Tag Archives: to politics

Jayalalitha: వాణిశ్రీ తనకు మద్దతు తెలుపలేదని పంతానికిపోయి జయలలిత ఏం చేసారో తెలుసా?

Jayalalitha: సినిమా పరిశ్రమలో నటీమణులుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న జయలలిత వాణిశ్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తెలుగు తమిళ భాషలలో ఎన్నో సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ ఇద్దరు నటీమణులు ప్రాణ స్నేహితులు కూడా.అయితే సినిమా ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్న తర్వాత జయలలిత రాజకీయాలలోకి వచ్చారు. కానీ వాణిశ్రీ మాత్రం రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

వాణిశ్రీని రాజకీయాల గురించి ప్రశ్నించగా తనకు రాజకీయాలలోకి రావడం ఇష్టం లేదని ఐదు సంవత్సరాల పదవి కోసం రోడ్డుపై పడి పరువు మర్యాదలు పోగొట్టుకోవడం తనకు ఇష్టం లేదని తెలిపారు. అయితే జయలలిత మాత్రం రాజకీయాలపై మక్కువతో రాజకీయాలలోకి వచ్చారు. ఈ క్రమంలోనే ఆమెకు రాజకీయ రంగంలో మద్దతు తెలపాల్సిందిగా స్వయంగా జయలలిత వాణిశ్రీని కోరారు.

ఈ విధంగా జయలలిత కోరడంతో వాణిశ్రీ సున్నితంగా తిరస్కరించింది. దీంతో వాణిశ్రీ పై జయలలిత పట్టలేనంత కోపం పగ పెంచుకున్నారని తెలుస్తోంది. మొత్తానికి జయలలిత అధికారంలోకి వచ్చిన తర్వాత
సొంత పార్టీ ఏఐఏడీఎంకే.. నాయ‌కుడు.. ఒక‌రు వాణిశ్రీకి మ‌ద్రాసు శివారులో ఉన్న ఒక ఫాం హౌస్‌ను ఆక్ర‌మించుకున్నారు.

Jayalalitha: కోపంతోనే జయలలిత అలా చేసిందా…

ఈ క్రమంలోనే ఈ విషయంపై వాణిశ్రీ ఏకంగా ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినప్పటికీ జయలలిత ఏ మాత్రం తనకు న్యాయం చేయలేదట. కేవలం తనకు మద్దతు తెలుపలేదన్న కారణంతోనే తనపై పగ పెంచుకున్నారు. ఇక జయలలిత అధికారంలో లేకపోయినప్పటికీ ఆమెకు ఈ ఫామ్ హౌస్ విషయంలో న్యాయం జరగలేదని అమ్మ మాట కాదని ఎవరు కూడా తనకు న్యాయం చేయలేకపోయారని తెలుస్తోంది. దాదాపు 30 సంవత్సరాల తర్వాత తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తన ఫామ్ హౌస్ తిరిగి తనకు ఇప్పించారు.