Tag Archives: recently

Youtube: యూట్యూబ్ వాడుతున్నారా..? ఇటీవల దీనిలో కీలక మార్పులు చేశారు తెలుసా..?

Youtube: యూట్యూబ్ ప్రత్యేకం పరిచయం అక్కర లేని పేరు. కంప్యూటర్లు, మొబైళ్లు వాడకం పెరగడంతో ఇది కూడా మన జీవితంలో భాగంగా మారింది. మనకు నచ్చిన వీడియోలను కళ్ల ముందు ఉంచుతోంది. ఇంటర్నెట్ యూజర్లలో ఎక్కువ శాతం యూట్యూబ్ ను కూడా వాడుతున్నారు. 

Youtube: యూట్యూబ్ వాడుతున్నారా..? ఇటీవల దీనిలో కీలక మార్పులు చేశారు తెలుసా..?

అయితే యూట్యూబ్ ను యూజర్లకు మరింత ఫ్రెండ్లీగా మార్చేందుకు కొత్తగా అప్ డేట్ అవుతోంది. యూట్యూబ్ సరికొత్త మార్పులతో రాబోతోంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్ ఇంటర్పేస్( యూఐ) లో  మార్పులను తీసుకువచ్చింది. కొత్తగా తీసుకురానున్న ఫీచర్లు అందరికీ ఉపయోగపడేలా ఉండనున్నాయి. 

Youtube: యూట్యూబ్ వాడుతున్నారా..? ఇటీవల దీనిలో కీలక మార్పులు చేశారు తెలుసా..?

ఇకపై వీడియోను మినిమైస్ చేయకుండా మనం నేరుగా వీడియోను లైక్ చేసే సదుపాయాన్ని తీసుకువచ్చారు. అలాగే డిస్ లైక్ కూడా చేయ్యెచ్చు. అలాగే వీడియో ప్లేయర్ యూఐ లోనే సేవ్ టూ ప్లే లిస్ట్ ఆప్షన్ కూడా ఉంటుంది. షేర్ ఆప్షన్ కూడా తీసుకురానున్నారు. ఇవన్నీ లెఫ్ట్ సైడ్ లో ఉండనున్నాయి.

యూట్యూబ్ యాప్ కు యాడ్..

గతంలో ఇవన్నీ చేయాలనంటే.. ఫుల్ స్క్రీన్ నుంచి మినిమైజ్ చేయాల్సి వచ్చేది. కానీ ఇక నుంచి ఆ అవసరం ఉండదు. కొత్త యూఐ రావడంతో ఫుల్ స్క్రీన్ ఉండగానే.. వీడియోలకు కామెంట్లు చేయవచ్చు. ఇప్పటికే ఈ కొత్త ఫీచర్లు ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూట్యూబ్ యాప్ కు యాడ్ అయ్యాయి. ఒక వేళ కాకపోతే యాప్ అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది. ఇదిలా ఉండగా… యూట్యూబ్ ప్రీమియం, మ్యూజిక్ కోసం వార్షిక ప్లాన్లను తీసుకువచ్చారు. బెస్ట్ వ్యాల్యూ ఆఫర్్ గా ఏడాదికి రూ. 1290కు అందుబాటులోకి తెచ్చింది. నెల వారీ ప్లాన్ రూ. 139 గా, మూడు నెలల ప్లాన్  రూ. 399గా ఉంది.