Tag Archives: swetha reddy

ముందు విడాకులు..తర్వాత ప్రేమించుకోవడాలు అంటూ వైయస్ షర్మిల పై సంచలన వ్యాఖ్యలు చేసిన శ్వేత!

వైయస్సార్ తనయ వైఎస్ షర్మిల తాజాగా తెలంగాణలో కొత్త పార్టీని ఆవిష్కరించిన సంగతి మనకు తెలిసిందే.తెలంగాణ రాష్ట్రంలో తిరిగి వైయస్ రాజశేఖర్రెడ్డి పాలనను తిరిగి తీసుకురావడం కోసమే తాను పార్టీని ఆవిష్కరించాలని ఇదివరకే తెలియజేశారు. ఈ క్రమంలోనే”వైయస్సార్ తెలంగాణ పార్టీ”ని ఏర్పాటు చేస్తున్నట్లు, షర్మిల వెల్లడిస్తూ జెండాను ఆవిష్కరించారు. ఈ క్రమంలోనే రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.

బండి సంజయ్ మాట మాట్లాడితే కెసిఆర్ అవినీతికి సంబంధించిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయని మాట్లాడుతారు. అయితే ఆ ఆధారాలను బయటపెట్టి కెసిఆర్ గారి పై చర్యలు తీసుకోవచ్చు కదా.కేంద్రంలో ఉన్నది బిజెపి ప్రభుత్వమే అయినప్పటికీ కేసీఆర్ అవినీతిని ఎందుకు బయటపెట్టడం లేదు అంటూ ఆమె బండి సంజయ్ అని ప్రశ్నించారు.

కెసిఆర్ చేస్తున్నటువంటి అవినీతికి సంబంధించిన ఆధారాలు బండి సంజయ్ దగ్గర ఉన్నప్పటికీ అవి బయట పెట్టకపోవడానికి గల కారణం వీరిద్దరి మధ్య ఒప్పందం ఉందని షర్మిల ఆరోపించారు.ఈ క్రమంలోనే వైయస్సార్ గురించి ఎవరైనా తప్పుడు మాటలు మాట్లాడితే కోట్ల మంది ఆయన అభిమానులు అసలు సహించరని వారిని పరిగెత్తించి కొడతారంటూ షర్మిల వార్నింగ్ ఇచ్చారు.

బిజెపి నాయకుడు బండి సంజయ్ పై తీవ్ర ఆరోపణలు చేసిన షర్మిలపై బిజెపి శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే యాంకర్ ..బిజెపి మహిళా నాయకురాలు శ్వేతారెడ్డి షర్మిలకు భారీ కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలోనే షర్మిల వ్యక్తిగత విషయాలను తెరపైకి తీసుకువస్తూ ఆమెపై పలు ఆరోపణలు చేశారు. తెలంగాణలో సమస్యలు వచ్చినప్పుడు ప్రశ్నించడానికి మీరు ఎక్కడికి వెళ్లారు…? పార్టీ పెట్టగానే తెలంగాణలో సమస్యలు గుర్తుకు వచ్చాయా? అంటూ షర్మిలను ప్రశ్నించారు.

అసలు కెసిఆర్ గారు, బండి సంజయ్ గారికి మధ్య ఎలాంటి డీల్స్ లేవు ఉన్నది మీకు కేసీఆర్ కంటూ ఆమె ఆరోపించారు.మీ మధ్య ఉన్న ఒప్పందం ఎక్కడ బయటపడుతుందో అన్న ఉద్దేశంతోనే ముందుగానే మా నాయకుడిపై ఈ విధమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. అలాంటి అవసరం మా నాయకుడికి లేదు ఆయనకు ముందుగా విడాకులు తీసుకొని లోలోపలే ప్రేమించుకోవడం …కాపురాలు చేయడం తెలియని కెసిఆర్ మెడలు వంచడానికి బండి సంజయ్ అసలు సిసలైన వ్యక్తి అంటూ ఇంకోసారి మా నాయకుడు గురించి మాట్లాడేటప్పుడు ఒకసారి ఆలోచించి మాట్లాడాలి అంటూ యాంకర్ శ్వేతారెడ్డి షర్మిలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.