Tag Archives: Special Girl Child Scholarship

ఎల్‌ఐసీ బంపర్ ఆఫర్.. పది పాసైతే రూ.10,000.. ఇంటర్ పాసైతే 20,000!

దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పదో తరగతి, ఇంటర్ పాసైన విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. గోల్డెన్ జూబ్లీ స్కాలర్‌షిప్ 2019 ద్వారా ఎల్‌ఐసీ ప్రతిభ గల విద్యార్థులకు స్కాలర్ షిప్ ఇస్తోంది. ప్రజలకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో రకాల పాలసీలను తెచ్చిన ఎల్‌ఐసీ ప్రతిభ గల విద్యార్థులకు ప్రోత్సహించే దిశగా అడుగులు వేస్తోంది. ఎల్‌ఐసీ పాలసీల ద్వారా ఆర్థిక లక్ష్యాలను చేరుకునే అవకాశాలను, ఆర్థిక భద్రతను కల్పిస్తోంది.

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్పెషల్ గర్ల్ స్కాలర్‌షిప్, రెగ్యులర్ స్కాలర్‌షిప్ పేరుతో రెండు స్కాలర్ షిప్ లను ఇస్తోంది. ఇంటర్ పాసైన వాళ్లు రెగ్యులర్ స్కాలర్ షిప్ ను పొందవచ్చు. తల్లిదండ్రుల వార్షికాదాయం లక్ష రూపాయల లోపు ఉన్న విద్యార్థులు మాత్రమే ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంటర్ లో కనీసం 60 శాతం మార్కులతో పాసైన విద్యార్థులు ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

2018 – 19 అకాడమిక్ ఇయర్ విద్యార్థులు ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక్కో ఎల్‌ఐసీ డివిజినల్ సెంటర్‌కు పది మంది అబ్బాయిలు, పది మంది అమ్మాయిలకు డివిజనల్ స్కాలర్ షిప్స్ లభిస్తాయి. అదే విధంగా విద్యార్థినులు స్పెషల్ గర్ల్ చైల్డ్ స్కాలర్‌షిప్ ను పొందే అవకాశం ఉంటుంది. 2018 – 19 అకాడమిక్ ఇయర్ లో పది పాసైన విద్యార్హినులు ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఒక్కో ఎల్‌ఐసీ డివిజినల్ సెంటర్‌కు పది మంది విద్యార్థినులు ఈ స్కాలర్ షిప్ ను పొందవచ్చు. https://customer.onlinelic.in/liceps/portlets/visitor/gjf/gjfcontroller.jpf వెబ్ సైట్ ద్వారా ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రెగ్యులర్ విద్యార్థులకు సంవత్సరానికి 20,000 రూపాయలు, స్పెషల్ గర్ల్ చైల్డ్ స్కాలర్‌షిప్ కింద 10,000 రూపాయలు పొందే అవకాశం ఉంటుంది.