బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో మొత్తం 19 మందితో మొదలైంది. ప్రస్తుతం టాప్ 5 కంటెస్టెంట్లు మాత్రమే ఉన్నారు. ముందుగా ఎవరూ ఊహించని విధంగా టాప్ 5 లొ ఉండాల్సిన వాళ్లు చాలా మంది కూడా ఎలిమినేట్ అయ్యారు.
చివరకు సన్నీ, మానస్, సిరి, షణ్ముఖ్, శ్రీరామచంద్ర మిగిలారు. ఇక చివరి వారం టాప్ 6 కంటెస్టెంట్ కాజల్ ఇంటి నుంచి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఆమె బయటకు వచ్చిన దగ్గర నుంచి పలు ఇంటర్వ్యూలో పాల్గొన్నారు . హౌజ్ లో ఉన్న ప్రతీ కంటెస్టెంట్ గురించి ఆమె అభిప్రాయాలను బయట పెట్టేశారు.
ఆమె ఉద్దేశ్యం ప్రకారం టైటిల్ విన్నర్ కచ్చితంగా సన్నీ గెలుస్తాడని చెప్పుకొచ్చింది. అతడే విన్నర్ అవ్వడానకి గల కారణాలను కూడా చెప్పింది. అతడు పక్కన ఉంటే.. ఎంతటి బాధ అయినా పోతుందని.. హౌజ్ లో మోస్ట్ ఎంటర్ టైనర్ సన్నీ అంటూ చెప్పింది. హౌజ్ లో తనకు ఎక్కువగా కనెక్ట్ అయింది మానస్ అని.. మానస్ తనకు బెస్ట్ ఫ్రెండ్ అంటూ చెప్పింది.
తాను ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వడానికి హౌజ్ లోకి రాలేదని.. కానీ తనకు తెలియకుండా సన్నీ, మానస్ తో ఎక్కువగా కనెక్ట్ అయ్యానంటూ చెప్పింది. ఇక ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. తాను రెండు సార్లు మాత్రమే స్ట్రాటజీలను వాడానని.. కానీ.. ప్రతీ ఒక్కరికీ నాపై అదే అభిప్రాయం ఏర్పడిందని చెప్పుకొచ్చారు. ఇక టాప్ 5 కంటెస్టెంట్ల పొజిషన్ చెబుతూ.. సన్నీ, మానస్, శ్రీరామ చంద్ర, సిరి మరియు షణ్ముఖ్ అంటూ చెప్పుకొచ్చారు. విన్నర్ సన్నీ.. రన్నర్ మానస్ అవుతారని చెప్పింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…