Tag Archives: sharath kumar

Suryavamsam Movie : ఒకే టైటిల్ తో వచ్చిన ఈ సినిమాలలో ఒక హీరో మాత్రమే ఉత్తమ నటుడు అవార్డు అందుకోలేకపోయారు.!!

Suryavamsam Movie : మామూలుగా సినీ ఇండస్ట్రీలో రీమేక్ సినిమాలు వస్తూనే ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఒక భాషలో వచ్చి మంచి విజయం సాధించిన సినిమాలను వేరొక భాషలోకి ఇతర దర్శకులు కథలో కొన్ని మార్పులు చేసి తెరకెక్కిస్తూ మంచి విజయాలను అందుకుంటూ వుంటారు. ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో వచ్చిన రీమేక్ సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే ఇలా రీమేక్ సినిమాల ట్రెండ్ కొనసాగడం ఇప్పటిది కాదు. ఎప్పటినుంచో చిత్ర పరిశ్రమలో రీమేక్ సినిమాల ట్రెండ్ కొనసాగుతోంది. తెలుగు సినిమాలను ఇతర భాషల్లో రీమేక్ చేయడం లేదా ఇతర భాషల్లో సినిమాను తెలుగులో రీమేక్ చేస్తూ ఉంటారు.

అయితే ఇలా రీమేక్ చేసిన సినిమాల్లో ఒకటి సూర్యవంశం. వెంకటేష్ ద్విపాత్రాభినయం చేసిన “సూర్యవంశం” సినిమా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక ట్రెండ్ సృష్టించింది. ఇక ఈ సూర్యవంశం సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కు వెంకటేష్ ను ఎంతగానో దగ్గర చేసింది. ఓవైపు తండ్రి పాత్రలో మరో వైపు కొడుకు పాత్రలో అందరికీ ఆదర్శంగా నిలిచే లా వెంకటేష్ తన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో తన నటనకు గాను విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నాడు వెంకటేష్. అదే సమయంలో ఊరు నుంచి వెలివేయబడిన వెంకటేష్ ఎలాంటి చదువు లేకున్న భార్య ప్రోత్సాహంతో పెద్ద బిజినెస్ మేన్ గా ఎలా ఎదిగాడు సినిమాలో చూపిస్తూ ఉంటారు. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏమీ లేదు అంటూ నిరూపిస్తాడు. ఫ్యామిలీ ఎమోషన్స్ పండించడంలో వెంకటేష్ కి ఎవరూ సాటిలేరు అనే చెప్పాలి.

కాగా ఈ ‘సూర్యవంశం’ సినిమా తమిళ రీమేక్. తమిళంలో కూడా ఈ సినిమాకు ‘సూర్య వంశం” అనే టైటిల్ పెట్టారు.. నిర్మాత RB.చౌదరి తమిళంలో “పూవేఉనక్క”అనే చిత్రాన్ని తీసి గొప్ప విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత తాను తీయబోయే మరొక చిత్రానికి విక్రమన్ ని దర్శకత్వం చేయాలని ఆయన కోరారు. ఈసారి విక్రమన్ అన్నదమ్ముల కథ తో వచ్చి “వాన తైపోలా” చిత్రాన్ని రూపొందించారు. ఆ తర్వాత మరొక కథ రాసుకొని సూపర్ గుడ్ ఫిలింస్ అధినేత ఆర్.బి.చౌదరికి వినిపించారు. శరత్ కుమార్ హీరోగా ఇద్దరు కవలలుగా ఓ కథ రాయమని విక్రమన్ ని కోరారు. కానీ ఆయన దానికి అంగీకరించలేదు. అనేక వాదనల తర్వాత చివరికి ఆర్.బి.చౌదరి విక్రమన్ రాసిన కథను అసంతృప్తితో అంగీకరించారు.

సూపర్ గుడ్ ఫిలింస్, ఆర్.బి.చౌదరి నిర్మాణం విక్రమన్ దర్శకత్వంలో “సూర్యవంశం” తమిళ చిత్రం 1997 జూన్ 27న విడుదల అయ్యింది. ఎస్ ఏ రాజ్ కుమార్ అందించిన పాటలు తమిళనాట ప్రేక్షకాదరణ పొందాయి. అలా సినిమా బాగుండడంతో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఘన విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో శరత్ కుమార్ నటనకు తమిళనాడు ప్రభుత్వం ఉత్తమ నటుడు అవార్డుతో సత్కరించింది. 1998లో తెలుగు “సూర్య వంశం” సినిమా ఘన విజయం సాధించడంతో.. ఇదే చిత్రాన్ని పద్మాలయా స్టూడియోస్ బ్యానర్, ఆదిశేషగిరిరావు నిర్మాణం, ఇవివి.సత్యనారాయణ దర్శకత్వంలో “సూర్యవంశం” అనే హిందీ చిత్రం 1999 మే 21న విడుదలయ్యింది.

ఈ సినిమాలో అమితాబచ్చన్ ద్విపాత్రాభినయంలో కనిపించారు. ఆయన పక్కన జయసుధ, సౌందర్య జోడిగా కనిపించారు. అను మాలిక్ సంగీతాన్ని అందించారు. కుతుబ్ షాహీ టూంబ్స్, రాజస్థాన్, శ్రీలంక లోని మూడు లొకేషన్స్ లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంది. అమితాబచ్చన్ తో అనేక చిత్రాల్లో నటించిన రేఖ ఈ సినిమాలో కనిపించనప్పటికీ జయసుధ, సౌందర్యలకి వాయిస్ డబ్బింగ్ చెప్పారు. ద్విపాత్రాభినయంతో అమితాబచ్చన్ మెప్పించడంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఘన విజయం సాధించింది. తమిళంలో శరత్ కుమార్ కి, హిందీలో అమితాబచ్చన్ కి ఉత్తమ నటుడు అవార్డు పొందారు. తెలుగులో నటించిన వెంకటేష్ కు మాత్రం ఉత్తమనటుడు అవార్డు రాకపోవడం గమనార్హం.