Tag Archives: Shoaib Akhtar

Mohammed Shami: కర్మ అంటే ఇదే.. షోయబ్ అక్తర్ కి కౌంటర్ ఇచ్చిన మహ్మద్ షమీ స్వీట్ వైరల్?

Mohammed Shami: టి20 ప్రపంచ కప్ మ్యాచ్లలో భాగంగా ఇంగ్లాండ్ పాకిస్తాన్ పోటీ పడగా పాకిస్థాన్ పై ఇంగ్లాండ్ ఘన విజయం సాధించింది.టి20 ప్రపంచ కప్ మ్యాచ్లలో భాగంగా రెండోసారి కప్పు గెలవాలని భావించిన పాకిస్తాన్ ఆశలపై ఇంగ్లాండు నీళ్లు చల్లి చివరికి కప్పును సొంతం చేసుకున్నారు.

ఈ విధంగా పాకిస్తాన్ ఓటమి పాలు కావడంతో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షోయబ్ అక్తర్ బాధాకరమైన ట్వీట్ చేశారు. ఈ క్రమంలోనే షోయబ్ బ్రోకెన్ హార్ట్ ఎమోజి షేర్ చేస్తూ పాక్ ఓటమి పాలు కావడం ఎంతో బాధాకరంగా ఉందంటూ చెప్పుకొచ్చారు. ఇలా ఈయన ట్వీట్ చేయడంతో ఈ ట్వీట్ పై భారత సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ స్పందించారు.

ఈ సందర్భంగా షోయబ్ చేసిన ట్వీట్ కి ఈయన రిప్లై ఇస్తూ.. దీనినే కర్మ అంటారు బ్రదర్ అంటూ కామెంట్ చేశారు. ఇక ఈ ప్రపంచ కప్ మ్యాచ్లలో భాగంగా రెండో సెమీఫైనల్స్ లో ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓటమి పాలు కావడంతో టీమిండియా ఆట తీరును ఉద్దేశిస్తూ పాక్ ఆటగాళ్లు హేళన చేస్తూ ట్వీట్లు చేశారు.

Mohammed Shami: పాక్ ఆటగాళ్లకు కౌంటర్ ఇచ్చిన మహమ్మద్ షమీ

ఫైనల్ లో పాకిస్తాన్ భారత్ తో పోటీ పడటం కోసం ఎదురు చూస్తుందని అయితే అది జరగదు అంటూ టీమిండియాని హేళన చేస్తూ కామెంట్లు చేశారు. ఈ క్రమంలోనే ఫైనల్ లో పాకిస్తాన్ ఇంగ్లాండ్ చేతిలో ఓటమిపాలు కావడంతో మహమ్మద్ షమీ ఈ విధంగా షోయబ్ అక్తర్ ట్వీట్ కి కౌటరిస్తూ సమాధానం చెప్పారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Ex Pak Player: టీమిండియాకి సవాలు విసిరిన పాకిస్తాన్ మాజీ ఆటగాడు!

Ex Pak Player: పాకిస్తాన్ అభిమానులు ప్రస్తుతం ఆకాశంలో విహరిస్తున్నారు. ఇంటికే పరిమితం అనుకున్న జట్టు అదృష్టం కలిసి రావడంతో సెమీస్ కి అటు నుంచి ఫైనల్స్ కి చేరింది. దాదాపు 12 సంవత్సరాల తరువాత పాకిస్తాన్ జట్టు ప్రపంచ కప్ ఫైనల్ కి చేరింది. పాకిస్తాన్ అభిమానులు నెదర్లాండ్స్‌ జట్టుకి ఎంత కృతజ్ఞత చెప్పినా తక్కువే. ఆ జట్టు లేకపోతే పాకిస్తాన్ సెమీస్ కి వెళ్ళేదే కాదు. సౌతాఫ్రికా నెదర్లాండ్స్‌ చేతిలో ఓడిపోవడంతో ఈక్వేషన్ మారిపోయి పాకిస్తాన్ పంట పండింది.

జట్టు మీద ప్రేమా లేదా ఓవర్ యాక్షన్ చేస్తున్నారా?
సెమీస్ లో న్యూజిలాండ్‌ తో తలపడింది పాకిస్తాన్. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. అయితే ఈ విజయం మీద పాకిస్తాన్ మాజీ ప్లేయర్లు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. గ్రౌండ్ లో నిప్పులు చెరిగే బౌలర్ షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

పాకిస్తాన్ విజయం గురించి రియాక్ట్ అవుతూ మాజీ క్రికెటర్‌ షోయబ్‌ అక్తర్‌ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తూ టీమిండియాని ఉద్దేశిస్తూ పాకిస్తాన్ జట్టు మెల్‌బోర్న్‌ లో ఉంది. మీ కోసం ఎదురుచూస్తున్నాం. మీరు ఫైనల్ కి వస్తే తలపడదాం అన్నాడు ఈ మాజీ ప్లేయర్. అందరి లాగానే నేను కూడా ఇండియా-పాకిస్థాన్‌ ఫైనల్ లో తలపడాలని అనుకుంటున్నాను అని చెప్పాడు.

Ex Pak Player:

రికార్డ్స్ పాకిస్తాన్ ని బలపరుస్తున్నాయి. 1992 లో కూడా ఫైనల్ కి చేరి ఫైనల్ లో ఇంగ్లాండ్ ని ఓడించింది. ఇదే సీన్ రిపీట్ అవ్వాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఇందులో తప్పు లేదు. కానీ అక్తర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సింది అంటున్నారు. పాకిస్తాన్ జట్టు సాధించిన విజయం మీద ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అంటున్నారు. చూడాలి మరి ఫైనల్ లో ఏ జట్టు విజయం సాధిస్తుందో?