Tag Archives: Small saving schemes

పోస్ట్ ఆఫీస్ స్కీమ్ తో కోటి రూపాయిలు.. ఎలా అంటే?

కోటీశ్వరులు కావాలనే కల ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే ఇది అందరి విషయంలోనూ నెరవేరదని భావిస్తుంటారు. కానీ పోస్ట్ ఆఫీస్ అందించే ఈ స్కీమ్ ద్వారా ప్రతి ఒక్కరు కోటీశ్వరులు కావాలనే కలను నెరవేర్చుకోవచ్చు. అయితే ఇందుకు కొంత సుదీర్ఘ సమయం పడుతుంది. అదేవిధంగా ప్రతి రోజు మూడు వందల రూపాయలు మనం ఆదా చేసుకోగలిగితేనే కోటీశ్వరులు కావాలనే కల నెరవేరుతుంది.

ఇప్పటికే పోస్టాఫీసు ద్వారా ఎన్నో సేవింగ్ స్కీమ్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. పోస్టాఫీసుల్లో సేవింగ్స్ మనకు ఎప్పుడు ఏ ప్రమాదం కాదు.పోస్టాఫీస్ స్కీమ్స్‌లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ PPF పీపీఎఫ్ కూడా ఒకటి. పీపీఎఫ్ అనేది దీర్ఘకాల ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్. బెస్ట్ రిటైర్మెంట్ స్కీమ్ అని కూడా చెప్పవచ్చు.

ప్రస్తుతం ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ పై 7.1 శాతం వడ్డీ రేటు లభిస్తోంది. మీరు పోస్టాఫీస్ లేదా బ్యాంక్‌కు ఈ ఖాతాను తెరవచ్చు. ఈ స్కీమ్ పై వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం ప్రతి మూడు నెలలకొకసారి మారుస్తుంది. కొన్నిసార్లు వడ్డీ శాతం పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. మరికొన్నిసార్లు స్థిరంగా అయినా కూడా ఉండవచ్చు. అయితే ఈ స్కీమ్ ద్వారా సేవింగ్స్ చేయడం వల్ల ఎటువంటి రిస్క్ ఉండదు.

ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలం 15 సంవత్సరాలు కావాలంటే దీని కాలపరిమితి మనం పెంచుకోవచ్చు.ఈ స్కీమ్ ద్వారా ప్రతి రోజు మూడు వందల రూపాయలు ఆదా చేసుకొని నెలకు తొమ్మిది వేల రూపాయలను ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలో జమ చేయాలి.ఈ విధంగా 30 సంవత్సరాల పాటు ప్రతి నెల తొమ్మిది వేల చొప్పున జమ చేయడం వల్ల మీరు కోటీశ్వరులు కావాలనే కల నెరవేరుతుంది.

పోస్టాఫీస్, పీపీఎఫ్ స్కీమ్స్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేసిన వారికి కేంద్రం శుభవార్త..?

దేశంలో చాలామంది రిస్క్ లేకుండా డబ్బులు దాచుకోవడానికి స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ లో డిపాజిట్ చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. స్మాల్ సేవింగ్స్ స్కీమ్ లలో డిపాజిట్ చేయడం వల్ల ఎక్కువ వడ్డీని పొందే అవకాశం ఉండటంతో పాటు కచ్చితమైన లాభాలను పొందే అవకాశం ఉంటుంది. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్లలో కూడా డబ్బులు ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉన్నా వాటిలో రిస్క్ శాతం ఎక్కువ.

కొన్ని సందర్భాల్లో మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెడితే పెట్టుబడి కూడా రాకపోవడం జరుగుతుంది. కేంద్రం దేశంలోని ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా ఎన్నో పోస్టాఫీస్ స్కీమ్ లను అమలు చేయడంతో పాటు సుకన్య సమృద్ధి యోజన, పీపీఎఫ్ స్కీమ్ లను అమలు చేస్తోంది. ఈ స్కీమ్ లలో డబ్బులు ఇన్వెస్ట్ చేసిన వాళ్లకు కేంద్రం అదిరిపోయే శుభవార్త చెప్పింది. వడ్డీ రేట్లపై సమీక్ష చేసిన కేంద్రం వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు.

ప్రతి 90 రోజులకు ఒకసారి కేంద్రం వడ్డీ రేట్లపై సమీక్ష నిర్వహించి వడ్డీ జమ చేస్తుంది. ప్రస్తుతం దేశంలో ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు సేవింగ్స్ అకౌంట్లపై తక్కువ మొత్తం వడ్డీనే ఆఫర్ చేస్తున్నాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై కూడా వడ్డీ రేట్లు భారీగా తగ్గాయి. చాలామంది స్మాల్ సేవింగ్స్ స్కీమ్ ల వడ్డీరేట్లు కూడా తగ్గుతాయని భావించినా కేంద్రం ఆ స్కీమ్ లలో ఎలాంటి మార్పులు చేయలేదు.

ఈ నెల నుంచి 2021 మార్చి నెల వరకు ఇప్పటివరకు ఉన్న వడ్డీ రేటే వడ్డీ రేటుగా ఉంటుంది. మూడు నెలల తరువాత కేంద్రం మళ్లీ వడ్డీరేట్లపై సమీక్ష జరిపి వడ్డీరేట్లలో మార్పులు చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం పీపీఎఫ్ అకౌంట్ పై 7.1 శాతం, సుకన్య సమృద్ధి అకౌంట్‌పై 7.6 శాతం వడ్డీ లభిస్తోంది.

పోస్టాఫీస్‌లో స్మాల్ సేవింగ్ స్కీమ్స్.. తక్కువ పెట్టుబడితో కోటీశ్వరులయ్యే ఛాన్స్..!

భూప్రపంచంలో జీవించే ప్రతి ఒక్కరికీ డబ్బు సంపాదించాలనే ఆలోచన ఉంటుంది. కొందరు తెలివితో సులభంగా డబ్బు సంపాదిస్తే మరి కొందరు మాత్రం ఎంత కష్టపడినా డబ్బు సంపాదించలేక పోతున్నామని బాధ పడుతూ ఉంటారు. అయితే డబ్బును సరైన విధంగా పెట్టుబడులు పెట్టడం ద్వారా కూడా కోటీశ్వరులు కావచ్చు. అయితే స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెడితే కొన్నిసార్లు లాభాలు సొంతమైతే మరికొన్ని సార్లు నష్టాలను చవిచూడాల్సి వస్తుంది.

తక్కువ సమయంలో తక్కువ పెట్టుబడితో పోస్టాఫీస్ లో స్మాల్ సేవింగ్స్ స్కీమ్ ద్వారా అదిరిపోయే రాబడులను సులువుగా సొంతం చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సాధారణంగా కొన్ని చోట్ల పెట్టుబడులు పెడితే ఖచ్చితమైన లాభం వస్తుందనే గ్యారంటీ ఉండదు. అయితే పోస్టాఫీస్ లోని స్మాల్ సేవింగ్స్ స్కీమ్ లో మాత్రం ఖచ్చితమైన లాభాలు కూడా పొందవచ్చు. 5 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల కాలపరిమితితో పోస్టాఫీస్ స్మాల్ సేవింగ్స్ స్కీమ్ లను అందిస్తోంది.

ఆర్‌డీ, కిసాన్ వికాస్ పత్ర, పీపీఎఫ్, ఎన్ఎస్‌సీ లాంటి స్కీమ్ ల పట్ల ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఈ స్మాల్ సేవింగ్స్ స్కీమ్ లలో పెట్టుబడులు పెట్టడం ద్వారా పన్ను ప్రయోజనాలను కూడా పొందే అవకాశం ఉండటంతో ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థల్లో పని చేసే ఉద్యోగులు, వ్యాపారులు పన్ను ప్రయోజనాలను పొందవచ్చు. ఒక్కో స్కీమ్ లో వడ్డీ రేట్లు ఒక్కో విధంగా ఉంటాయి.

వడ్డీ రేట్లు, మెచ్యూరిటీ కాలాన్ని బట్టి అదిరిపోయే లాభాలను సొంతం చేసుకోవచ్చు. మోసపూరిత సంస్థలలో పెట్టుబడులు పెట్టి మోసపోవడం కంటే బ్యాంకులు, పోస్టాఫీస్ లలోని స్కీమ్ లలో పెట్టుబడులు పెట్టడం ద్వారా అదిరిపోయే రాబడులను సొంతం చేసుకోవడంతో పాటు అనేక లాభాలను పొందవచ్చు.