Tag Archives: size zero movie

Anushka: స్టార్ హీరో కొడుకు మాటలు నమ్మి మోసపోయిన అనుష్క.. ఇప్పటికీ బాధపడుతోందిగా?

Anushka: తెలుగు చిత్ర పరిశ్రమకు సూపర్ సినిమా ద్వారా పరిచయమైనటువంటి అనుష్క అనంతరం పలు సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. ఎంతో వినయంగా మంచి మనసుతో ఉన్నటువంటి అనుష్క అద్భుతమైన సినిమాలను ఎంపిక చేసుకొని వరుస సినిమాలతో అతి తక్కువ సమయంలోనే దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా పేరు ప్రఖ్యాతలు పొందారు.

ఇకపోతే ఈమె కెరియర్ ఎంతో సాఫీగా అద్భుతంగా కొనసాగుతున్న సమయంలో ఒక స్టార్ హీరో కొడుకు మాటలు నమ్మి దారుణంగా మోసపోయిందని తెలుస్తోంది.ఒక స్టార్ హీరో కుమారుడు ఈమెకు ఒక చెత్త సినిమా చేయమని సజెషన్ ఇచ్చారట ఆ సినిమా చేయడం వల్ల అనుష్క కెరియర్ పై కోలుకోలేని దెబ్బ పడిందని చెప్పాలి.

ప్రయోగాత్మక చిత్రాలను ఎంతగానో ఇష్టపడే అనుష్క వీక్నెస్ తెలుసుకున్నటువంటి ఆ బడా సన్ తనకు సైజ్ జీరో సినిమా చేయమని సలహా ఇచ్చారని తెలుస్తోంది.ఆ హీరో కొడుకు మాటలను గుడ్డిగా నమ్మిన అనుష్క ఏకంగా తన శరీర బరువును పెంచుకొని సైజ్ జీరో సినిమాలో నటించడంతో ఆ సినిమా సక్సెస్ కాకపోవడమే కాకుండా భారీగా అనుష్క పై ట్రోలింగ్స్ వచ్చాయి.

Anushka: శరీరాకృతిపై దృష్టి పెట్టిన అనుష్క…

ఇలా ఈ సినిమా కోసం పెరిగిన శరీర బరువు తిరిగి తగ్గాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇప్పటికి తాను అనుకున్న శరీరాకృతికి రాకపోవడంతో అనుష్క ఎంతగానో బాధపడుతుంది. ఈ విధంగా ఈమె శరీరాకృతి గురించి ఎన్నో ట్రోలింగ్స్ రావడంతో సినిమా ఇండస్ట్రీకి విరామం ప్రకటించి తన శరీర బరువును తగ్గించుకునే పనిలో పడ్డారు. ఇక ఈమె తాజాగా యువి క్రియేషన్స్ నిర్మాణంలో తెరకెక్కబోతున్న సినిమాలో హీరో నవీన్ పోలీస్ శెట్టితో కలిసి ఓ సినిమాలో నటించబోతున్నారు.