Tag Archives: tea powder cost

అమ్మ బాబోయ్.. టీ పొడి కిలో రూ. 99,999.. ఎందుకింత ధర.. తెలుసా?

ఎన్ని డ్రింక్స్ ఉన్నా.. టీకి ఉండే ప్రత్యేకతే వేరు.. ఉదయాన్ని ఓ కప్పు టీ కడుపులో పడనిదే ఏ పని మొదలు పెట్టని వారు చాలా మంది ఉంటారు. ఉదయం నుంచి మొదలుపెడితే.. సాయంత్రం దాకా పదుల సంఖ్యలో టీలను తాగే టీ వ్యసనపరుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. టీ లేనిదే ఏ ఆతిధ్యం కూడా మొదలుకాదందే అతిశయోక్తి కాదు.. 

ఇలాంటి టీకి కారణమైన టీ పొడికి ఎంత ధర ఉంటుంది. ఒక కిలోకు వందల్లో ఉంటుంది.. మరి ఎక్కువ డిమాండ్ ఉన్న టీ పొడి అయితే మహా అయితే వెయ్యి రూపాయలు ఉంటుంది.. కానీ ఒక కిలో టీ పొడి పౌడర్ లక్ష రూపాయలు ఉందంటే ఎవరైనా నమ్ముతారా… నమ్మకపోతే టీ పొడి గురించి తెలుసుకోవాల్సింది. 

టీ పౌడర్లలో అస్సాంలో పండే టీ పౌడర్లకు ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ పండే తేయాకు మంచి సువాసన, టేస్ట్ ఇస్తుందని చాలా మంది చెబుతుంటారు. కాగా ఇటీవల నాణ్యమైన తేయాకును అక్కడి యజమానులు వేలానికి పెట్టారు. దీంట్లో కిలో టీ పౌడర్ ఏకంగా లక్ష రూపాయలు పలికింది. సౌరవ్ టీ ట్రేడర్స్ అనే సంస్థ ’మనోహరి గోల్డ్ టీ పొడి‘ని రికార్డ్ ధర పెట్టి కొనుగోలు చేశారు.

ఏకంగా రూ.99,999ను వేలంలో పాడి ఈ తేయాకును దక్కించుకున్నారు. గతంలో కూడా ఒక కిలో ఈ టీపౌడర్ రూ. 75 వేలకు అమ్ముడైంది. టీ కాచేటప్పుడు గోల్డ్ రంగు రావడం మనోహరి గోల్డ్ టీ పొడి ప్రత్యేకత. అంతే కాకుండా ఈ టీ వల్ల ఆరోగ్యపరమైన ప్రయోజనాలు ఉండటం కూడా టీ పొడికి ఈ రేటు పలుకుతోంది.