Ex Pak Player: పాకిస్తాన్ అభిమానులు ప్రస్తుతం ఆకాశంలో విహరిస్తున్నారు. ఇంటికే పరిమితం అనుకున్న జట్టు అదృష్టం కలిసి రావడంతో సెమీస్ కి అటు నుంచి ఫైనల్స్ కి చేరింది. దాదాపు 12 సంవత్సరాల తరువాత పాకిస్తాన్ జట్టు ప్రపంచ కప్ ఫైనల్ కి చేరింది. పాకిస్తాన్ అభిమానులు నెదర్లాండ్స్ జట్టుకి ఎంత కృతజ్ఞత చెప్పినా తక్కువే. ఆ జట్టు లేకపోతే పాకిస్తాన్ సెమీస్ కి వెళ్ళేదే కాదు. సౌతాఫ్రికా నెదర్లాండ్స్ చేతిలో ఓడిపోవడంతో ఈక్వేషన్ మారిపోయి పాకిస్తాన్ పంట పండింది.
జట్టు మీద ప్రేమా లేదా ఓవర్ యాక్షన్ చేస్తున్నారా?
సెమీస్ లో న్యూజిలాండ్ తో తలపడింది పాకిస్తాన్. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. అయితే ఈ విజయం మీద పాకిస్తాన్ మాజీ ప్లేయర్లు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. గ్రౌండ్ లో నిప్పులు చెరిగే బౌలర్ షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పాకిస్తాన్ విజయం గురించి రియాక్ట్ అవుతూ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తూ టీమిండియాని ఉద్దేశిస్తూ పాకిస్తాన్ జట్టు మెల్‌బోర్న్ లో ఉంది. మీ కోసం ఎదురుచూస్తున్నాం. మీరు ఫైనల్ కి వస్తే తలపడదాం అన్నాడు ఈ మాజీ ప్లేయర్. అందరి లాగానే నేను కూడా ఇండియా-పాకిస్థాన్ ఫైనల్ లో తలపడాలని అనుకుంటున్నాను అని చెప్పాడు.
రికార్డ్స్ పాకిస్తాన్ ని బలపరుస్తున్నాయి. 1992 లో కూడా ఫైనల్ కి చేరి ఫైనల్ లో ఇంగ్లాండ్ ని ఓడించింది. ఇదే సీన్ రిపీట్ అవ్వాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఇందులో తప్పు లేదు. కానీ అక్తర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సింది అంటున్నారు. పాకిస్తాన్ జట్టు సాధించిన విజయం మీద ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అంటున్నారు. చూడాలి మరి ఫైనల్ లో ఏ జట్టు విజయం సాధిస్తుందో?
తమిళనాడు రాజకీయాల్లో తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, రాజకీయ నేత విజయ్పై ఆస్తుల వివరాల విషయంలో…
తెలుగు బుల్లితెరలో గుర్తింపు పొందిన బిగ్‌బాస్ ఫేమ్ తమన్నా సింహాద్రి మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో నటి హేమపై వచ్చిన…
తెలుగు సినిమా ప్రపంచంలో తన ప్రత్యేక హాస్యంతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన నటుడు వేణు మాధవ్ మరణం ఇప్పటికీ అభిమానులను…
తెలుగు సినీ పరిశ్రమలో మరో ఆసక్తికర కాంబినేషన్ తెరపైకి రానుంది. యువ నటుడు బెల్లంకొండ గణేష్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త…
వేసవి కాలం వచ్చేసరికి చర్మ సమస్యలు, నీరసం, డీహైడ్రేషన్ వంటి ఇబ్బందులు ఎక్కువవుతాయి. కాలుష్యం, ఒత్తిడి కలిసివచ్చే ఈ రోజుల్లో…
మన దైనందిన జీవితంలో టీకి ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం లేవగానే ఒక కప్పు వేడి టీ తాగడం చాలా…