Tag Archives: T20 World Cup

Kapil Dev: చోకర్స్ అంటూ టీమిండియా పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్?

Kapil Dev: టి20 ప్రపంచ కప్ మ్యాచ్లలో భాగంగా టీమిండియా సెమీఫైనల్స్ వరకు వెళ్లి ఇంగ్లాండ్ చేతిలో దారుణంగా ఓటమిపాలై ఇంటిదారి పట్టారు. ఇలా ఫైనల్ కు వెళ్లి కప్పు కొడుతుందని భావించిన వారికి టీమిండియా షాక్ ఇచ్చిందని చెప్పాలి.ఇలా సెమీఫైనల్స్ లో ఇంగ్లాండ్ చేతిలో ఓటమిపాలు కావడంతో ఎంతోమంది ఇండియన్ కాకుండా ఇతర దేశాల క్రికెటర్లు సైతం టీమిండియా పై విమర్శలు కురిపిస్తున్నారు.

ఈ సిరీస్ కి ముందు ఇండియా తప్పనిసరిగా కప్ అందుకుంటుందని ఎంతోమంది ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే చివరికి నిరాశతో వెనుతిరగాల్సి వచ్చింది. ఈ ఓటమిపై ఇండియన్ క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ స్పందించారు.ఈ సందర్భంగా ఆయన ఈ మ్యాచ్ గురించి మాట్లాడుతూ టీమ్ ఇండియాని చోకర్స్ అంటూ కామెంట్ చేశారు.

కపిల్ దేవ్ ఒక ఇంగ్లీష్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొని టీం ఇండియా పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే టీమ్ ఇండియాను చోకర్స్ అంటూ ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి అయితే చోకర్స్అంటే ఏంటి అనే విషయానికి వస్తే క్రికెట్ భాషలో టోర్నీలో కీలకమైన మ్యాచులలో అధిక ఒత్తిడిని తట్టుకోలేక ఓడిపోయే జట్టులను చోకర్స్ అంటారు.

Kapil Dev: విమర్శలు పాలవుతున్న టీమిండియా…


ఇలా ఈ పదాన్ని ఇదివరకు సౌత్ ఆఫ్రికాకు ఎక్కువగా ఉపయోగించేవారు. సౌత్ ఆఫ్రికా సైతం ఇలాంటి టోర్నమెంట్స్ లో ఫైనల్స్ వరకు వెళ్లి ఓటమితో వెనుతిరిగేది అయితే తాజాగా కపిల్ దేవ్ సైతం ఈ పదాన్ని టీమిండియాని ఉద్దేశిస్తూ చెప్పడంతో ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. టీమిండియా సైతం 2007 నుంచి నాలుగు సార్లు సెమీస్ కి చేరుకుంటే కేవలం ఒక్కసారి మాత్రమే కప్పు గెలిచిందని, ఇలా ఎక్కువసార్లు ఓటమిపాలు కావడంతో కపిల్ దేవ్ టీమ్ ఇండియాని చోకర్స్ అంటూ వ్యాఖ్యానించారు.

T20 World Cup: సెమీ పైనల్‌కి ముందు టీమిండియాకు షాక్.. విరాట్ కోహ్లీకి గాయం!

T20 World Cup: టీ20 వరల్డ్ కప్‌లో హాట్ ఫేవరేట్‌గా టీమిండియా బరిలోకి దిగింది. గత టీ20 వరల్డ్ కప్‌లో గ్రూప్ దశలోనే బయటకొచ్చిన టీమిండియా.. ఈ సారి ఎలాగైనా కప్ సాధించాలనే పట్టుదలతో ఉంది. కానీ టీమిండియా క్రికెటర్లు వరుసగా గాయాల పాలవుతుండటం ఫ్యాన్స్‌కు టెన్షన్ పెట్టిస్తోంది. ఇటీవల టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నెట్ ప్రాక్టీస్‌లో గాయపడగా.. పెద్దగా గాయం కాకపోడంతో టీమిండియా ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. కానీ తాజాగా టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ గాయడపటం అభిమానులను కలవరపెడుతోంది.

ఇంగ్లాండ్‌తో జరగనున్న రెండో సెమీ ఫైనల్‌కి సిద్దమవుతోన్న భారత ఆటగాళ్లు.. నెట్స్‌లో బాగా ప్రాక్టీస్ చేస్తోన్నారు. ఈ క్రమంలో నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తోండగా.. విరాట్ కోహ్లీకి తీవ్ర గాయమైంది. టీమిండియా ఫాస్ట్ బౌలర్ హర్షల్ పటేల్ బౌలింగ్‌లో కోహ్లీకి గాయమైంది. హర్షల్ పటేల్ వేగంగా వేసిన బంతి కోహ్లీకి గజ్జ ప్రాంతంలో తగిలింది. దీంతో తీవ్ర నొప్పితో కోహ్లీ కొద్దిసేపు బాగా ఇబ్బంది పడ్డాడు. కొద్దిసేపు మోకాళ్లపై కూర్చోని, ఆ తర్వాత మళ్లీ పైకి లేచి వార్మప్ చేశాడు. కానీ నొప్పి బాగా ఉండటంతో నెట్స్‌ను వదిలి బయటకు వెళ్లిపోయాడు.

విరాట్ కోహ్లీకి బాగా దెబ్బ తగిలిందని, గాయం తీవ్రంగానే ఉన్నట్లు చెబుతున్నారు. నేడు జరగనున్న రెండో సెమీ ఫైనల్‌కి ముందు కోహ్లీ గాయపడటం టీమిండియా శిబిరంలో టెన్షన్ రేపింది. హర్షల్ పటేల్ బౌలింగ్ లో కోహ్లీకి గాయమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గాయం తీవ్రంగానే ఉందని, కోహ్లీ టీ 20 వరల్డ్ కప్‌కు దూరం కానున్నాడనే ప్రచారం జరుగుతోంది.

T20 World Cup:

అయితే కోహ్లీకి గాయంకు సంబంధించి బీసీసీఐ నుంచి మాత్రం ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు. దీంతో ఫ్యాన్స్‌లో ఆందోళన మొదలైంది. ఈ టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లీ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. టీమిండియా తరపున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా ఉన్నాడు. ప్రతి మ్యాచ్‌లోనూ రన్స్ చేస్తూ మంచి టచ్‌లో కనిపిస్తున్నాడు.

Team India Vs England: రికార్డ్స్ పరంగా ఎవరు బలంగా ఉన్నారు? ఇండియానా? ఇంగ్లాండ్?

Team India Vs England: ఈ టీ20 ప్రపంచ కప్ క్రికెట్ అభిమానులకి ఇప్పటివరకూ ఫుల్ మీల్స్ పెట్టింది. ఎన్నో అద్భుతాలు చేస్తాయి అనుకున్న జట్లు ఇంటికి పంపివేయబడ్డాయి. పసికూనలు అనుకున్న జట్లు పెద్ద జట్లకు చెమటలు పట్టించాయి. ఇంటికి వెళ్ళిపోతుంది అనుకున్న పాకిస్తాన్ అనూహ్యంగా సెమీస్ కి వెళ్ళి అక్కడి నుంచి ఫైనల్ కి చేరింది. ఎవరూ అనుకుని ఉండరు పాకిస్తాన్ సెమీస్ కి వెళ్ళగలదు అని. అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది పాకిస్తాన్.

టీమిండియా ఇంగ్లాండ్ లలో రికార్డ్స్ పరంగా ఎవరు మెరుగ్గా ఉన్నారు?

ఇంకొక ఆసక్తికరమైన మ్యాచ్ కి రంగం సిద్ధమయ్యింది. ఫైనల్స్ లో స్థానం కోసం టీమిండియా ఇంగ్లాండ్ టీమ్ తో తలపడనుంది. ఇంగ్లాండ్ టీమ్ ని మట్టికరిపించి పాకిస్తాన్ తో ఫైనల్స్ లో తలపడాలని ఇండియా ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అయితే ఇంగ్లాండ్ టీమ్ ని తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదు. పొట్టి ఫార్మాట్ లో ఇంగ్లాండ్ టీమ్ చాలా మెరుగ్గా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

అసలు రికార్డ్స్ ఏం చెప్తున్నాయి ఇప్పుడు చూద్దాం. టీ20 ప్రపంచకప్‌లో మూడు సార్లు ఇరు జట్లు తలపడ్డాయి. అయితే రెండు సార్లు మెన్ ఇన్ బ్లూ గెలవగా ఒకసారి ఇంగ్లీష్ టీమ్ గెలిచింది. ఇక పొట్టి ఫార్మాట్ విషయానికొస్తే టీమిండియా కి మంచి గణాంకాలు ఉన్నాయి. సగం కంటే ఎక్కువ మ్యాచ్ లలో ఇండియా గెలిచింది. ఆడిన 22 మ్యాచ్ లలో 12 సార్లు విజేతగా నిలిచింది ఇండియా ఇందులో ఇంగ్లాండ్ గడ్డ మీద గెలిచిన మ్యాచ్ లలో కూడా ఉన్నాయి. అయితే 10 సార్లు ఇంగ్లాండ్ జట్టు గెలిచింది.

Team India Vs England: టీ20 వరల్డ్ కప్ పోటీలో ఇలా..

2007 టీ20 వరల్డ్ కప్,2009 టీ20 వరల్డ్ కప్,2012 టీ20 వరల్డ్ కప్ లలో ఇరు జట్లు తలపడ్డాయి. 2009 టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ గెలిస్తే మిగిలిన రెండు మ్యాచ్ లలో ఇండియా గెలుపు సొంతం చేసుకుంది. 2007 టీ20 వరల్డ్ కప్ లో యువరాజ్ సింగ్ బ్యాట్ తో వీరవిహారం చేసాడు.

T20 World Cup: టీం ఇండియన్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పై ప్రశంసలు కురిపించిన మొయిన్‌ అలీ.. ఏమన్నారంటే?

T20 World Cup: ప్రస్తుతం టి20 ప్రపంచ కప్ మ్యాచ్ పై ప్రతి ఒక్కరు తీవ్ర స్థాయిలో ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ మ్యాచ్లలో భాగంగా టీమిండియా హోరాహోరీగా పోటీ పడుతూ సెమీ ఫైనల్ కు చేరుకున్నారు. ఇక సెమి ఫైనల్ లో టీమిండియా మరోసారి తన సత్తా చాటడానికి సిద్ధమైంది.ఎలాగైనా ఈసారి కప్ కొట్టాలన్న కసితో టీం ఇండియన్ క్రికెటర్స్ కసరత్తుల నిర్వహిస్తున్నారు.

ఇకపోతే గురువారం టీమిండియా ఇంగ్లాండ్ మధ్య హోరా హోరీగా సెమి ఫైనల్స్ జరుగుతున్న నేపథ్యంలో ఇంగ్లాండ్ వైస్ కెప్టెన్ మొయిన్‌ అలీ టీమిండియా క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ గురించి పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ సూర్య కుమార్ యాదవ్ అద్భుతమైన షాట్లతో ఆట ఆడుతున్నారని ఈయన తెలిపారు.

గతంలో ఇంగ్లాండ్ జట్టుపై ఈయన విరుచుకుపడిన విషయాన్ని గుర్తు చేసుకొని అతని ఆట తీరు పట్ల ప్రశంసలు కురిపించారు.మూడో టి20 మ్యాచ్లో సూర్య కుమార్ యాదవ్ ను తానే అవుట్ చేశానని అయితే అప్పటికే ఆయన సెంచరీ చేసి అలసిపోవడం వల్లే తాను అవుట్ చేశానని ఈ సందర్భంగా ఆలీ సూర్య కుమార్ యాదవ్ పై ప్రశంసల వర్షం కురిపించారు.

T20 World Cup: ప్రపంచంలో అతనే బెస్ట్..

ఇక ఆ మ్యాచ్ లో టీమిండియా ఓడిపోయిన సూర్య కుమార్ యాదవ్ ఆడిన ఆట తీరు మాత్రం అద్భుతం. తన ఆటతో టి 20 మ్యాచ్ ను మరో స్థాయికి తీసుకెళ్లారని తెలియజేశారు. ప్రపంచంలో అతనే బెస్ట్ అని పేర్కొన్నటువంటి ఆలీ సెమి ఫైనల్స్ లో ఇంగ్లాండ్ జట్టు సూర్యకుమార్ యాదవ్ ను కట్టడి చేస్తామంటూ ఈయన ధీమా వ్యక్తం చేశారు.ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో ఉన్నటువంటి సూర్య కుమార్ యాదవ్ సెమీఫైనల్స్ లో కూడా ఇంగ్లాండ్ పై అదే దూకుడు ప్రదర్శిస్తాడా? లేకపోతే ఇంగ్లాండ్ బౌలర్లకు తన వికెట్ ను కానుకగా ఇస్తారా అనే విషయం తెలియాల్సి ఉంది.

T20 World Cup: వరల్డ్ కప్ గెలిచేది టీమిండియానే.. జోస్యం చెప్పిన ఏబీ డివిలియర్స్‌!

T20 World Cup: టి20 వరల్డ్ కప్ చివరి దశకు చేరుకుంది. ఈ క్రమంలోనే సెమీఫైనల్స్ అనంతరం ఫైనల్ జరుగునున్న నేపథ్యంలో ఫైనల్ లో ఏ ఏ జట్టు తల పడబోతున్నారు చివరికి వరల్డ్ కప్ ఎవరు గెలుస్తారో అనే విషయంపై తీవ్ర ఉత్కంఠత నెలకొంది ఇకపోతే ఇప్పటికే సెమీఫైనల్స్ లో చోటు సంపాదించుకున్న ఇండియా ఫైనల్ లో కూడా తలబడబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఫైనల్ లో టీమిండియా ఎవరితో పోటీ పడిపోతుంది ఎవరు కప్పు గెలుచుకుంటారనే విషయంపై సౌత్ ఆఫ్రికాకు చెందిన ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ జోస్యం చెప్పారు. ప్రస్తుతం ఇండియాలో పర్యటిస్తున్నటువంటి ఈయన సచిన్ టెండూల్కర్ తో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొనడమే కాకుండా పలు ప్రాంతాలలో పర్యటిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఏబీ డివిలియర్స్‌ వరల్డ్ కప్ గురించి మాట్లాడుతూ ఫైనల్ లో టీమిండియాతో న్యూజిలాండ్ పోటీ పడిపోతుందని ఈయన తెలిపారు. ఇక ఫైనల్ లో టీమిండియా విజయం సాధిస్తుందని ఈయన చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇక ఇప్పటికే సెమీఫైనల్ లో చోటు సంపాదించుకున్న జట్ల గురించి ప్రకటించిన విషయం తెలిసిందే మొదటి సెమీఫైనల్ లో పాకిస్తాన్ న్యూజిలాండ్ పోటీ పడగా రెండవ సెమీఫైనల్ లో ఇంగ్లాండ్ టీమిండియా పోటీ పడిపోతుంది.

T20 World Cup: కప్ టీమిండియాదే…

ఏబీ డివిలియర్స్‌ ప్రకారం మొదటి సెమీఫైనల్స్ లో పాక్ పై న్యూజిలాండ్ విజయం సాధించగా రెండవ సెమీ ఫైనల్ లో ఇంగ్లాండ్ పై టీమిండియా విజయం సాధిస్తుందని, ఫైనల్లో ఈ రెండు జట్లు పోటీ పడగా చివరికి ఇండియా కప్ గెలుచుకుంటుందని తెలియజేశారు. ఈ విధంగా వరల్డ్ కప్ మ్యాచ్ ను ఉద్దేశిస్తూ ఏబీ డివిలియర్స్‌ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈయన చెప్పినట్టుగానే ఫైనల్ లో టీమిండియా గెలిచి కప్పు సాధించాలనీ ప్రతి ఒక్క భారతీయుడు కోరుకుంటున్నారు.