Tag Archives: Tea Types

‘టీ’ లలోఎన్ని రకాలు ఉన్నాయో తెలుసా.. వాటి ప్రయోజనాలు తెలుసుకోండి..

సాధారణంగా చాలా మంది టీ తాగుతారు. కానీ మరికొంతమందికి ఎలా ఉంటుందంటే.. భోజనం చేయపోయినా పర్వాలేదు కానీ.. ఓ కప్పు టీ తాగందే వాళ్లకు పూట గడవదు. ప్రతీ రోజు మద్యం సేవించే వాడు.. ఒకరోజు మద్యం లేకపోతే ఎంత పిచ్చిగా ప్రవర్తిస్తాడో.. ఒక్క పూట టీ లేకుండా వాళ్లు కూడా అలానే చేస్తారు. అయితే టీ అనేది నిత్యవజీవితంగా భాగంగా మారింది.

టీ లో కూడా చాలా రకాలు ఉంటాయి. అవేంటంటే.. టీ పొడిలో కొన్ని పలుకుల్లా, కొన్ని మెత్తటి పొడిలా, మరికొన్ని ఆకుల్లా ఉండడం గమనించే ఉంటారు. టీ పొడి అనేది తేయాకు కెమల్లియా అనే మొక్క నుంచి వస్తుంది. ఈ మొక్కను ప్రాసెస్ చేసి.. తుది ఉత్పన్నంగా టీ పొడి తయారు చేస్తారు. ఏడు రకాల ప్రాసెస్ లు చేయబడతాయి. కొన్ని రకాల తేయాకును చైనాలో ఏళ్ల తరబడి నిల్వ ఉంచుతారు. పాత వైన్ కు డిమాండ్ ఉన్నట్టే పాత తేయాకుకు కూడా ఇక్కడ ఎక్కువగా డిమాండ్ ఉంటుంది.

అయితే టీలో కూడా అనేక రకాలుగా ఉంటాయి. అవన్నీ ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు చేకూరుస్తాయని నిపుణులు చెబుతున్నారు. జీవక్రియ రేటును పెంచి.. శరీర బరువును తగ్గించడంలో ఉపకరిస్తాయని చెబుతున్నారు. శరీరంలోని మంటను తగ్గించడానికి ‘బ్లాక్ టీ’ అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది. గ్రీన్ టీ అన్నది ప్రపంచ వ్యాప్తంగా చాలా పాపులర్. యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే దీన్ని ఆరోగ్యప్రదాయినిగా భావిస్తుంటారు.

తేయాకులకు కొన్ని పరిమళాలు జోడించి తయారు చేస్తారు. ఒరిజినల్ గ్రీన్ టీ అనేది పరిశుభ్రంగా, రుచికరంగా ఉంటుంది. ఊలాంగ్ టీ అనేది కూడా టీ రకాల్లో ఒకటి. ఈ టీ తామర వంటి చర్మ సమస్యలను నయం చేస్తుంది. వైట్ టీలో.. ధర అధికం. కాకపోతే చైనా తయారీకి, ఇతర దేశాల తయారీకి మధ్య వైవిధ్యం ఉంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇంకా మనం ఇంటి రెమిడీస్ లో పుదీనా, అల్లం టీ వంటివి కూడా తయారు చేస్తారు.