Tag Archives: sajjanar

Collector Marraige: ఆర్టీసీ బస్సులో పెళ్లి మండపానికి వెళ్ళిన కలెక్టర్..! సజ్జనార్ రియాక్షన్ ఇదే!

Collector Marraige: ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు మార్గదర్శకులుగా ఉండాలి. వారిని చూసి చాలా మంది ప్రేరణ పొందే అవకాశం ఉంటుంది. దేశంలో చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు తమ చేతల ద్వారా ప్రజలకు దగ్గరవుతున్నారు.

Collector Marraige: ఆర్టీసీ బస్సులో పెళ్లి మండపానికి వెళ్ళిన కలెక్టర్..! సజ్జనార్ రియాక్షన్ ఇదే!

ప్రజల మన్నన పొందుతున్నారు. ఇటీవల పలువురు ఐఏఎస్ అధికారులు తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలో జాయిన్ చేయడంతో పాటు.. ప్రభుత్వ ఆస్పత్రిలో పురుడు పోసుకుంటున్నారు. ఇలా ప్రభుత్వ కార్యక్రమాలకు బ్రాండ్ అంబాసిడర్లుగా నిలుస్తున్నారు. ఇలా చేయడం ద్వారా.. ప్రభుత్వ సేవలపై ప్రజలకు మరింతగా అవగాహన, నమ్మకం పెరుగుతాయి. 

తెలంగాణాలోని ఓ జిల్లా కలెక్టర్‌ తన ప్రత్యేకతను చాటుకుని ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేటకు చెందిన దంపతులు సురేశ్‌, నిర్మల తనయుడు మంద మకరంద్‌ ప్రస్తుతం నిజామాబాద్‌లో అసిస్టెంట్‌ కలెక్టర్‌గా చేస్తున్నారు.

ఆర్టీసీ ఎండీ బాజిరెడ్డి గోవర్థన్..


కాగా అతని వివాహం కరీంనగర్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ సాయితేజితతో ఫిబ్రవరి 11న హైదరాబాద్‌ శివారులోని నార్సింగి వద్ద ఓం కన్వెన్షన్‌లో జరిగింది. అయితే ఓ కలెక్టర్ పెళ్లి అంటే.. భారీ కార్లు, హంగామా ఉంటుంది సాధారణంగా. అయితే మకరంద్ మాత్రం సాదాసీదాగా పెళ్లి చేసుకున్నారు. కళ్యాణ మంటపానికి వరుడితో సహా అతని కుటుంబ సభ్యలు సిద్దిపేట ఆర్టీసీ బస్సులో చేరుకున్నారు. దీంతో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా కలెక్టర్ ను అభినందించారు. ఆర్టీసీ ఎండీ బాజిరెడ్డి గోవర్థన్ పెళ్లికి హాజరై ప్రశంసించారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, సీపీ మహేశ్‌ భగవత్‌ సహా పలువురు ఉన్నతాధికారులు ఈ వివాహానికి హాజరై కలెక్టర్‌ దంపతులను ఆశీర్వదించారు.

ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త.. కీలక నిర్ణయం తీసుకున్న సజ్జనార్

ప్రయాణికులను ఆకట్టుకునేందుకు ఆర్టీసీ అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తోంది. టీఎస్ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి వీసీ సజ్జనార్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే అతడు సోషల్ మీడియాలో రిక్వెస్ట్ చేసిన ప్రతీ విషయంలో అతడు సానుకూలంగా స్పందిస్తూ మందుకు సాగుతున్నారు.

బస్టాండ్లలోని దుకాణాల్లోని ధరలపై కూడా దృష్టి సారించింది ఆర్టీసీ. ఎంజీబీఎస్‌లో 90కి పైగా స్టాల్స్‌ ఉండగా.. ప్రస్తుతం 65 మాత్రమే నడుస్తున్నాయి. పండగ నేపథ్యంలో రద్దీ పెరగడంతో కొంతమంది ఎంఆర్‌పీ కంటే అధిక ధరలకు వస్తువులు విక్రయించారు. దీనిపై ఎక్కువగా ఫిర్యాదులు అందడంతో ప్రయాణికుల్లా వస్తువులు కొనుగోలు చేశారు.

దీంతో అతడికి విషయం అర్థం అయింది. దీంతో అటువంటి స్టాల్ కు రూ. వెయ్యి జరిమానాతో పాటు నోటీసులు కూడా జారీ చేశారు. అంతే కాకుండా తాజాగా అతడు ప్రయాణికుల సౌకర్యార్థం మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అందేంటంటే.. టికెట్ కొనే సమయంలో ఆన్ లైన్ పేమెంట్స్ ను యాక్సెప్ట్ చేసేందుకు సిద్ధమైంది. నెటిజన్ల సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం డిజిటల్ పేమెంట్లు ఎక్కువగా జరగుతున్న నేపథ్యంలో ఇదే పద్ధతిని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీనికి మొదట ఎంజీబీఎస్, రెతిఫైల్ బస్ స్టేషన్ వద్ద బస్ పాస్ కౌంటర్లలో తీసుకొచ్చామని ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. ప్రయాణికులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ఇకపై ప్రయాణికుల వద్దకే బస్సు సౌకర్యం.. కీలక నిర్ణయం తీసుకున్న టిఎస్ఆర్ట్ సి ఎండీ సజ్జనార్!

సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ వీసీ సజ్జనార్ టీఎస్ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పదవి బాధ్యతలు స్వీకరించిన వెంటనే సామాన్యుడిలా బస్సులో టికెట్ తీసుకొని పలు బస్ స్టేషన్లకు వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బస్ లపై అసభ్యకరమైన పోస్టర్లను అంటించవద్దని ఇటీవల ఓ నెటిజన్ ట్విట్టర్లో సజ్జనార్ ను రిక్వెస్ట్ చేయగా.. స్పందించిన సజ్జనార్ వాటిని తొలగించేందుకు ఏర్పాటు చేయాలని.. ఒక్క బస్సుపై కూడా అలాంటి పోస్టర్లు ఉండకూడదని కూడా ఆదేశాలు జారీ చేశారు.

ఆర్టీసీని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు చర్యలు చేపట్టారు. ఆర్టీసీని లాభాల బాటలో నడిపేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న జీతానికి సబంధించిన సమస్యలను కూడా నెరవేర్చారు. కొన్ని సంవత్సరాలుగా ప్రతీ నెల మొదటి తేదీన పడే జీతాలు.. తర్వాత కొన్ని కారణాల వల్ల నెల 10 నుంచి 15 మధ్యలో జీతాలు క్రెడిట్ అవుతున్నాయి.

వాటికి చరమగీతం పాడుతూ.. ప్రతీ నెల 1నే జీతాలు అందేలా చర్యలు తీసుకున్నారు. ఇదంతా అటు ఉంచితే.. తాజాగా దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో మరో నిర్ణయం తీసుకున్నారు. ప్రయాణికుల వద్దకే బస్సులను పంపేలా సంచలన నిర్ణయం తీసుకున్నారు. నేటి నుంచి ప్రత్యేక బస్సులను నడపనుంది ఆర్టీసీ. హైదరాబాద్ నుంచి ఊళ్లకు వెళ్లే ప్రయాణికులు కొత్త సౌకర్యాన్ని కల్పించారు. ఏదైనా ప్రదేశం నుంచి 30 లేదా అంతకంటే ఎక్కువ మంది ఒకే ప్రదేశానికి వెళ్లాలనుకుంటే స్టేషన్ కు రాకుండానే బస్సు వెళ్లి పికప్ చేసుకునే అవకాశం కల్పిస్తూ ఎండీ సజ్జనార్ నిర్ణయం తీసుకున్నారు.

కార్మికులు అయినా, విద్యార్థులు అయినా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు అన్నారు. నగరంలోని ఎంజీబీఎస్, కోఠి, రేతిఫైల్ బస్టాండ్‌లలో ఫోన్ నంబర్లు ఏర్పాటు చేశారు. ఒకవేళ ఈ సదుపాయం కావాలనుకుంటే.. 24 గంటల ముందు అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం అందించాల్సి ఉంటుంది.