Tag Archives: Scorpion Festival

వింత ఆచారం…తేళ్లతో దేవునికి పూజలు..ఎక్కడంటే..?

కొన్ని ప్రాంతాల్లో వింత ఆచారాలు, నమ్మకాలు ప్రతీ ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. టెక్నాలజీ ఎంత దూసుకుపోతున్నా కొన్ని ప్రాంతాల వారు మాత్రం మూఢనమ్మకాలను నమ్ముతూ వాటినే ఆచరిస్తుంటారు. అయితే ఇక్కడ మనం చెప్పుకునేది ఏంటంటే.. పాములను, తేళ్లను చూస్తే వాటికి దూరంగా పోని మనిషి అంటూ ఉండడు.

ఎందుకంటే వాటికి విషం ఉంటుంది కాబట్టి. మహిళలు అయితే బొద్దింకలు, జెర్రులను చూసినా కేకలు వేస్తూ కంగారు పడిపోతుంటారు. ఇక తేళ్లను చూస్తే.. ఆ చుట్టుపక్కల ప్రాంతంలో కూడా ఉండరు. కానీ ఇక్కడ ఆచారంలో భాగంగా..తమ దేవుడిని దర్శించుకోవాలంటే తేళ్లను తీసుకెళ్లి దర్శించుకుంటారు. అందేంటి అనుకుంటున్నారా.. అయితే వివరంగా తెలుసుకుందాం..

ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా కోడుమూరులో తేళ్లను పట్టుకుంటూ పండగ జరుపుకుంటారు. తేళ్లనే చేతితో పట్టుకొని దేవుడికి హారంగా వేసి పూజిస్తారు. అవి అక్కడ ఉన్న వారికి ఎలాంటి హానీ చేయవంట. ఒకవేళ ఆ తేళ్లు కుట్టినా కూడా.. గుడి చుట్టు మూడు ప్రదక్షిణలు చేస్తే నొప్పి కూడా ఉండదని అక్కడ ప్రజల నమ్మకం. శ్రావణమాసం మూడో సోమవారం ఇక్కడ కొండలరాయుడి స్వామి శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రతిరూపంగా భక్తులు కొలుస్తారు.

ఆకొండపై ఉన్న ఏ రాయిని కదిపినా తేళ్లే కనిపిస్తాయి. అక్కడ తేళ్లను పట్టుకొని దేవుడిని పూజిస్తారు. వాటిని పట్టుకొని విచిత్రమైన విన్యాసాలు చేసినా ఏమి కాదనేది వారి నమ్మకం. కానీ ఇదంతా మూఢ నమ్మకమని.. వాటి వల్ల ప్రమాదం ఉంటుందని కొందరు భావిస్తున్నారు. ఏదేమైనా ఇక్కడ ఆచారం కాస్త విచిత్రంగా ఉంది కదు..