Tag Archives: singareni

సింగరేణి కార్మికులకు దసరా బోనస్ ప్రకటించిన తెలంగాణ సర్కార్.. ఎంతంటే?

ప్రతీ సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా సింగరేణి కార్మికులకు దసరా బోనస్ ను ప్రకటించారు సీఎం కేసీఆర్. సింగరేణి సంస్థ లాభాల్లో 29 శాతం వాటాను బోనస్‌గా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతేడాది బోనస్‌కు అదనంగా 1 శాతం పెంచి 29 శాతం బోనస్‌గా ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు.

ఈ బోనస్ ను దసరా కంటె ముందే వారి వారి అకౌంట్లలో జమ చేయాలని సింగరేణి సీఎండీ శ్రీధర్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. సింగరేణి కార్యకలాపాలను మరింత విస్తరించాలని సీఎం పేర్కొన్నారు. సింగరేణి సంస్థ అభివృద్ధి, సింగరేణి కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకునే తెలంగాణ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలిపారు. కార్మికులు ఎంతో కష్టపడి పని చేయడం వల్లనే దేశంలోనే ఉన్నత స్థానం లభించిందని గుర్తు చేశారు.

బొగ్గు తవ్వకంతో పాటు రాష్ట్రంలో ఖనిజాల తవ్వకాలను చేపట్టి కార్మికులకు పని, ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వమే పూనుకుంటుందని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం ఎంతవరకు సమంజసం అంటూ కేసీఆర్ ప్రశ్నించారు. రిటైర్డ్ సిబ్బందికి వస్తున్న పింఛన్ ను కూడా రూ. 2వేల నుంచి పెంచే యోజనలో ప్రభుత్వం ఉందంటూ స్పష్టం చేశారు.

బొగ్గు పరిశ్రమల కార్మికులకు లాభాల ఆధారిత బోనస్ రూ.72, 500 చెల్లించేందుకు కోల్ ఇండియా, సింగరేణి యాజమాన్యాలు అంగీకరించాయని.. ఈ మేరకు ఢిల్లీలో జాతీయ కార్మిక సంఘాలతో యాజమాన్యాలు బోనస్‌పై చర్చించి పరస్పర అంగీకారానికి వచ్చాయన్నారు. గత సంవత్సరం రూ.68,500గా బోనస్ ప్రకటించగా.. ఈ మొత్తాన్ని ప్రస్తుత సంవత్సరంలో పెంచారు. దీంతో సింగరేణిలో పనిచేసే దాదాపు 43 వేల మందకి ఈ బోనస్ వర్తించనుంది. ఈ నిర్ణయంతో కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సింగరేణిలో 372 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. నాన్ లోకల్ వారికి కూడా ఛాన్స్..?

సింగరేణి సంస్థ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 372 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. లోకల్ అభ్యర్థులతో పాటు నాన్ లోకల్ అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దేశంలో అతిపెద్ద బొగ్గు సంస్థలలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకున్న సింగరేణి సంస్థ వేర్వేరు ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేసింది. https://scclmines.com/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే సమయంలో సర్టిఫికెట్లకు సంబంధించిన సాఫ్ట్ కాపీలను అప్ లోడ్ చేయాలి. ఈ ఉద్యోగాలకు ఆన్ లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జనవరి 22వ తేదీ నుంచి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుండగా 2021 సంవత్సరం ఫిబ్రవరి 4 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉంది.

మొత్తం ఉద్యోగాలలో ఫిట్టర్ 105 ఉద్యోగ ఖాళీలు, ఎలక్ట్రిషియన్ 51 ఉద్యోగ ఖాళీలు, వెల్డర్ 54 ఉద్యోగ ఖాళీలు, టర్నర్‌ లేదా మెషినిస్ట్‌ ట్రైనీ 22 ఉద్యోగ ఖాళీలు, మోటార్‌ మెకానిక్‌ ట్రైనీ 14 ఉద్యోగ ఖాళీలు, మౌల్డర్‌ ట్రైనీ ఉద్యోగ ఖాళీలు 19, జూనియర్‌ స్టాఫ్‌ నర్స్ ఉద్యోగ ఖాళీలు 84 ఉన్నాయి. జూనియర్‌ స్టాఫ్‌ నర్స్‌ ఉద్యోగాలకు మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే లోకల్ ఉద్యోగ ఖాళీలతో పోల్చి చూస్తే జనరల్ ఉద్యోగ ఖాళీలు తక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. .

తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. సింగరేణిలో 651 ఉద్యోగాల భర్తీ.?

తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు సింగరేణి సంస్థ శుభవార్త చెప్పింది. 651 ఉద్యోగాల భర్తీ కోసం గ్రీన్ సిగ్నల్ లభించింది. సింగరేణి సంస్థ ఎండీ శ్రీధర్ ఈ ఏడాది మార్చి నెలలోపు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపడతామని అన్నారు. ఈ ఉద్యోగాల భర్తీ కోసం ఒకే నోటిఫికేషన్ కాకుండా వేర్వేరు నోటిఫికేషన్లను విడుదల చేస్తామని వెల్లడించారు. భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీ జరగనుండటంతో నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.

రాతపరీక్ష, ప్రతిభ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుందని సమాచారం. ఈ ఉద్యోగాలతో పాటు సింగరేణి సంస్థలో 1,436 ఇతర ఉద్యోగాల భర్తీ కూడా జరగనుందని తెలుస్తోంది. అతి త్వరలో ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రకటన కూడా వెలువడనుంది. 651 ఉద్యోగాల భర్తీలో 569 కార్మికుల ఉద్యోగాలు, అధికారిక పోస్టులకు సంబంధించిన 82 ఉద్యోగాలను భర్తీ చేస్తారని తెలుస్తోంది. ఆఫీసర్లు, జూనియర్ ఫారెస్ట్ అధికారులు, మేనేజ్ మెంట్ ట్రెయినీ ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారని తెలుస్తోంది.

ఈ ఉద్యోగాలు కాకుండా మిగిలిన కార్మికుల ఉద్యోగాలలో మౌల్డర్స్, మిషన్ ట్రెయినీలు, ఎలక్ట్రీషియన్, వెల్డర్ ట్రైనీలు, ఇతర ఉద్యోగాలను భర్తీ చేస్తారని తెలుస్తోంది. 1,436 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ ద్వారా స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్ట్ లు, టెక్నీషియన్లకు సంబంధించిన ఉద్యోగాలను భర్తీ చేస్తారని సమాచారం. మరోవైపు కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి సైతం వరుస నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి.

నిరుద్యోగులకు ప్రయోజనం చేకూర్చేలా వరుసగా నోటిఫికేషన్లు వెలువడుతూ ఉండటంపై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తెలంగాణ సర్కార్ సైతం ఏకంగా 50,000 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లను విడుదల చేస్తామని చెప్పిన సంగతి తెలిసిందే.