Tag Archives: Tata Motors

ఏపీ ప్రజలకు శుభవార్త.. రేషన్ డోర్ డెలివరీ ఎప్పటినుంచంటే..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2021 సంవత్సరం జనవరి నుంచి రాష్ట్రంలో రేషన్ డోర్ డెలివరీ విధానాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురానుంది. గతంలోనే ఈ విధానాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొనిరావాలని జగన్ సర్కార్ ప్రయత్నించినా వివిధ కారణాల వల్ల ఈ నిర్ణయం అమలు వాయిదా వడుతూ వస్తోంది. పౌరసరఫరాల శాఖ డోర్ డెలివరీ కోసం వాహనాలను త్వరగా అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తోంది.

జగన్ సర్కార్ డోర్ డెలివరీ వాహనాలకు సంబంధించి టెండర్లను ఇప్పటికే ఖరారు చేసింది. ఈ టెండర్లకు సంబంధించిన కాంట్రాక్ట్ టాటా మోటార్స్ సంస్థకు దక్కింది. మరోవైపు లబ్ధిదారులకు ఇచ్చే సంచులు, వాహనాలలో అమర్చే కాటాలకు సంబంధించి కూడా టెండర్లు ఖరారయ్యాయని సమాచారం. ప్రభుత్వం 520 కోట్ల రూపాయలు డోర్ డెలివరీ చేసే వాహనాల కొనుగోలు కోసం ఖర్చు చేయనుండగా టాటా మోటార్స్ సంస్థ ఒక్కో వాహనాన్ని 5.72 లక్షల రూపాయలకు టెండర్ దక్కించుకుందని తెలుస్తోంది.

సంక్షేమ కార్పొరేషన్ల నుంచి జగన్ సర్కార్ ఈ నిధులను ఖర్చు చేయనుందని తెలుస్తోంది. జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన కొత్తలో గ్రామ, వార్డ్ వాలంటీర్ల ద్వారా రేషన్ పంపిణీ ప్రక్రియ చేపట్టాలని భావిస్తోంది. అయితే ఈ విధానం ద్వారా ప్రభుత్వానికి ఖర్చు భారీగా పెరిగే అవకాశం ఉండటంతో జగన్ సర్కార్ డోర్ డెలివరీ వాహనాల ద్వారా రేషన్ డెలివరీ చేయాలని నిర్ణయం తీసుకుంది.

డోర్ డెలివరీ వాహనాల ద్వారా ప్రజలకు నాణ్యమైన బియ్యం, ఇతర సరుకులు ఇంటి దగ్గరే అందే విధంగా జగన్ సర్కార్ చర్యలు చేపడుతోంది. ప్రభుత్వం తీసుకున్న రేషన్ డోర్ డెలివరీ నిర్ణయాన్ని ప్రజలు ప్రశంసిస్తున్నారు. జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ప్రజలకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయాలు తీసుకుంటోందని చెబుతున్నారు.