General News

వాటర్ బాటిల్లో నీరు తాగుతున్నారా.. అయితే ప్రమాదం పొంచి ఉన్నట్లే..?

చాలామంది పంపు నీరు, ట్యాప్ వాటర్ తాగితే రోగాలు వస్తాయని అందరు భావిస్తుంటారు. అయితే బాటిల్ వాటర్ కే ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తుంటారు. ప్రజల్లో ఈ అభిప్రాయం ఉండటం వల్లే వాటర్ బాటిళ్ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. వాటి కారణంగా పర్యావరణంపై 3,500 రెట్లు ఎక్కువగా ప్రభావం పడుతుందని బార్సిలోనా ఇనిస్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ నేతృత్వంలో జరిగిన అధ్యయనంలో వెల్లడైంది.

దీనికి సంబంధించి సైన్స్ ఆఫ్ ది టోటల్ ఎన్విరాన్మెంట్ జర్నల్‌లో ప్రచురితమయింది. ఎక్కువగా పంపు నీటిలో క్రిమిసంహారక మందులు వాడటంతో నీటిలోని ట్రై హలో మీథేన్ ఉత్పన్నమవుతుంది. దీని వల్ల మూత్రశయ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అయితే బార్సిలోనాలోని నీటి పంపులో తక్కువగా క్రిమిసంహారక మందులు తక్కువగా వాడటం వల్లే ముప్పు తక్కువగా ఉంటుందని ఈ అధ్యయనం వెల్లడించింది.

బాటిల్ వాటర్ తో పోలిస్తే పంప్ వాటరే మంచిదని పరిశోధకుడు క్రిస్టినా విల్లానుయేవా చెప్పారు. పంపు నీటిని వాడటం వల్ల వాటర్ బాటిల్ తో పర్యావరణానికి హాని కలకుండా ఉంటుందని పరిశోధకులు వెల్లడించారు. దీంతో ప్రజల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని అధ్యయనం సూచించింది.

ఇక్కడ వెల్లడించిన అధ్యయన ఫలితాల్లో బాటిల్ వాటర్ కంటే ట్యాప్ వాటరే చాలా మంచిదని తమ ఫలితాలు చూపిస్తున్నాయని శాస్త్రవేత్తలు చెప్పుకొచ్చారు. ఫిల్టర్ చేసిన నీరు కూడా ఇతర నీటితో పోలిస్తే చాలా ఆరోగ్యకరమని అక్కడి శాస్త్రవేత్తలు వివరించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతీ ఒక్కరు పాటపడాలని సూచించారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

తలనొప్పిని తేలికగా తీసుకుంటున్నారా? ఈ లక్షణాలు కనిపిస్తే ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయొద్దు!

తలనొప్పి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎప్పుడో ఒకసారి ఎదురయ్యే సాధారణ సమస్య. పని ఒత్తిడి, నిద్రలేమి, ఆందోళన, ఆకలి,…

3 hours ago

‘హెల్తీ’ అని నమ్మి కొంటున్నారా?.. ముందు ఇది తెలుసుకోండి.!

ఫుడ్ కంపెనీలపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ కొరడా.. ‘హెల్తీ’, ‘ఆర్గానిక్’ పేర్లతో వినియోగదారులను మభ్యపెడుతున్నారా? ఈ రోజుల్లో మార్కెట్‌లో అడుగుపెడితే ప్రతి రెండో…

5 hours ago

తల్లి గర్భంలో శిశువులు రోజంతా నిద్రపోతారా? పొట్టలో వీళ్లు చేసే పనులు చూస్తే ఆశ్చర్యపోతారు!

తల్లి గర్భంలో పెరుగుతున్న శిశువు గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు మనం వింటూ ఉంటాం. అయితే గర్భంలో ఉన్న బిడ్డ…

5 hours ago

కాక్రోచ్ పార్టీపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు.. దేశ సమగ్రతపై కీలక హెచ్చరిక

జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మరోసారి తన రాజకీయ వైఖరిని స్పష్టంగా వెల్లడించారు. దేశ…

8 hours ago

బరువు తగ్గాలని డిన్నర్ మానేస్తున్నారా? ముందు ఈ నిజాలు తెలుసుకోండి!

ఇటీవలి కాలంలో బరువు తగ్గడం కోసం ప్రజలు అనుసరిస్తున్న పద్ధతుల్లో ఒకటి రాత్రి భోజనం మానేయడం. ఉదయం అల్పాహారం, మధ్యాహ్న…

10 hours ago

కొత్త పెళ్లికూతుళ్లు గూగుల్‌లో ఎక్కువగా వెతికేది ఇదేనా? ఆసక్తికర విషయాలు వెలుగులోకి!

పెళ్లి అనేది ఒక వ్యక్తి జీవితంలో అత్యంత కీలకమైన మలుపు. ముఖ్యంగా మహిళలకు పెళ్లి తర్వాత జీవితం పూర్తిగా కొత్త…

10 hours ago