Tag Archives: recruitment

రైల్వేలో ఉద్యోగాలు.. మొదలైన దరఖాస్తు ప్రక్రియ.. పూర్తి వివరాలివే..!

దక్షిణ మధ్య రైల్వేలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు అధికారులు. సికింద్రాబాద్‌ ప్రధాన కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్‌) వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. దీనికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం అప్రెంటిస్ ఖాళీలు 4103 ఉన్నట్లు పేర్కొన్నారు. అప్రెంటిస్‌ వివరాలు ఇలా ఉన్నాయి.

ఏసీ మెకానిక్‌, కార్పెంటర్‌, డీజిల్‌ మెకానిక్‌, ఎలక్ట్రీషియన్‌, ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌, ఫిట్టర్‌, మెషినిస్ట్‌, ఎంఎంటీఎం, ఎంఎండబ్ల్యూ, పెయింటర్‌, వెల్డర్‌ లాంటి పోస్టులున్నాయి. అప్రెంటీస్ యాక్ట్-1961, అప్రెంటీస్‌షిప్ రూల్స్-1992 ప్రకారం ఈ అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది దక్షిణ మధ్య రైల్వే. ఇవి ఏడాది గడువు గల అప్రెంటీస్ పోస్టులు మాత్రమే.

ఈ పోస్టులకు 2021 అక్టోబర్ 4న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. అప్లై చేయడానికి 2021 నవంబర్ 3 చివరి తేదీ. అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి. ఈ పోస్టులకు ఎలా దరఖాస్తు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

మొదట అర్హత, ఆసక్తి కలిగిన నిరుద్యోగులు వెబ్‌సైట్‌ https://scr.indianrailways.gov.in ను సందర్శించాల్సి ఉంటుంది. ONLINE APPLICATION FOR ACT APPRENTICE TRAINING 2021 పై క్లిక్ చేసి తమ వ్యక్తిగత వివరాలను నమోదు చేయాల్సి ఉటుంది. అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి. దరఖాస్తు ఫీజు చెల్లించి అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలి. దరఖాస్తు ఫామ్ డౌన్‌లోడ్ చేసి భద్రపర్చుకోవాలి. ఇలా ఫార్మాట్ ప్రకారం దరఖాస్తు చేసుకోవాలి.

నిరుద్యోగులకు శుభవార్త.. భారీ వేతనంతో ఇంజనీర్ ఉద్యోగాలు..!

నోయిడాకు చెందిన హాస్పిటల్ సర్వీసెస్ కన్సలెన్సీ కార్పొరేషన్ లిమిటెడ్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 21 ఇంజనీర్ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా ఫిబ్రవరి నెల 1వ తేదీలోగా ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి అర్హత ఆధారంగా భారీ వేతనం లభిస్తుంది.

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల విద్యార్థుల విద్యార్హతలు, ఇతర వివరాలను బట్టి అభ్యర్థులను షార్ట్ లిస్టింగ్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఉద్యోగాలకు కేవలం ఆఫ్ లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. http://www.hsccltd.co.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.

మొత్తం 21 ఉద్యోగాలలో ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్‌/ ఎల‌క్ట్రిక‌ల్‌/ మెకానిక‌ల్‌) ఉద్యోగాలు 20 ఉన్నాయి. కనీసం 60 మార్కులతో పాసై మూడు సంవత్సరాల అనుభవం, కంప్యూటర్ పై అవగాహన, టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2021 సంవత్సరం జనవరి నాటికి 40 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ ఇంజినీర్ (ఆర్కిటెక్చ‌ర్‌) ఒక ఉద్యోగ ఖాళీ మాత్రమే ఉండగా ఆర్కిటెక్చ‌ర్ ‌లో కనీసం 60 శాతం మార్కులతో పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2021 సంవత్సరం జనవరి 1 నాటికి 24 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

డిప్యూటీ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌, హెచ్ఎస్‌సీసీ(ఇండియా) లిమిటెడ్‌, సెక్ట‌ర్‌-1, నోయిడా(యూపీ)-201301 అడ్రస్ కు అభ్యర్థులు అభ్యర్థులు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత, అనుభవాన్ని బట్టి ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 29,000 రూపాయల నుంచి 1,11,000 రూపాయల వరకు వేతనం లభిస్తుంది.

ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. భారీ వేతనంతో ఉద్యోగాలు..?

ఏపీఎస్‌ఎస్‌డీసీ రాష్ట్రంలోని నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. efftronics private ltd అనే సంస్థలోని 100 ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేసింది. గరిష్టంగా 5 లక్షల రూపాయల 20 వేల వరకు ఈ ఉద్యోగాలకు వేతనం పొందే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జనవరి 18వ తేదీ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి చివరితేదీగా ఉంది.

ఐటీఐ, డిప్లొమా, బీటెక్ అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, ఉద్యోగాన్ని బట్టి వేతనంలో మార్పులు ఉంటాయి. సాఫ్ట్ వేర్ ఇంజనీర్, సొల్యూషన్ సపోర్ట్ ఇంజనీర్, ఎంబెడ్ ఇంజనీర్, డేటా సైంటిస్ట్ ఉద్యోగ ఖాళీలకు ఈ నోటిఫికేషన్ విడుదలైంది. https://www.apssdc.in/home/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. https://www.apssdc.in/home/ ఈ వెబ్ సైట్ ద్వారా ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

డేటా సైంటిస్ట్ ఉద్యోగాలకు బీటెక్ తో పాటు ఎంసీఏ, ఎంఎస్సీ చదివిన వాళ్లు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసి ఎంపికైన వాళ్లకు 5.2 లక్షల రూపాయల వేతనం లభిస్తుంది. ఎంబెడ్ ఇంజనీర్ ఉద్యోగాలకు బీటెక్, ఎంటెక్, ఎంఎస్సీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి 3.8 లక్షల రూపాయల వేతనం లభిస్తుంది.

సొల్యూషన్ సపోర్ట్ ఇంజనీర్ ఉద్యోగాలకు బీఎస్సీ, బీటెక్, డిప్లొమా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. సంవత్సరానికి 2.2 లక్షల రూపాయల వేతనం లభిస్తుంది. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఉద్యోగాలకు బీటెక్ , ఎంఎస్సీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు 3.8 లక్షల రూపాయల వేతనం లభిస్తుంది.