Tag Archives: TSRTC MD VC Sajjanar

సాధారణ ప్రయాణికుడిగా మారిన వీసీ సజ్జనార్.. ఎందుకంటే..

తెలుగు రాష్ట్రాల్లో ఐపీఎస్ వీసీ సజ్జనార్ అంటే తెలియని వారుండరు.. క్రైంకు సంబంధించిన కేసులను డీల్ చేయడంతో ఆయనకు ఆయనే సాటి. ఐపీఎస్ అధికారిగా ఆయన తీసుకున్న నిర్ణయాలతో దేశంలోనే ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఐపీఎస్ అధికారిగా తన మార్క్ తో గుర్తింపు తెచ్చుకున్న సజ్జనార్.. టీఎస్ఆర్టీసీ ఎండీగా ప్రస్తుతం కొనసాగుతున్నాడు.

ఇదిలా ఉండగా అతడు సాధారణ ప్రయాణికుడు ఎలా బస్సులో ప్రయాణం చేస్తారో.. అలానే అతడు కూడా సాధారణ వ్యక్తిగా ప్రయాణించారు. బస్సు కండెక్టర్‌కు, ఇతర ప్రయాణికులు తానెవరో చెప్పకుండా ప్రయాణం చేశారు. అంతేకాకుండా తోటి ప్రయాణికులతో వారి బాధలను అడిగి తెలుసుకున్నారు. అతడు లక్డీకాపూల్ వద్ద గండి మైసమ్మ వైపు వెళ్లే బస్సు ఎక్కాడు.

కండెక్టర్ కు తనెవరో చెప్పకుండా.. టికెట్ తీసుకొని మరీ ఇలా ప్రయాణించాడు. అంతేకాకుండా అక్కడ నుంచి మళ్లీ ఎంజీబీఎస్ వెళ్లి అక్కడ సాధారణ వ్యక్తిలా కలియతిరుగుతూ.. పరిశుభ్రతను పరిశీలించారు. బస్టాండులోని మరుగుదొడ్ల పరిశుభ్రతను కూడా ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. అంతేకాకుండా ప్లాట్‌ఫాంపై నిలబడి ఉన్న సిబ్బందితో కూడా మాట్లాడి ఆదాయ వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఖాళీగా ఉన్న స్టాల్స్‌ను వెంటనే భర్తీకి చర్యలు చేపట్టి అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవాలని సూచించారు. ఇదిలా ఉండగా రాబోయే దసరాకు అదనపు బస్సులు నడుపుతూ.. ఆదాయాన్న పెంచుకోవాలంటూ సూచించారు. ఒక ఐపీఎస్ అధికారి ఇలా సాధారణ ప్రయాణికుడిగా.. తిరుగుతూ.. తన విధిలో భాగంగా వివరాలను తెలుసుకున్న అతడి సింప్లిసిటీని ప్రతీ ఒక్కరూ ప్రశంసిస్తున్నారు.