ప్రధాన నరేంద్ర మోదీ మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మధ్య తరగతి ప్రజలకు మరో శుభవార్త చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. కేంద్ర ప్రభుత్వం నేషనల్ పెన్షన్ స్కీమ్ లో చేరిన వాళ్లకు పన్ను మినహాయింపు ప్రయోజనాలను సైతం కల్పించడానికి సిద్ధమవుతోంది. రాబోయే బడ్జెట్ ద్వారా కేంద్రం ఈ నిర్ణయాన్ని అమలు చేయనుందని సమాచారం అందుతోంది.
పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్ సుప్రతిం బంద్యోపాద్యాయ్ మాట్లాడుతూ కేంద్రం మధ్యతరగతి ప్రజలకు ప్రయోజనం చేకూర్చే దిశగా అడుగులు వేస్తోందని చెప్పారు. నేషనల్ పెన్షన్ స్కీమ్ కు సంబంధించి పన్ను మినహాయింపు ఇచ్చే దిశగా కేంద్రం అడుగులు వేస్తోందని.. కంపెనీ కంట్రిబ్యూషన్ కు ఇది వర్తిస్తుందని తెలిపారు. అయితే కేంద్రం తీసుకోబోయే ఈ నిర్ణయం వల్ల కేంద్ర ప్రభుత్వ ఉధ్యోగులకు మాత్రమే ప్రయోజనం చేకూరనుందని సమాచారం.
సుప్రతిం బంద్యోపాద్యాయ్ నేషనల్ పెన్షన్ స్కీమ్ అకౌంట్ కు సంబంధించి 14 శాతం కంట్రిబ్యూషన్ పై పన్ను మినహాయింపు ప్రయోజనాలు కల్పించే దిశగా ప్రతిపాదనలు చేస్తున్నామని తెలిపారు. కేంద్రానికి కంపెనీలకు కూడా రాయితీ ప్రయోజనాలను కల్పించాలని సూచనలు చేస్తామని తెలిపారు. అయితే పలు రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర ఉద్యోగులకు సైతం పన్ను మినహాయింపు ప్రయోజనాలను కల్పించాలని సూచనలు చేస్తున్నాయి.
పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ నేషనల్ పెన్షన్ స్కీమ్ టైర్ 2 అకౌంట్ కు సైతం ఖాతాల్లో నగదు జమ చేస్తోంది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ప్రతి సబ్ స్క్రైబర్ కు ఈ ప్రయోజనం కల్పించనుందని తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…