నేచురల్ స్టార్‌గా పేరొందిన నటుడు నాని.. తను ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘ శ్యామ్ సింగరాయ్’లో డ్యూయల్ షేడ్ రోల్‌లో కనిపించబోతున్నాడు . నాని కెరీర్‌లోనే మొదటిసారి పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న సినిమా ‘శ్యామ్ సింగరాయ్’. ఈ సినిమా డిసెంబర్ 24న విడుదల కానుంది. ఇందులో నానికి జోడీగా సాయి పల్లవి, కృతి శెట్టి నటిస్తున్నారు.
దీనిలో మరో హీరోయిన్ కూడా ఉంది.. ఆమెనె మడోన్నా సెబాస్టియన్. ‘ఉప్పెన’తో బ్లాక్ బస్టర్ అందుకున్న కృతి శెట్టి ఈ సినిమాతో డిఫరెంట్ జోనర్‌లోకి అడుగుపెట్టనుంది. ఈ సినిమాలో సాయి పల్లవి.. ఓ బెంగాలి యువతిగా కనిపించనుందని సమాచారం. టైమ్ ట్రావెల్ చిత్రంగా తెరకెక్కిన శ్యామ్ సింగరాయ్‌ను రాహుల్ సాంకిృత్యాన్ డైరెక్ట్ చేశారు. విడుదలకు ముందే మంచి హైప్ పొందిందీ సినిమా. సినిమా నిర్మాతలు ఇప్పుడు ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.
వరంగల్‌లోని రంగలీలా మైదాన్‌లో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.ఇక్కడకు వచ్చిన ప్రేక్షకుల్లో ఫుల్ జోష్ కనిపించింది. యాక్షన్ డ్రామాను ప్రమోట్ చేయడానికి ‘శ్యామ్ సింఘా రాయ్’ టీమ్ ఈవెంట్‌కి హాజరైంది. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ట్రెడిషినల్ లుక్‌తో సాయి పల్లవి, మోడర్న్ లుక్‌తో కృతి శెట్టి అదిరిపోయారు. ఈ సినిమా విడుదలకు ముందు పుష్ప.. ఈ సినిమా తర్వాత ఆర్ఆర్ఆర్ ఉన్నాయని.. అయినా తాము ఏ మాత్రం వెనకడుగు వేయకుండా.. కథమీద ఉన్న నమ్మకంతో ఈ సినిమాను విడుదల చేస్తున్నామని చిత్ర బృందం సభ్యులు తెలిపారు.
ఇక ఈ ఈవెంట్ లో నాని మాట్లాడుతూ.. తనకు వరంగల్ అంటే ఇష్టమని.. ప్రీ రిలీజ్ ఈవెంట్ వరంగల్ లో ప్లాన్ చేస్తున్నానమి చెప్పగానే ఒప్పుకొని తమకు సహకరించిన మినిస్టర్ దయాకర్ కు నానీ కృజ్ఞతలు తెలిపారు. ఈ సినిమాలో ప్రతి ఒక్కరూ తమ పాత్రకు న్యాయం చేశారని.. సాయి పల్లవి ఓ ప్రత్యేకమైన సాంగ్ చేసిందని.. అందులో ఆమె డ్యాన్స్ అందరినీ ఆకట్టుకుంటుందని.. త్వరలోనే ఆ పాటను రిలీజ్ చేస్తామని అన్నారు. ఇందులో కృతి శెట్టి నటన అద్భుతమని చెప్పాడు నానీ.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…