Tag Archives: truce caller

ట్రూ కాలర్ వాడుతున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే..

ట్రూ కాలర్.. ఆండ్రాయిడ్ మొబైల్ వాడే ప్రతీ ఒక్కరి ఫోన్లలో ఈ యాప్ ఉంటుంది. అపరిచత వ్యక్తులు.. లేదా కొత్త నంబర్ల నుంచి ఏమైనా ఫోన్లు వస్తే.. ఎవరు చేస్తున్నారో తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అందుకే ఈ యాప్‌ను చాలా మంది వాడుతుంటారు. అంతే కాదు ఇటీవల ట్రూకాలర్ కూడా.. పేమెంట్ ఆప్షన్ ను కల్పించింది.

యూపీఐ ద్వారా దీని నుంచి కూడా డబ్బులను ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు. అయితే ఈ యాప్ సరికొత్త రికార్డును నెలకొల్పిందట. అదేంటంటే.. ప్రపంచవ్యాప్తంగా ఈ యూజర్ల సంఖ్య 30 కోట్లకు చేరిందని… అందులో మన భారతీయులే 22 కోట్ల మంది ఉన్నారంటూ.. ఆ సంస్థ ప్రతి నిధులు తెలిపారు. అంటే దాదాపు నలుగలో మూడొంతుల మన భారతీయులే ఉన్నారు.

ఈ ఏడాది యూజర్ల సంఖ్య 25 కోట్లు దాటేస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ యాప్ సేవలు దాదాపు 11 ఏళ్ల కిందటే ప్రారంభమయ్యాయి. మొదట ఎవరూ అంతగా ఆసక్తి చూపించలేదు. తర్వాత దీనిపై ఎక్కువగా నమ్మకం కలగడంతో.. వాడటం మొదలు పెట్టారు. ఇప్పటికి ఈ స్థితికి చేరుకున్నారు.

ఈ ట్రూకాలర్ యాప్ అనేది కేవలం కాలర్ ఐడెంటిటీ మాత్రమే తెలుసుకోవడమే కాదు.. స్పామ్‌ బ్లాకింగ్‌, స్మార్ట్‌ ఎస్సెమ్మెస్‌, ఇన్‌ బాక్స్‌ క్లీనర్‌, ఫుల్‌ స్క్రీన్‌ కాలర్‌ ఐడీ, గ్రూప్‌ వాయిస్‌ కాలింగ్‌.. ఇలా అనేక కొత్త సదుపాయాలను అందిస్తోంది. ఇంకా మరికొన్ని కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందు ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే కొత్త యూజర్లు చాలామంది వస్తున్నారని.. ఒక్క ఏడాదిలోనే 5 కోట్ల మంది ఈ యాప్ ను తమ మొబైల్లో ఇన్ స్టాల్ చేసుకున్నారని తెలిపింది.