దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని అంటుంటారు మన పెద్దలు. సామాన్యులు ఈ సామెతను ఫాలో అవుతారో లేదో తెలీదు కానీ.. మన సినీ సెలెబ్రెటీలు అయితే తూచా తప్పకుండా ఈ సామెతను పాటిస్తూ ఉంటారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. ప్రస్తుతం మన టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ ను కొనసాగిస్తున్న నటీ నటులు తమ సినిమాల ద్వారా భారీగా సంపాధిస్తున్నారు. అది హీరోలు కావచ్చు.. హీరోయిన్లు కావచ్చు. అయితే ఇక్కడ ఒక హీరోయిన్ మాత్రం స్టార్ గా ఉన్నప్పుడే బాగా సంపాదించాలని అనుకుంటోందట. ఆ హీరోయిన్ మరెవరో కాదు. ప్రస్తుతం సౌత్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న కన్నడ బ్యూటీ రష్మీక మందన్న.
తాజాగా ఈ అమ్మడి చేతిలో అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. అయితే ఇప్పటి హీరోయిన్స్ ముందస్తుగానే జాగ్రత్త పడుతూ రెమ్యునరేషన్స్ పెంచుకుంటూ పోవడమే కాకుండా తమ సంపాదనను వేరే రంగాల్లో పెట్టుబడులు పెట్టి మరింత లాభాన్ని అందుకుంటున్నారు. తాజాగా ఈ లిస్టులోకి చేరిపోయింది రష్మీక. గతంలో గీత గోవిందం సినిమాతో విజయ దేవరకొండ సరసన నటించి బ్లాక్ బస్టర్ అందుకున్న రష్మిక మందన్న వరుస విజయాలతో అగ్ర హీరోల సరసన చేస్తూ, బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వడంతో అక్కడ కూడా సత్తా చాటుతుందని అంటున్నారు. యాడ్స్ లో కూడా నటిస్తూ రెండు చేతులా సంపాదిస్తోంది. పూజా హెగ్డే తో యాడ్స్ లో రష్మిక పోటీ పడుతోంది. రష్మిక దాదాపు 29కోట్ల రూపాయల వరకూ ఏడాది సంపాదన ఉంటుందని అంచనా ఎందుకంటే సినిమాలతో పాటు బ్యూటీ ప్రోడక్ట్స్, లైఫ్ స్టైల్ స్టోర్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉంది.
ఇక తమిళంలో విశాల్, ధనుష్, సూర్య లాంటి హీరోలు రష్మిక ఎప్పుడు తమతో జోడీ కడుతుందా అని ఎదురుచూస్తున్నారు. వీళ్ళతో కూడా నటించడానికి రష్మిక రెడీగా ఉందట. ఇక ప్రస్తుతం తెలుగులో అల్లు అర్జున్ సరసన పుష్ప సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది రష్మీక. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కుతుంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మీక డీ గ్లామర్ రోల్ లో కనిపించనుందట..!!
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…