దేశంలో చాలామంది రిస్క్ లేకుండా డబ్బులు దాచుకోవడానికి స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ లో డిపాజిట్ చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. స్మాల్ సేవింగ్స్ స్కీమ్ లలో డిపాజిట్ చేయడం వల్ల ఎక్కువ వడ్డీని పొందే అవకాశం ఉండటంతో పాటు కచ్చితమైన లాభాలను పొందే అవకాశం ఉంటుంది. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్లలో కూడా డబ్బులు ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉన్నా వాటిలో రిస్క్ శాతం ఎక్కువ.
కొన్ని సందర్భాల్లో మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెడితే పెట్టుబడి కూడా రాకపోవడం జరుగుతుంది. కేంద్రం దేశంలోని ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా ఎన్నో పోస్టాఫీస్ స్కీమ్ లను అమలు చేయడంతో పాటు సుకన్య సమృద్ధి యోజన, పీపీఎఫ్ స్కీమ్ లను అమలు చేస్తోంది. ఈ స్కీమ్ లలో డబ్బులు ఇన్వెస్ట్ చేసిన వాళ్లకు కేంద్రం అదిరిపోయే శుభవార్త చెప్పింది. వడ్డీ రేట్లపై సమీక్ష చేసిన కేంద్రం వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు.
ప్రతి 90 రోజులకు ఒకసారి కేంద్రం వడ్డీ రేట్లపై సమీక్ష నిర్వహించి వడ్డీ జమ చేస్తుంది. ప్రస్తుతం దేశంలో ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు సేవింగ్స్ అకౌంట్లపై తక్కువ మొత్తం వడ్డీనే ఆఫర్ చేస్తున్నాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై కూడా వడ్డీ రేట్లు భారీగా తగ్గాయి. చాలామంది స్మాల్ సేవింగ్స్ స్కీమ్ ల వడ్డీరేట్లు కూడా తగ్గుతాయని భావించినా కేంద్రం ఆ స్కీమ్ లలో ఎలాంటి మార్పులు చేయలేదు.
ఈ నెల నుంచి 2021 మార్చి నెల వరకు ఇప్పటివరకు ఉన్న వడ్డీ రేటే వడ్డీ రేటుగా ఉంటుంది. మూడు నెలల తరువాత కేంద్రం మళ్లీ వడ్డీరేట్లపై సమీక్ష జరిపి వడ్డీరేట్లలో మార్పులు చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం పీపీఎఫ్ అకౌంట్ పై 7.1 శాతం, సుకన్య సమృద్ధి అకౌంట్‌పై 7.6 శాతం వడ్డీ లభిస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…