Tag Archives: Tirumala Sarvadarshanam tokens

తిరుమలకు వెళ్లే భక్తులకు గమనిక.. కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ పాలక మండలి..

తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది. అక్కడ ఎప్పుడూ భక్తులతో ఆలయం కిటకిటలాడుతూ ఉంటుంది. నిత్య తోరణం పచ్చ కల్యాణం లాగా ఎప్పుడూ ఆ శ్రీనివాసుడు పూజలు అందుకుంటాడు. అయితే ఇటీవల తిరుమల దర్శనానికి సంబంధించి టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలను తీసుకుంటుంది.

ఇటీవలే సర్వదర్శనం కోటాను పెంచిన టీటీడీ.. దీనికి అనుగుణంగా నిబంధనలు కఠినతరం చేస్తోంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఇలాంటి నిర్ణయాలను తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. సర్వ దర్శనం టోకెన్లు సెప్టెంబర్ 25 నుంచి ఆన్ లైన్లో అందుబాటలో ఉంటాయని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. రోజుకు 8 వేల టికెట్లను అందుబాటులో ఉంచుతామన్నారు.

అంతే కాకుండా దర్శనానికి వచ్చే భక్తులు రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకొని.. సర్టిఫికెట్ లేదా కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ కూడా తీసుకురావాలని పేర్కొన్నారు. ఆన్ లైన్ టికెట్ల జారీ తర్వాత ఇక ఆఫ్ లైన్లో టికెట్లను జారీ చేయమన్నారు. టికెట్ల వద్ద భక్తులు గూమిగూడటంతో కరోనా వ్యాప్తి పెరిగే అవకాశం ఉన్నందును ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

ఆన్ లైన్ లో టికెట్ ధర రూ.300 గా పేర్కొన్నారు. తిరుమలకు వచ్చే భక్తులు ఈ విషయాలను గుర్తుంచుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు నియంత్రణలో ఉండటంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నారు.