Tag Archives: reoprn

విద్యార్థుల తల్లిదండ్రులకు అలర్ట్.. పాటించాల్సిన మార్గదర్శకాలివే..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేటి నుంచి పాఠశాలలు, కాలేజీలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ విద్యాసంస్థల పునఃప్రారంభం దిశగా చర్యలు చేపట్టింది. స్కూళ్లు, కాలేజీలకు ఇప్పటికే ప్రభుత్వం నుంచి వేర్వేరు అకడమిక్‌ క్యాలెండర్లు విడుదలయ్యాయి. సాధారణంగా ప్రతి సంవత్సరం జూన్ నెలలో క్లాసులు ప్రారంభమయ్యేవి. అయితే ఈ విద్యా సంవత్సరంలో 5 నెలల సమయం కరోనా విజృంభణ, లాక్ డౌన్ వల్ల వృథా అయింది.

దీంతో నష్టపోయిన పనిదినాలను సర్దుబాటు చేస్తూ నేటి నుంచి తరగతుల నిర్వహణ దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. జగన్ సర్కార్ రాష్ట్రంలో పాఠశాలలు, ఇంటర్ కాలేజీలకు 2021 సంవత్సరం ఏప్రిల్ నెల 30వ తేదీ వరకు డిగ్రీ మరియు పిజీ విద్యార్థులకు 2021 సంవత్సరం ఆగష్టు నెల వరకు క్లాసులు కొనసాగే విధంగా చర్యలు చేపట్టింది. సిలబస్ లో ముఖ్యమైన అంశాలను విద్యార్థులు మిస్ కాకుండా ఉండేలా ప్రభుత్వం ప్రణాళికను రూపొందించింది.

విద్యార్థులు మూడు విభాగాలుగా విభజించి చాలా అంశాలను విద్యార్థులు ఇంటి దగ్గరి నుంచే నేర్చుకునే విధంగా ప్రణాళికలను రూపొందించింది. ఈరోజు 9,10వ తరగతి ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు క్లాసులు ప్రారంభం కానున్నాయి. ఈ నెలంతా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు మాత్రమే పాఠశాలలు ఉంటాయి. విద్యార్థులను మధ్యాహ్న భోజనం ముగిసిన తర్వాత ఇంటికి పంపిస్తారు; తరగతి గదిలో ఒక విద్యార్థికి మరో విద్యార్థికి మాధ్య 6 అడుగుల కనీస దూరం ఉండేలా చర్యలు చేపట్టారు.

తరగతి గదికి కేవలం 16 మంది విద్యార్థులను మాత్రమే అనుమతిస్తారు. రోజు విడిచి రోజు తరగతుల నిర్వహణ జరుగుతుంది. ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు ఉన్న స్కూళ్లలో షెడ్యూల్ ను రూపొందించి ఆ షెడ్యూల్ ప్రకారం బోధన జరిగే విధంగా చర్యలు చేపడతారు. నవంబర్‌ 16 నుంచి ఇంటర్ ఫస్టియర్ క్లాసులు, డిసెంబర్ 1 నుంచి డిగ్రీ, పీజీ ప్రొఫెషనల్, నాన్‌ ప్రొఫెషనల్ కోర్సులకు సంబంధించిన క్లాసులు ప్రారంభమవుతాయి.