Tag Archives: unwanted use

కరెంట్ బిల్లు తక్కువగా రావాలంటే పాటించాల్సిన జాగ్రత్తలివే..?

దేశంలో రోజురోజుకు విద్యుత్ వినియోగం పెరుగుతోంది. విద్యుత్ తో పని చేసే ఉత్పత్తుల వాడకం పెరగడం విద్యుత్ వినియోగం పెరగడానికి కారణమవుతోంది. చాలామంది తాము తక్కువగానే విద్యుత్ ను వినియోగిస్తున్నా ఎక్కువ మొత్తంలో బిల్లు వస్తోందని చెబుతూ ఉంటారు. అయితే తెలిసీ తెలియక చేసే చిన్నచిన్న పొరపాట్లే ఎక్కువ మొత్తంలో బిల్లు రావడానికి కారణమవుతూ ఉంటాయి. చాలా సందర్భాల్లో మన నిర్లక్ష్యం వల్లే కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తూ ఉంటుంది.

అవసరం లేకపోయినా ఫ్యాన్లు వేయడం, తరచూ ఫ్రిజ్ తలుపులు తెరుస్తూ మూస్తూ ఉండటం, టీవీ స్విచ్ నిరంతరం ఆన్ లో ఉండి టీవీ ఆఫ్ లో ఉండటం, అవసరం లేని సమయంలో బల్బులు వెలుగుతూ ఉండటం, ఎక్కువ లైటింగ్ అవసరం లేకపోయిన చోట్ల కూడా ఎక్కువ వెలుగును ఇచ్చే లైట్లను వినియోగించడం, ఇతర కారణాల వల్ల కొన్నిసార్లు తక్కువ విద్యుత్ ను వినియోగించినా ఎక్కువ కరెంట్ బిల్లు వచ్చే అవకాశాలు ఉంటాయి.

మనం ఇంట్లో ఉపయోగించే తక్కువ ధర ఉన్న ఐసీఎల్ బల్బు విద్యుత్ వినియోగం సంవత్సరానికి 72 యూనిట్లు ఉంటుంది. ఒక బల్బుకు సంవత్సరానికి 264 రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. సీ.ఎఫ్.ఎల్ బల్బుకు సంవత్సరానికి 18 యూనిట్ల విద్యుత్ అవసరం కాగా 66 రూపాయలు విద్యుత్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఎల్.ఈ.డీ బల్బులు మాత్రం సంవత్సరానికి కేవలం 11 యూనిట్ల విద్యుత్ అవసరం అవుతుంది.

ఎల్.ఈ.డీ బల్బులకు విద్యుత్ ఛార్జీలు ఏడాదికి 40 రూపాయలుగా ఉంటాయి. ఎక్కువగా ఎల్.ఈ.డీ బల్బులను వినియోగిస్తే కరెంట్ బిల్లు తక్కువగా వస్తుంది. ఏసీలను 26 డిగ్రీల దగ్గర వినియోగించడం వల్ల కూడా కరెంట్ బిల్లులను ఆదా చేయవచ్చు. ఫ్రిజ్ లకు ఉన్న స్టార్ రేటింగ్ ను బట్టి విద్యుత్ వినియోగం అంతకంతకూ తగ్గుతుంది.