ఏపీఎస్‌ఎస్‌డీసీ రాష్ట్రంలోని నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. efftronics private ltd అనే సంస్థలోని 100 ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేసింది. గరిష్టంగా 5 లక్షల రూపాయల 20 వేల వరకు ఈ ఉద్యోగాలకు వేతనం పొందే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జనవరి 18వ తేదీ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి చివరితేదీగా ఉంది.
ఐటీఐ, డిప్లొమా, బీటెక్ అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, ఉద్యోగాన్ని బట్టి వేతనంలో మార్పులు ఉంటాయి. సాఫ్ట్ వేర్ ఇంజనీర్, సొల్యూషన్ సపోర్ట్ ఇంజనీర్, ఎంబెడ్ ఇంజనీర్, డేటా సైంటిస్ట్ ఉద్యోగ ఖాళీలకు ఈ నోటిఫికేషన్ విడుదలైంది. https://www.apssdc.in/home/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. https://www.apssdc.in/home/ ఈ వెబ్ సైట్ ద్వారా ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
డేటా సైంటిస్ట్ ఉద్యోగాలకు బీటెక్ తో పాటు ఎంసీఏ, ఎంఎస్సీ చదివిన వాళ్లు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసి ఎంపికైన వాళ్లకు 5.2 లక్షల రూపాయల వేతనం లభిస్తుంది. ఎంబెడ్ ఇంజనీర్ ఉద్యోగాలకు బీటెక్, ఎంటెక్, ఎంఎస్సీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి 3.8 లక్షల రూపాయల వేతనం లభిస్తుంది.
సొల్యూషన్ సపోర్ట్ ఇంజనీర్ ఉద్యోగాలకు బీఎస్సీ, బీటెక్, డిప్లొమా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. సంవత్సరానికి 2.2 లక్షల రూపాయల వేతనం లభిస్తుంది. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఉద్యోగాలకు బీటెక్ , ఎంఎస్సీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు 3.8 లక్షల రూపాయల వేతనం లభిస్తుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…