Tag Archives: Supratim Bandyopadhyay National Pension Scheme

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రధాని మోదీ బంపర్ ఆఫర్..?

ప్రధాన నరేంద్ర మోదీ మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మధ్య తరగతి ప్రజలకు మరో శుభవార్త చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. కేంద్ర ప్రభుత్వం నేషనల్ పెన్షన్ స్కీమ్ లో చేరిన వాళ్లకు పన్ను మినహాయింపు ప్రయోజనాలను సైతం కల్పించడానికి సిద్ధమవుతోంది. రాబోయే బడ్జెట్ ద్వారా కేంద్రం ఈ నిర్ణయాన్ని అమలు చేయనుందని సమాచారం అందుతోంది.

పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్ సుప్రతిం బంద్యోపాద్యాయ్ మాట్లాడుతూ కేంద్రం మధ్యతరగతి ప్రజలకు ప్రయోజనం చేకూర్చే దిశగా అడుగులు వేస్తోందని చెప్పారు. నేషనల్ పెన్షన్ స్కీమ్ కు సంబంధించి పన్ను మినహాయింపు ఇచ్చే దిశగా కేంద్రం అడుగులు వేస్తోందని.. కంపెనీ కంట్రిబ్యూషన్ ‌కు ఇది వర్తిస్తుందని తెలిపారు. అయితే కేంద్రం తీసుకోబోయే ఈ నిర్ణయం వల్ల కేంద్ర ప్రభుత్వ ఉధ్యోగులకు మాత్రమే ప్రయోజనం చేకూరనుందని సమాచారం.

సుప్రతిం బంద్యోపాద్యాయ్ నేషనల్ పెన్షన్ స్కీమ్ అకౌంట్ కు సంబంధించి 14 శాతం కంట్రిబ్యూషన్‌‌ పై పన్ను మినహాయింపు ప్రయోజనాలు కల్పించే దిశగా ప్రతిపాదనలు చేస్తున్నామని తెలిపారు. కేంద్రానికి కంపెనీలకు కూడా రాయితీ ప్రయోజనాలను కల్పించాలని సూచనలు చేస్తామని తెలిపారు. అయితే పలు రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర ఉద్యోగులకు సైతం పన్ను మినహాయింపు ప్రయోజనాలను కల్పించాలని సూచనలు చేస్తున్నాయి.

పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ నేషనల్ పెన్షన్ స్కీమ్ టైర్ 2 అకౌంట్ కు సైతం ఖాతాల్లో నగదు జమ చేస్తోంది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ప్రతి సబ్ స్క్రైబర్ కు ఈ ప్రయోజనం కల్పించనుందని తెలుస్తోంది.