ఎన్ని డ్రింక్స్ ఉన్నా.. టీకి ఉండే ప్రత్యేకతే వేరు.. ఉదయాన్ని ఓ కప్పు టీ కడుపులో పడనిదే ఏ పని మొదలు పెట్టని వారు చాలా మంది ఉంటారు. ఉదయం నుంచి మొదలుపెడితే.. సాయంత్రం దాకా పదుల సంఖ్యలో టీలను తాగే టీ వ్యసనపరుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. టీ లేనిదే ఏ ఆతిధ్యం కూడా మొదలుకాదందే అతిశయోక్తి కాదు..
ఇలాంటి టీకి కారణమైన టీ పొడికి ఎంత ధర ఉంటుంది. ఒక కిలోకు వందల్లో ఉంటుంది.. మరి ఎక్కువ డిమాండ్ ఉన్న టీ పొడి అయితే మహా అయితే వెయ్యి రూపాయలు ఉంటుంది.. కానీ ఒక కిలో టీ పొడి పౌడర్ లక్ష రూపాయలు ఉందంటే ఎవరైనా నమ్ముతారా… నమ్మకపోతే టీ పొడి గురించి తెలుసుకోవాల్సింది.
టీ పౌడర్లలో అస్సాంలో పండే టీ పౌడర్లకు ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ పండే తేయాకు మంచి సువాసన, టేస్ట్ ఇస్తుందని చాలా మంది చెబుతుంటారు. కాగా ఇటీవల నాణ్యమైన తేయాకును అక్కడి యజమానులు వేలానికి పెట్టారు. దీంట్లో కిలో టీ పౌడర్ ఏకంగా లక్ష రూపాయలు పలికింది. సౌరవ్ టీ ట్రేడర్స్ అనే సంస్థ ’మనోహరి గోల్డ్ టీ పొడి‘ని రికార్డ్ ధర పెట్టి కొనుగోలు చేశారు.
ఏకంగా రూ.99,999ను వేలంలో పాడి ఈ తేయాకును దక్కించుకున్నారు. గతంలో కూడా ఒక కిలో ఈ టీపౌడర్ రూ. 75 వేలకు అమ్ముడైంది. టీ కాచేటప్పుడు గోల్డ్ రంగు రావడం మనోహరి గోల్డ్ టీ పొడి ప్రత్యేకత. అంతే కాకుండా ఈ టీ వల్ల ఆరోగ్యపరమైన ప్రయోజనాలు ఉండటం కూడా టీ పొడికి ఈ రేటు పలుకుతోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…