Tag Archives: shobhan babu son

శోభన్ బాబు కొడుకు ఎంత అందంగా ఉన్నాడో.. హీరోకు ఏ మాత్రం తగ్గని పోలికలతో?

ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా దగ్గర అయిన హీరో శోభన్ బాబు. ఇతడిని ఆంధ్ర సోగ్గాడని కూడా పిలిచేవారు. అయితే అస్సలు పేరు వచ్చేసి.. ఉప్పు శోభనా చలపతిరావు. కృష్ణాజిల్లా చిన నందిగామ ఇతని స్వగ్రామం.. తండ్రి పేరు ఉప్పు సూర్యనారాయణ రావు. మైలవరం ఉన్నత పాఠశాలలో చదివేరోజుల్లో శోభన్ బాబు నాటకాల పైన ఆసక్తి పెంచుకొని అనతికాలంలో మంచి నటుడిగా పేరు పొందాడు. కాలేజీ రోజుల్లో ‘పునర్జన్మ’ నాటకాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.

అతడికి చిన్నతనం నుంచి సినిమాలంటే ఎంతో ఇష్టం ఉండేదట. తిరువూరులో కీలుగుర్రం తను చూసిన మొదటి సినిమా అని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. పాతాళ భైరవి, మల్లీశ్వరి, దేవదాసు తను బాల్యంలో బాగా అభిమానించిన సినిమాలని, మల్లీశ్వరి సినిమాను 22 సార్లు చూశానని చెప్పుకొచ్చాడు. అయితే శోభన్ బాబు మొదట పొన్నులూరి బ్రదర్స్ వారు దైవబలం చిత్రంలో రామారావు సరసన ఒక పాత్ర ఇచ్చారు. ఆ సినిమా 1959న విడుదల అయ్యింది కాని విజయవంతం కాలేదు.

తర్వాత అతడు చిత్రపు నారాయణరావు నిర్మించిన భక్త శబరి చిత్రంలో ఒక మునికుమారునిగా నటించాడు. 1960 లో విడుదల అయిన ఈ సినమా బంపర్ హిట్ అయింది. ఈ సినిమా తర్వాతనే అతడికి మంచి పేరు వచ్చింది. అప్పట్లో ఎన్టీఆర్, ఎన్నాఆర్ వంటి పెద్ద స్టార్ లతో అతడు పోటీ పడే వారు. అయితే శోభన్ బాబుకు 1958 వ సంవత్సరంలో శాంతకుమారి అనే ఆవిడను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కొడుకు, ముగ్గురు కూతుళ్లు జన్మించారు.

అయితే అతడు ఏ ఫంక్షన్ కి వెళ్లినా తన ఫ్యామిలీని పరిచయం చేసిన దాఖలాలు లేవు. ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి స్టార్ హీరోలు తమ వారసులను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్న సమయంలో శోభన్ బాబు కూడా తన వారసుడిని సినీ ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేయాలని.. ఆయన అభిమానులు కూడా ఎంతో ఆశగా ఎదురుచూశారు. కానీ శోభన్ బాబు వారసుడికి సినీ ఇండస్ట్రీ అంటే అస్సలు ఇష్టం లేదట. అందుకే సినీ పరిశ్రమలోకి రావడానికి అతడు అయిష్టత చూపించడంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టలేకపోయారు.