Surya Kumar Yadav: ఏ బంతిని ఎలా కొడతాడో తెలియకుండా మైదానంలో బౌలర్లకు చుక్కలు చూపించే మిస్టర్ 360.. భారత స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్. తాజాగా టీ20 వరల్డ్ కప్ లో అపోజిషన్ జట్టు బౌలర్లను తికమక పెడుతున్నాడు. అది పేసర్ అయినా, స్పిన్నర్ అయినా.. లెఫ్ట్ కి కొడతాడో, మిడ్ ఆన్ కు మళ్లిస్తాడో, స్క్వయర్ లెగ్ వైపు సిక్సర్ గా పంపిస్తాడో తెలీదు.. ఏ బౌలరైనా లెక్కచేయడు.. మైదానంలో 360 డిగ్రీల్లోనూ బాదుడే బాదుడు.. ఇలా సాగుతోంది స్కై బ్యాటింగ్ శైలి.
భారత జట్టును విజయ తీరాలకు చేర్చడంలో సూర్యకుమార్ యాదవ్ కీ రోల్ పోషిస్తున్నాడు. ఓపెన్లు ఫెయిలైన సందర్భాల్లో వన్ డౌన్ లో లేదా టూడౌన్ లో వస్తూ టీమిండియాకు ఓ వజ్రాయుధంలా దొరికాడు సూర్య. మైదానంలోనే కాదు.. అటు బయట కూడా సూర్య కుమార్ యాదవ్ కాసుల వర్షం కురిపిస్తున్నాడు. సూపర్బ్ ఫామ్ లో ఉన్న సూర్యకు మార్కెట్లో గిరాకీ పెరిగింది. భారీ బ్రాండ్ల ప్రమోటర్ గా మారుతున్నాడు సూర్య. తాజాగా అతడు కుదుర్చుకున్న పెద్ద బ్రాండ్ల డీల్ సంఖ్య 20కి చేరింది.
భారీగా పెరిగిన డిమాండ్..
గతంలో సూర్య రోజుకు సుమారు 20 లక్షల రూపాయల వరకు వసూలు చేసేవాడట. ఇప్పుడది రోజుకు 65 లక్షల రూపాయల నుంచి 70 లక్షల దాకా వసూలు చేస్తున్నాడని తెలుస్తోంది. ఇటీవల కూడా ఓ ఆరేడు బ్రాండ్లు సూర్యను తమ బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేసుకున్నారని టాక్ నడుస్తోంది.
ప్రస్తుతం సూర్య 10 బ్రాండ్ల వాణిజ్య ప్రకటనల్లో నటిస్తున్నాడు. డ్రీమ్ 11, ఫార్మా హెల్మెట్ లాంటి బ్రాండ్లలో ఇప్పుడు కనిపిస్తున్నాడు సూర్య. రానున్న కాలంలో సూర్య వివిధ మొబైల్ బ్రాండ్లు, మీడియా, స్పోర్ట్స్, ఫారిన్ బ్రాండ్లలో కూడా పాలు పంచుకొనే వీలుందని తెలుస్తోంది. దీంతో మార్కెట్లో భారీగా డిమాండ్ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో అటు మైదానంలోనే కాదు.. ఇటు మార్కెట్ లోనూ సూర్య కుమార్ యాదవ్ చెలరేగిపోతున్నాడు.
తెలుగు సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన జీవితాన్ని ప్రభావితం చేసిన వ్యక్తి గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం…
తెలుగు సినీ ప్రపంచంలో తన ప్రత్యేక హాస్యంతో చిరస్థాయిగా గుర్తుండిపోయే నటుడు కళ్లు చిదంబరం గురించి తాజాగా ఆయన కుమారుడు…
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్‌లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్‌తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…