మొదట్లో రవితేజ సరసన క్రాక్ సినిమాతో సాలిడ్ కం బ్యాక్ ఇచ్చిన శ్రుతిహాసన్.. తాజాగా పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకుంది. అయితే సినిమాల విషయంలో అయినా.. తన వ్యక్తిగత విషయాల్లో అయినా బోల్డ్ గా మాట్లాడే ఈ హీరోయిన్.. ఇటీవల ఓ సందర్భంలో తన తల్లిదండ్రులు విడిపోయిన విషయం గురించి మాట్లాడింది.
వాళ్లు విడాకులు తీసుకున్నప్పుడు తనకు చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపించిందని.. మా అమ్మానాన్న విడాకులు తీసుకునేటప్పుడు నేను ఎగ్జయిట్ కావడానికి సరైన కారణం ఉంది. ఇద్దరి అభిప్రాయాలు కలవడంలేదని వారికి అనిపించింది. ఆ తర్వాత వారిద్దరూ మాట్లాడుకుని విడాకులు తీసుకోవాలనుకున్నారు. భిన్నాభిప్రాయాలున్న వ్యక్తులు కలసి బతకడం కంటే విడిపోవడం సరైన పని, వారి నిర్ణయం గౌరవించాలి అనిపించింది. వ్యక్తులుగా వారు విడిపోయినా తల్లిదండ్రులుగా నాకు, నా చెల్లెలి (అక్షరా హాసన్) కి వారి బాధ్యతలను నిర్వహిస్తూనే ఉన్నారు. వ్యక్తిత్వాలు వేరుగా ఉన్న ఇద్దరు అద్భుతమైన వ్యక్తులు నా తల్లిదండ్రులు. వారు విడాకులు తీసుకున్నప్పుడు నేను యంగ్ ఏజ్‌లో ఉన్నాను.
మా తల్లిదండ్రులు కలిసి లేరన్న విషయాన్ని పక్కన పెడితే, విడివిడిగా ఇద్దరూ హ్యాపీగా ఉన్నారు. అలా హ్యాపీగా ఉండటం ముఖ్యం కదా” అన్నారు. 1988లో పెళ్లి చేసుకున్న కమల్, సారిక 2004లో విడాకులు తీసుకున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ అమ్మడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ సరసన సలార్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాతో పాటు బాలయ్య, గోపిచంద్ మలినేని కాంబోలో తెరకెక్కబోయే ప్రాజెక్ట్ లో కూడా శృతిహాసన్ ని హీరోయిన్ గా సెలెక్ట్ చేసినట్లు సమాచారం..!!
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…