Tag Archives: Talasani Srinivas Yadav

తెలంగాణలో అనాధలు ఉండరు_ మంత్రి సత్యవతి రాథోడ్

తెలంగాణాల ఇక అనాథలు ఉండరన్నారు స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్. హోమ్స్ లలో ఉండే పిల్లలకు అన్ని ప్రభుత్వమే చూసుకుంటుందని తెలిపారు. సీఎం కేసీఆర్ నియమించిన కేబినెట్ సబ్ కమిటీ అనాథ పిల్లల సంక్షేమానికి గొప్ప విధానం తీసుకుని రాబోతోందన్నారు సత్యవతి రాథోడ్.

కాగా తల్లిదండ్రులకు దూరమై హోమ్స్ లో ఉండే పిల్లలకు కుటుంబం ఏర్పడే వరకు ప్రభుత్వమే అండగా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్ లోని సైదాబాద్, నింబోలి అడ్డా ప్రాంతాలలో బాల, బాలికల సదన్ భవనాలను మంత్రులు సత్యవతి రాథోడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ ప్రారంభించారు.

ఈటెల రాజేందర్ పై ఫైర్ అయిన తలసాని!

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ పై ఫైర్ అయ్యారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. నాగార్జున సాగర్ లో జానారెడ్డికి పట్టిన గతే రాజేందర్ కి పడుతుందన్నారు. గెల్లు శ్రీనివాస్ ని బానిసగా పేర్కొనడం ఈటెల అహంకారానికి నిదర్శమన్నారు.

హుజురాబద్ ఉప ఎన్నికల్లో ప్రజలు ఈటెలకు తగిన రీతిలో బుద్ధి చెబుతారని తలసాని పేర్కొన్నారు. సీఎం కేసిఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలే శ్రీనివాస్ని గెలిపిస్తాయని స్పష్టం చేశారు.

ఉద్యమ నేతకు దక్కిన గుర్తింపు_ మంత్రి తలసాని

హుజరాబాద్ నియోజకవర్గానికి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించడం పై మంత్రి తలసాని స్పందించారు. యువకుడు, ఉత్సాహవంతుడైన గెల్లు శ్రీనివాస్ యాదవ్‌తో నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఉద్యమ నేతకు దక్కిన గుర్తింపుగా ఆయన అభివర్ణించారు.

కాగా రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవని తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న విపక్ష నేతలు, ఆ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇటువంటి పథకాలను అమలు చేస్తారాని అని ప్రశ్నించారు.