Tag Archives: tap water

వాటర్ బాటిల్లో నీరు తాగుతున్నారా.. అయితే ప్రమాదం పొంచి ఉన్నట్లే..?

చాలామంది పంపు నీరు, ట్యాప్ వాటర్ తాగితే రోగాలు వస్తాయని అందరు భావిస్తుంటారు. అయితే బాటిల్ వాటర్ కే ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తుంటారు. ప్రజల్లో ఈ అభిప్రాయం ఉండటం వల్లే వాటర్ బాటిళ్ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. వాటి కారణంగా పర్యావరణంపై 3,500 రెట్లు ఎక్కువగా ప్రభావం పడుతుందని బార్సిలోనా ఇనిస్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ నేతృత్వంలో జరిగిన అధ్యయనంలో వెల్లడైంది.

దీనికి సంబంధించి సైన్స్ ఆఫ్ ది టోటల్ ఎన్విరాన్మెంట్ జర్నల్‌లో ప్రచురితమయింది. ఎక్కువగా పంపు నీటిలో క్రిమిసంహారక మందులు వాడటంతో నీటిలోని ట్రై హలో మీథేన్ ఉత్పన్నమవుతుంది. దీని వల్ల మూత్రశయ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అయితే బార్సిలోనాలోని నీటి పంపులో తక్కువగా క్రిమిసంహారక మందులు తక్కువగా వాడటం వల్లే ముప్పు తక్కువగా ఉంటుందని ఈ అధ్యయనం వెల్లడించింది.

బాటిల్ వాటర్ తో పోలిస్తే పంప్ వాటరే మంచిదని పరిశోధకుడు క్రిస్టినా విల్లానుయేవా చెప్పారు. పంపు నీటిని వాడటం వల్ల వాటర్ బాటిల్ తో పర్యావరణానికి హాని కలకుండా ఉంటుందని పరిశోధకులు వెల్లడించారు. దీంతో ప్రజల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని అధ్యయనం సూచించింది.

ఇక్కడ వెల్లడించిన అధ్యయన ఫలితాల్లో బాటిల్ వాటర్ కంటే ట్యాప్ వాటరే చాలా మంచిదని తమ ఫలితాలు చూపిస్తున్నాయని శాస్త్రవేత్తలు చెప్పుకొచ్చారు. ఫిల్టర్ చేసిన నీరు కూడా ఇతర నీటితో పోలిస్తే చాలా ఆరోగ్యకరమని అక్కడి శాస్త్రవేత్తలు వివరించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతీ ఒక్కరు పాటపడాలని సూచించారు.